అక్కినేని హీరో నాగ చైతన్య, సౌతిండియన్ స్టార్ హీరోయిన్ సమంత ఇద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్థంలో పెళ్ళి చేసుకోనున్నట్లు ప్రకటించిన ఈ ప్రేమ జంట ఇప్పటికి తమ రిలేషన్షిప్లో ఒకరి ఇష్టాలను ఒకరు పంచుకుంటూ సరదాగా కాలం గడుపుతున్నారు. ఇక వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఈ సాయంత్రం హైద్రాబాద్లో జరగనుంది.
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేయనున్న ఈ వేడుక పూర్తి ప్రైవేటు కార్యక్రమంగా జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ పెయిర్స్లో ఒకరుగా ఈ జంటకు పేరుంది. అలాంటి జంట పెళ్ళితో ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతూ ఉండడం అభిమానులకు తియ్యటి కబురుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి తమ తమ కెరీర్స్తో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ, పెళ్ళి పీటలెక్కేది ఎప్పుడన్నది మాత్రం తెలియాలి.