ఆడియో సమీక్ష : యువతను ఆకట్టుకునే ఎందుకంటే ప్రేమంట ఆడియో


ఈ వేసవిలో ప్రేమికులని గిలిగింతలు పెడుతూ కుర్రకారుని ఆకట్టుకోవడానికి వస్తున్న చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’. ఎనర్జిటిక్ స్టార్ రామ్ మరియు వైట్ మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది. ప్రేమకథా చిత్రాలను అందంగా తెరకెక్కించే కరుణాకరన్ డైరెక్షన్లో జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

1. చిల్ అవుట్
గాయకులు : విజయ్ ప్రకాష్, ఆండ్రియా, బిగ్ నిక్కి మరియు మాయ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

చిల్ అవుట్ సరదాగా సాగే హీరో ఇంట్రడక్షన్ పాట. జివి ప్రకాష్ సంగీతం ఫాస్ట్ బీట్ తో సాగుతూ ఆకట్టుకుంటుంది. ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన విజయ్ ప్రకాష్ హుషారైన గాత్రంతో, నిక్కి ర్యాప్, ఆండ్రియా వెస్ట్రన్ స్టైల్లో పాడారు. యువత మనోభావాలకు అద్దా పడుతూ రామజోగయ్య సాహిత్యం సాగుతుంది. చిల్ అవుట్ సరదాగా సాగే హుషారైన పాట అని చెప్పుకోవచ్చు.

2. నీ చూపులే
గాయకులు : హరిచరణ్, చిత్ర
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

ఈ పాట ప్రారంభంలో వచ్చే మ్యూజిక్ బిట్ అధ్బుతంగా ఉంటుంది. రెహమాన్ కంపోజిషన్ షేడ్స్ ఉండే మెలోడి పాట. హరిచరణ్, చిత్ర ఇద్దరు చాలా బాగా పాడారు. చిత్ర గారు చాలా రోజుల తరువాత ఈ పాట పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఎటువంటి ఇంగ్లీష్ పదాలు లేకుండా అచ్చమైన తెలుగు పదాలతో ఆకట్టుకుంటుంది. చిత్రీకరణ సరిగ్గా కుదిరితే సినిమాలో ఈ పాట హైలెట్ అయ్యే అవకాశాలున్నాయి.

3. కిక్కో గిక్కో
గాయకులు : రాహుల్ నంబియార్, క్రిష్, రనిన రెడ్డి, మాయ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

పారిస్ గురించి వివరిస్తూ అక్కడ ఫ్యాషన్, వేష భాషల పై సరదాగా సాగే ఫాస్ట్ బీట్ సాంగ్. గాయకులంతా బాగా పాడారు. రామజోగయ్య సాహిత్యం పర్వాలేదనిపిస్తుంది. జివి ప్రకాష్ సంగీతంలో సిన్తే సిజార్ హొరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ ఫాస్ట్ బీట్ పాటలో రామ్ నుండి డాన్సులు ఆశించొచ్చు.

4. సిండ్రెల్లా
గాయకులు : రాహుల్ నంబియార్, మేఘ
సాహిత్యం : శ్రీమణి

రాహుల్ నంబియార్, మేఘ పడిన ఈ పాట రొమాంటిక్ డ్యూయెట్ పాటలో సంగీత హొరు ఎక్కువగా ఉంటుంది. చరణాల మధ్య వచ్చే గిటార్, వయోలిన్ బీట్స్ ఆకట్టుకుంటాయి. శ్రీమణి సాహిత్యం పర్వాలేదు.

5. ఎగిరి పోవే
గాయకులు : హేమచంద్ర, చిన్మయి
సాహిత్యం : రామజోగయ్య శాస్రి

హేమచంద్ర పాడిన ఎందుకంటే టైటిల్ సాంగ్ ఫాస్ట్ బీట్ తో సాగుతుంది. చిన్మయి కూడా పర్వాలేదనిపించింది. రామజోగయ్య సాహిత్యం అంతంత మాత్రంగానే ఉంది. ఈ వినగా వినగా నచ్చే అవకాశం ఉంది.

తీర్పు :
జివి ప్రకాష్ కుమార్ సంగీతంలో ఎందుకంటే ప్రేమంట ఆడియో మొదటి సారి వినగానే ఆకట్టుకోకపోయినా వినగా వినగా నీ చూపులే, కిక్కో గిక్కో, చిల్ అవుట్ పాటలు ఆకట్టుకుంటాయి. కరుణాకరన్, జివి ప్రకాష్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ స్థాయిలోనే ఈ చిత్ర పాటలు కూడా తెరపై చిత్రీకరణ బాగా తీసుంటారని ఆశిద్దాం.

అనువాదం : అశోక్ రెడ్డి

Clicke Here For Endukante Premanta Audio Review in English

Exit mobile version