ఆడియో సమీక్ష : దమ్ము – ఎన్టీఆర్ మాస్ అభిమానులకు కీరవాణి ఇచ్చే కానుక

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రిషా, కార్తీక ముఖ్య పాత్రల్లో నటించిన హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’. వేసవిలో ప్రేక్షకులను కనువిందు చేయడానికి వస్తున్న దమ్ము చిత్ర ఆడియో వేడుక ఈ రోజే (29 మార్చ్) న విడుదలైంది. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో వేడుక శిల్ప కళా వేదికలో అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. చంద్రబోస్ సాహిత్యం సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

1. పాట: ఓ లిల్లి
సింగర్స్: బాబా సెహగల్
సాహిత్యం: చంద్రబోస్
ఈ పాట పూర్తి స్థాయి మాస్ పాట. బాబా సెహగల్ ఫుల్ ఎనర్జీతో పాడాడు. ఎన్టీఆర్ బాగా డాన్స్ వేయడానికి స్కోప్ ఉన్న పాట. ముందు వరుస స్థాయి ప్రేక్షకులని ఈలలు వేయించే పాట. చంద్రబోస్ సాహిత్యం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. కీరవాణి మ్యూజిక్ లో మాస్ బీట్ బావుంది.

 

2.పాట: రూలర్
సింగర్స్: పృథ్విచంద్ర, గీతా మాధురి, రేవంత్, సాహితి
సాహిత్యం: చంద్రబోస్
ఈ చిత్ర ఆల్బంలో ప్రధాన ఆకర్షణ ఈ పాటనే. సినిమాలో హీరో పోషించే విభిన్న పాత్రల గురించి వివరిస్తూ స్లో బీట్ తో మొదలవుతుంది. హీరో గురించి వివరిస్తూ సాగే పాట.విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ పాటలో గ్రాఫిక్స్ అభిమానులను మరియు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయని సమాచారం. కీరవాణి మ్యూజిక్ పాటకి ప్రధాన ఆకర్షణ. సింగర్స్ అందరూ చాలా బాగా పాడారు.

 

3.పాట: రాజా వాసిరెడ్డి
సింగర్స్: ఎమ్. ఎమ్. కీరవాణి, కృష్ణ చైతన్య
సాహిత్యం: చంద్రబోస్
గ్రామంలో ప్రజలు సంభరాలు చేసుకుంటూ తమ ఊరి పెద్ద వారసుడిని పొగుడుతూ పాడుకునే పాట. హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ సాహిత్యం సాగుతుంది. హీరో పాత్రకు తన కుటుంబ గత చరిత్ర చెబుతూ సాగుతుంది. మొదటి సారి విన్నవెంటనే నచ్చుతుంది. కీరవాణి మరియు కృష్ణ చైతన్య ఇద్దరు పాటకి సరైన న్యాయం చేసారు.

 

4.పాట: వాస్తు బాగుందే
సింగర్స్: రాహుల్ సిప్లిగంజ్, శ్రవణ భార్గవి
సాహిత్యం: చంద్రబోస్
వాస్తు బాగుందే రెగ్యులర్ కీరవాణి స్టైల్లో సాగే పూర్తి మాస్ పాట. విశ్వసనీయ సమాచారం ప్రకారం ముగ్గురు లేదా నలుగురు హీరోయిన్లతో హీరో ఆడి పాడే పాట. చరణాల్లో శ్రవణ భార్గవి పడిన లైన్స్ చాలా బావున్నాయి. కీరవాణి బీట్ మొదటి సారి వినగానే నచ్చుతుంది. రాహుల్ సిప్లిగంజ్ కూడా పర్వాలేదనిపించాడు.

5.పాట: దమ్ము
సింగర్స్: రాహుల్ సిప్లిగంజ్, శ్రవణ భార్గవి, శివాని
సాహిత్యం: చంద్రబోస్
ముందు వరుస ప్రేక్షకుల కోసం కంపోజ్ చేసిన మాస్ బాట్ టైటిల్ సాంగ్. ఇద్దరు హీరోయిన్లతో హీరో ఆడి పాడుకునే పాట. సాహిత్యం సాధారణంగానే ఉన్నప్పటికీ చరణాల్లో మాస్ ని ఆకట్టుకునే పదాలున్నాయి. మాస్ రాహుల్ సిప్లిగంజ్, శ్రవణ భార్గవి, శివాని ముగ్గురు సింగర్స్ బాగానే పాడారు.

 

తీర్పు: ఆడియో విడుదల వేడుకలో రాజమౌళి అన్నట్లు ఆల్బం మొత్తం మాస్ ఆడియెన్స్ కోసం కంపోజ్ చేసిన పాటలున్నాయి. చాలారోజుల తరువాత 100% కమర్షియల్ ఆల్బం వచినదని చెప్పుకోవాలి. దర్శకుడు బోయపాటి శ్రీను కీరవాణి దగ్గరి నుండి తనకు కావాల్సిన పాటలు కంపోజ్ చేయించుకున్నారు. రూలర్, వాస్తు బాగుందే, రాజా వాసి రెడ్డి పాటలు మొదటిసారి వినగానే నచ్చుతాయి. మిగతా రెండు పాటలు కూడా పలుఅమర్లు వినగా నచ్చుతాయి. సినిమా ఓపెనింగ్స్ కి బాగా హెల్ప్ అవుతుంది ఈ ఆల్బం.

 

అనువాదం : అశోక్ రెడ్డి

Clicke Here For Dhammu English Audio Review

Exit mobile version