ఇంత మంచి రెస్పాన్స్ ఊహించలేదు – దర్శకుడు పరశురామ్

parasuram
సోలో సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసాడు పరశు రామ్ . ఆ తరువాత రెండు మూడు సినిమాలు తీసిన ఆయన తాజాగా అల్లు శిరీష్ , లావణ్య త్రిపాఠి జంటగా శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో మరోసారి ముందుకు వచ్చాడు. గీత ఆర్ట్స్ పతాకం పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ తో రన్ అవుతుంది. ఈ సందర్బంగా దర్శకుడు పరశురామ్ చెప్పిన విశేషాలు …

మంచి రెస్పాన్స్ ..

శ్రీరస్తు శుభమస్తు సినిమాకు రెస్పాన్స్ సూపర్బ్. నేను ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చింది. ముక్యంగా టీజర్ కు ట్రైలర్ కు అంచనాలు మారిపోయాయి..మంచి ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల వారికి బాగా నచ్చింది. ముక్యంగా ఇలాంటి సినిమాలు హిట్ అయితే చాలా హ్యాపీ అదే డిస్ట్రర్బ్ అయితే ఇలాంటివి ముందు చేయాలంటే భయం వేస్తుంది.

ఆ పోలిక మంచిదేగా ..
ముక్యంగా సినిమాలో డైలాగ్స్ .. చాలా బాగా ఉన్నాయని అంటున్నారు .. అవన్నీ ప్రత్యేకంగా రాసుకున్నవి కాదు .. కథలో అలా వచ్చినవే .. ఇక ఈ సినిమాను సోలో , బొమ్మరిలు సినిమాలతో పోల్చడం మంచి విషయమే .. కదా, ఆ సినిమాలను కాపీ అని చెప్పలేదు గా, అలంటి మంచి సినిమాలతో పోల్చడం మంచిదే

శిరీష్ ఎఫర్ట్ ఎక్కువ ..

ఈ సినిమాకోసం శిరీష్ .. ఎఫర్ట్ ఎక్కువగా ఉంది .. నాకన్నా తనకు ఉన్న తపన చాలా ఎక్కువ. నేను రాయడానికి ,తీయడానికి కష్టపడ్డా కానీ తెరమీద మొత్తం చేసింది తనే. అలాగే మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్క్ బాగావుంది. నాకు నాచురల్ సినిమాలే ఇష్టం. కథలు మనకు దగ్గరలో జరిగినట్టు ఉండాలి, నేను కథ చెప్పడం మొదలు పెట్టిన తరువాత పదినిమిషాల్లో ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వాలి. నిజానికి ఈ కథ రాసిందే తనకోసం ఓ సందర్భంలో మీతో ఓ సినిమా చేయాలనీ ఉందని చెప్పాడు, తాను అలా చెప్పిన వెంటనే నాకు కూడా ఐడియా వచ్చింది. తనతో ఓ సినిమా చేస్తే బెటర్ అని అతనికోసం ఈ కథ రాసా.

లావణ్య మంచి ఆర్టిస్ట్ ..
హీరోయిన్ లావణ్య త్రిపాఠి చాలా చక్కగా చేసింది. తన చుట్టే ఈ కథ తిరుగుతుంది కాబట్టి .. ఓ మధ్యతరగతి అమ్మాయిగా బెట్టారు పర్ఫార్మెన్ ఇచ్చింది. ఇక షూటింగ్ కూడా అందరం పింక్నీక్ లా చేసాం. ముక్యంగా శిరీష్ , లావణ్య ల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.
ఇక అల్లు అరవింద్ కూడా చాల సపోర్ట్ ఇచ్చాడు. పరశురామ్ మంచి ఛాన్స్ ఇది చక్కగా ప్రూవ్ చేసుకో అని చెప్పాడు. నిజంగా ఇలాంటి పెద్ద బ్యానర్ లో ఛాన్స్ రావడం గ్రేట్ కదా..

నెక్స్ట్ సినిమాలు ..
గీత ఆర్ట్స్ బ్యానర్లో మరో సినిమా ఉంటుంది. ఇప్పటికే కథ చర్చలు కూడా జరిగాయి. అయితే హీరో ఎవరన్నది ఇప్పుడు చెప్పలేం.

Exit mobile version