సమీక్ష : లవర్ – టైం పాస్ లవ్ స్టోరీ

Lover movie review
  • విడుదల తేదీ : జులై 20, 2018
  • 123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
  • నటీనటులు : రాజ్ త‌రుణ్‌, రిద్ధికుమార్
  • దర్శకత్వం : అనీశ్ కృష్ణ‌
  • నిర్మాత : హ‌ర్షిత్ రెడ్డి
  • సంగీతం : అంకిత్ తివారి
  • సినిమాటోగ్రఫర్ : స‌మీర్ రెడ్డి
  • ఎడిటర్ : ప్ర‌వీణ్ పూడి

 

రాజ్ త‌రుణ్‌, రిద్ధికుమార్ జంట‌గా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం ల‌వ‌ర్‌. దిల్‌రాజు నిర్మాణ సార‌థ్యంలో శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :

రాజ్ (రాజా తరుణ్) మంచి బైక్ బిల్డర్.టెక్నాలజీను వాడుకుంటూ కొత్తగా బైక్స్ ను డిజైన్ చేస్తాడు. అలా సంపాదించిన డబ్బుతో బ్యాకాంక్ కు బయల్దేరుతుండగా అనుకోకుండా జరిగే ఓ గొడవలో చేతికి బుల్లెట్ గాయం అవుతుంది. దాంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన రాజ్, అక్కడ నర్సు చరిత (రిద్ది కుమార్)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో పడేయటానికి చేసే ప్రయత్నంలో ఉండగా, చరిత మాత్రం అతన్ని పటించుకోదు. ఆ క్రమంలో పేసెంట్ అయిన లక్ష్మి అనే పాపతో అటాచ్ మెంట్ పెంచుకుంటుంది చరిత. ఆ పాపకు సంబంధించి అజేయ్ డాక్టర్స్ తో కలసి ఓ ముఖ్యమైన ఆపరేషన్ కోసం ప్లాన్ చేస్తాడు. ఇంతలో రాజ్ చేసే ఓ మంచి పని వల్ల చరిత రాజ్ తో ప్రేమలో పడుతుంది.

ఇద్దరు ఆ ప్రేమను ఎంజాయ్ చేస్తుండగా, చరితను తరుముతూ ఓ గ్యాంగ్ వెంటపడుతుంది. అసలు వాళ్ళు చరిత వెంట ఎందుకు పడుతున్నారు ? చరితకు, లక్ష్మి అనే పాపకు సంబంధం ఏమిటి ? రాజ్, వాళ్ళ నుండి చరితను ఎలా కాపాడుకున్నాడు ? ఈ జంటను కలపటానికి జగ్గు (రాజీవ్ కనకాల) ఏం చేశాడు ? చివరకి రాజ్, చరిత కలిసారా ? లాంటి విషయాలు తెలియాలంటే లవర్ చిత్రం చూడాలసిందే.

ప్లస్ పాయింట్స్ :

రాజ్ తరుణ్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. చిత్తూరు యాసలో మాట్లాడిన ఆయన మాడ్యులేషన్ కూడా బాగుంది. తన కామెడీ టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక కథానాయకిగా నటించిన రిద్ధికుమార్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ని ప్రేమలో పడేయటానికి చేసే ప్రయత్నాలకు సంబంధించిన సన్నివేశాలు, హీరోయిన్ మదర్ కు హీరోకు మద్య సాగే కేరళ సన్నివేశాలు బాగా అలరించాయి.

జగ్గు అనే వీధి రౌడీగా నటించిన రాజీవ్ కనకాల మరో మంచి పాత్ర చేశారు. ఆయన తన నటనతో ఏమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పండించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేసారు. ఎప్పటిలాగే అజయ్ తన గాంభీరమైన నతనతో ఆకట్టుకోగా సత్యం రాజేష్, సత్య తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో ఉన్నంతలో బాగానే నవ్వించారు.

‘అలా ఎలా’చిత్రంతో హిట్ కొట్టిన దర్శకుడు అనీశ్ కృష్ణ‌. మరోసారి అలాంటి ప్రయత్నమే చేసారు. ఫస్ట్ హాఫ్ ని సరదాగా నడిపిన అయన సెకండాఫ్ ను మాత్రం కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేసారు. సినిమాలో కార్ హ్యాంకింగ్ అనే కొత్త పాయింట్ ను టచ్ చేసి సినిమాలో కొత్తదనం తెచ్చే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

మొదటి భాగం సరదాగా సాగిన, రెండువ భాగం మాత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. దానికి కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించినట్లు అనిపిస్తోంది. ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ చాలా సింపుల్ గా తేల్చేసారు.

రాజ్ తరుణ్, సత్య, సత్యం రాజేష్ లాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ లు ఉన్నా వారి టాలెంట్‌ని వాడుకునేంతగా సన్నివేశాలు లేకపోవడంతో వాళ్ళు కూడా చాలా సేపు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. రాజీవ్ కనకాల క్యారెక్టర్ మంచి ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ క్యారెక్టర్ ఎండ్ చేసిన విధానం అంత సంతృప్తికరంగా ఉండదు.

సినిమాలో మంచి స్టోరీ లైన్ ఉన్నా, సినిమాలో విలువైన భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలకి స్కోప్ ఉన్నా, దర్శకుడు మాత్రం ఆ దిశగా ఆలోచినట్లు కనిపించలేదు. పైగా ప్రతి సన్నివేశం సినిమాటెక్ గానే బోర్ గానే సాగుతుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రెడిక్టుబుల్ గా నడుస్తుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు అనీష్ కృష్ణ కథను పేపర్ మీద రాసుకున్నంత అందంగా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు.ఆయన కథనం పై ముఖ్యంగా రెండువ భాగం పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

స‌మీర్ రెడ్డి నిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. ఐదుగురు సంగీత దర్శకులు పని చేసిన ఈ చిత్రంలోని పాటలు చాలా బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాలో పాటలే హైలెట్ గా నిలుస్తాయి. అలాగే జె.బి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని సాగతీత సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని హ‌ర్షిత్ రెడ్డి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :

దర్శకుడు అనీశ్ కృష్ణ‌ స్క్రిప్టు పగడ్బందీగా రాసుకొని ఉండి ఉంటే…ఈ చిత్రం ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా అయి ఉండేది. కానీ స్క్రిప్ట్ లో లోపాలు వల్ల అలా జరగలేదు. రాజ్ తరుణ్, రిధి కుమార్ మ‌ధ్య ప్రేమ కథ, ఇద్దరి మధ్య సాగే కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, మిగిలిన సన్నివేశాలను మాత్రం సాగదీశారనిపిస్తుంది. వాటికి తోడు నెమ్మదిగా సాగే కథనం, బలమైన భావోద్వేగాలు పండించే సన్నివేశాలు లేకపోవడం, రాజీబ్ కనకాల పాత్ర రూపంలో కొన్ని సన్నివేశాలు ఉన్నా, అవి కన్వీన్స్ గా లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. మొత్తం మీద పక్కా లవ్ స్టోరీతో తెరకెక్కిన లవర్ చిత్రం సంతృప్తికరంగా లేదనే చెప్పాలి.

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

Click here for English Review

REVIEW OVERVIEW
Lover Movie Review in Telugu
lover-movie-review-in-teluguరాజ్ త‌రుణ్‌, రిద్ధికుమార్ జంట‌గా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం ల‌వ‌ర్‌. దిల్‌రాజు నిర్మాణ సార‌థ్యంలో శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
Exit mobile version