సమీక్ష : నా ఇష్టం – తికమక పెట్టే ప్రేమ కథ

విడుదల తేది : 23 మార్చి 2012
123తెలుగు.కాం రేటింగ్: 2.5/5
దర్శకుడు : ప్రకాష్ తోలేటి
నిర్మాత : పరుచూరి కిరీటి
సంగిత డైరెక్టర్ :చక్రి
తారాగణం : రానా దగ్గుబాటి , జెనిలియా

ఈ ఉగాదికి రానా దగ్గుబాటి ప్రేమ కథా చిత్రం “నా ఇష్టం”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జెనిలియా కథానాయికగా వచ్చిన ఈ చిత్రం ప్రకాశ్ తోలేటి దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మించారు. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చుద్దాం.

కథ:

గని(రానా), మలేసియాలో నివసిస్తూ పని చేసుకునే ఒక యువకుడు. ఇతను స్వార్ద్దపరుడు,ఎప్పుడు తన గురించి మాత్రమే ఆలోచించే మనస్తత్వం. తన జీవితంలోకి కృష్ణవేణి(జెనిలియా) వచ్చాక తన జీవితం తారుమారవుతుంది. కృష్ణ వేణి కిషోర్(హర్ష వర్ధన్ రాణే)ని ప్రేమిస్తుంది. కిషోర్ తో కలిసి కృష్ణవేణి ఇంట్లో నుండి పారిపోవాలని అనుకుంటుంది. కృష్ణవేణి తండ్రి నాయుడు(నాజర్) వీరి ప్రేమకు ఒప్పుకోకపోవటమే వీరు పారిపోవాలి అనుకోటానికి కారణం.కాని కిషోర్ అనుకున్న విధంగా జేనిలియాని చేరుకోడు మధ్యలో గని అతన్ని దారి మళ్ళిస్తాడు. గని కృష్ణవేణి ని తన తండ్రికి అప్పగించి డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో ఉంటాడు.

నాయుడు ఇంటికి కృష్ణవేణి ని తీసుకెళ్ళాక గని తను చేసిన తప్పేమిటో తెలుసుకుంటారు. కృష్ణవేణి ని మలేసియా తీసుకోచ్చేసి తన వల్ల అన్యాయం జరిగిన కృష్ణ వేణి జీవితాన్ని బాగుపరచడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రక్రియలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కిషోర్ జెనిలియా ప్రేమని తిరిగి సంపాదించడానికి ప్రయత్నిస్తుంటాడు ఇదిలా ఉండగా నాయుడు రానాని ట్రాప్ చెయ్యటానికి మలేసియా డాన్ సలీం భాయ్ ని సంప్రదిస్తాడు. గని తన తెలివిని ఉపయోగించి సలీం భాయ్ ని మరియు కిషోర్ ని బోల్తా కొట్టించాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో తను విజయం సాధించడా లేదా? కృష్ణ వేణి ఎవరిని తన జీవితంలోకి ఆహ్వానించింది అనేది మిగిలిన కథ.

ప్లస్:

రానా చూడటానికి చాలా బాగున్నారు. చిత్రంలో కొంచెం కొత్త రకమయిన డాన్స్ లు మరియు మ్యానరిజమ్స్ ప్రయత్నించారు. టైటిల్ ట్రాక్ కి అతను చేసిన డాన్స్ చాలా బాగున్నాయి మరియు చిత్రంలో ఫైట్ సన్నివేశాలలో అతని ఆహార్యానికి చాలా బాగా సరిపోయాయి. పశ్చిమ గోదావరి యాసలో అతని సంభాషణలు చాలా బాగున్నాయి. చిత్రాన్ని తన భుజాల మీద మోయటానికి చాలా ప్రయత్నించారు. ఎమోషనల్ సన్నివేశాలలో కాస్త ఇబ్బందిగా కదిలారు ఆ వైపుగా అయన కృషి చెయ్యాల్సి ఉంది.

జెనిలియా చూడటానికి చాలా బాగుంది కాని ఈ చిత్రం లో తను చెయ్యటానికి పెద్దగా ఏమి లేదు కాని కళ్ళతో భావాల్ని పండించటంలో తను దిట్ట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హర్షవర్ధన్ రానే కిషోర్ పాత్రలో పరవలేదనిపించారు.జోగి బ్రదర్స్ ను మళ్ళి తెర మీద చూడటం చాలా ఆనందం కలిగించే విషయం వీరు ఇరువురు వారి పాత్రల మేరకు బాగా నవ్వించారు. అలీ పరవలేదనిపించారు.

