మ్యూజిక్ రివ్యూ : నిన్ను కోరి – ఆహ్లాదంగా సాగిపోయే గీతాలు!


నాని హీరోగా నటిస్తున్న నిన్నుకోరి ఆడియో ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి మలయాళీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ సాంగ్స్ కంపోజ్ చేసాడు. మరి ఈ చిత్రంలోనే పాటలు ఎలా ఉన్నాయో కాస్తా తెలుసుకుందాం.

 

1. పాట : ఉన్నట్టుండి గుండె

విశ్లేషణ: ఈ పాట మెలోడీలో సాగే రొమాంటిక్ ఫీల్ గుడ్ సాంగ్. ఈ పాటని కార్తిక్ మరియు చిన్మయి ఆలపించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన రొమాంటిక్ సాంగ్స్ లో ఇది బెస్ట్ గా ఉందని చెప్పొచ్చు. ఈ పాటలో సాహిత్యం కూడా భాగా కుదరడంతో జనాలని విశేషంగా ఆకట్టుకునే అవకాశం వుంది. పాట చిత్రీకరణ కూడా బాగుంటే ప్రేక్షకులకి భాగా చేరువ అవుతుంది.

2. పాట : అడిగా… అడిగా..

విశ్లేషణ: అడిగా…అడిగా. పాట ఆల్బమ్ లో రెండో పాటగా వస్తుంది.ఈ పాట ఇప్పటికే సినిమా ప్రమోషనల్ సాంగ్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ కి భాగా రీచ్ అయ్యింది. ఈ పాట సినిమా మీద క్రేజ్ ని కూడా పెంచింది. సినిమాలో ఇది కూడా మెలోడియస్ గా సాగే ఫీల్ గుడ్ సాంగ్. సినిమా రిలీజ్ అయ్యాక ఒరిజినల్ వెర్షన్ కూడా, ప్రమోషనల్ సాంగ్ స్థాయిలో రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

3. పాట : ఒన్స్ అపాన్ ఎ టైం…

విశ్లేషణ: ఆల్బమ్ లో వచ్చే మూడో పాత ఇది. ఇందులో హీరో తన ప్రేమ కథని చాలా సరదాగా పరిచయం చేస్తూ ఆద్యంతం ఆహ్లాదంగా ఆఫ్ బీట్ లో చెబుతూ ఉంటాడు. ఇందులో వాడే సాహిత్యం కూడా సందర్బోచితంగా చిన్న చిన్న పదాలతో చాలా వర్ణించే విధానం బాగుంది. ఈ పాట యూత్ కి భాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో గోపిసుందర్ మార్క్ కంపోజింగ్ కనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయ్యాక ఈ సాంగ్ జనాలకి భాగా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

4. పాట :హే బదులు చెప్పవే…

విశ్లేషణ: ఇది ఆల్బమ్ లో వచ్చే నాలుగో పాట. ఇది సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య బ్రేక్ అప్ సాంగ్ గా వస్తుంది. ఈ పాట చాలా ఎమోషనల్ గా ఫీల్ గుడ్ తో గోపి సుందర్ తనదైన బాణీలు సమకూర్చాడు. ఇందులో సాహిత్యంలో కూడా ప్రేమించిన అమ్మాయి దూరమైతే కలిగే బాధ ఎ స్థాయిలో ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసారు. ఈ పాట లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్ళకి భాగా కనెక్ట్ అవుతూ, ఎన్నిసార్లు విన్న ఆకట్టుకుంటుంది.

 

తీర్పు:

హీరో నాని తన ప్రతి సినిమాలో కచ్చితంగా పాటలు అందరికి రీచ్ అయ్యేవిధంగా ఉండేట్లు చూసుకుంటాడు. అతని అన్ని సినిమాలు చాలా వరకు మ్యూజికల్ గా హిట్ అయినవె. అలాగే త్వరలో రాబోతున్న ఈ నిన్నుకోరి సినిమాలో కూడా ఉన్న నాలుగు సాంగ్స్ లో రెండు మెలోడీలో డిజైన్ చేసి, ఇంకోటి సరదాగా యూత్ ని కనెక్ట్ అయ్యే విధంగా, మరొకటి ప్రేమికులకు నచ్చే రీతిలో ఉండేట్లు చూసుకున్నాడు. ఈ సాంగ్స్ లో ఎక్కువ క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ కి దక్కుతుంది. తన బాణీల్లో ఉన్న క్లాసీ టచ్ ని తెలుగు ప్రేక్షకులని పరిచయం చేసే ప్రయత్నం చేసాడు.

Click here for the english music review

Exit mobile version