చిత్రంలో కొన్ని సన్నివేశాలు మనసుని హత్తుకునేలా ఉన్నాయి మొదటి అర్ధ భాగం చాలా వేగంగా సాగింది. రానా మరియు జెనిలియా మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి.ప్రత్యేకంగా రానా జెనిలియాకి ప్రపోజ్ చెయ్యటానికి రాబిన్ హుడ్ హ్యాట్లో వచ్చినపుడు సన్నివేశం అద్బుతంగా పండింది.

మైనస్:

ప్రకాశ్ తోలేటి దర్శకత్వం పెద్ద మైనస్. కథ చెప్పటంలో అసలు పరిపఖ్వత ప్రదర్శించలేకపోయాడు. రెండవ అర్ధ భాగంలో ఎక్కువ పాటలు ఉండటం మూలాన చిత్ర కథనం దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది. చాలా సన్నివేశాలకు లాజిక్ అస్సలు కనిపించదు.

రెండవ అర్ధ భాగంలో కథనంలో వేగం లేదు. నాజర్ పాత్రను వృధా చేశారు. బ్రహ్మానందం,ఆహుతి ప్రసాద్,సుబ్బరాజు మరియు రఘు బాబు పాత్రలు కూడా వృధా అయ్యాయి. ఇంతమంది హాస్య నటులున్నారు కాబట్టి మంచి హాస్యాన్ని జనం ఆశిస్తారు కాని చిత్రంలో అంతగా నవ్వించే సన్నివేశాలు కనపడలేదు.

క్లైమాక్స్ అసలు బాలేదు అనవసరంగా పొడిగించారు అనిపించింది. కొన్ని సన్నివేశాలు మలేసియాలో చిత్రీకరించలేదు వాటి కోసం బ్లూ మ్యాట్ ఉపయోగించినట్టు ప్రత్యేకంగా తెలిసిపోతుంది. ఆ సన్నివేశాలు చాలా వీక్ గా ఉన్నాయి. స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ ఉపయోగించారని సులభంగా కనిపెట్టేస్తారు.

త్రికోణ ప్రేమ కథను సరిగ్గా చూపించలేకపోయారు సన్నివేశాల్లో తగినంత భావోద్వేగాలను పలికించలేకపోయారు. చిత్ర కథలో చాలా కన్ప్యుజన్ కనిపిస్తుంది ప్రకాశ్ తను ఏం చెప్పాలనుకున్నాడో చివరికి మరిచిపోయినట్టు అనిపిస్తుంది

సాంకేతిక అంశాలు :

సినిమాటోగ్రఫి చాలా బాగుంది మలేసియాను చాలా బాగా చూపించారు. రానా సంభాషణలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ పరవలేదనిపించారు.డాన్స్ మరియు పోరాట సన్నివేశాలు చాలా బాగా చిత్రీకరించారు.
విఎఫ్ఎక్స్ అసలు బాగోలేదు ఈ అంశం మీద దృష్టి పెట్టాల్సి ఉంది. చక్రి అందించిన నేఫధ్య సంగీతం పెద్దగా లేదు. చిత్రంలో చాలా పాటలు ఉండటం చాలా ఇబ్బంది కలిగించే విషయం.

తీర్పు :

రానా తన డాన్స్ లు మరియు ఫైట్ ల తో చాలా వరకు కొత్తగా కనిపించడానికి ప్రయత్నించాడు. కాని తన ప్రయత్నం అంతా బలహీనమయిన స్క్రిప్ట్ కి బలయిపోయింది. జెనిలియాకి చెయ్యటానికి పెద్దగా ఏమి లేదు. ఎక్కువ పాటలు మరియు తికమక కథనం ఈ చిత్రంలో ఇబ్బంది పెట్టే అంశాలు. మొత్తానికి “నా ఇష్టం” నిరాశ పరిచే చిత్రం

123తెలుగు.కాం రేటింగ్ : 2.5/5

Clicke Here For ‘Naa Ishtam’ English Review

అనువాదం – రవి

Exit mobile version