సమీక్ష : సూపర్ స్కెచ్ – విఫలమైన క్రైం స్టోరీ

Premaku-Raincheck movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 07, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు : నర్సింగ్ మక్కల , ఇంద్రసేనా , సోఫియా

దర్శకత్వం : రవి చావలి

నిర్మాతలు : పద్మనాభరెడ్డి , బలరాం మక్కల

సంగీతం : కార్తీక్ కొడకండ్ల

సినిమాటోగ్రఫర్ : సురేందర్ రెడ్డి

ఎడిటర్ : జునైద్ సిద్దిఖీ

‘సామాన్యుడు , శ్రీమన్నారాయణ’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూపర్ స్కెచ్’. ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

7గురు ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఫారెన్ అమ్మాయి (స్టెల్లా)ను అదే గ్రూప్ కు చెందిన నలుగురు అబ్బాయిలు అత్యాచారం చేసి చంపేయాలనుకుంటారు. ఆనలుగురిలో వశి దానికి ముందే మర్డర్ వారి మీదకు రాకుండా స్కెచ్ వేస్తాడు. నలుగురు కలిసి స్టెల్లా ను అత్యాచారం చేసే క్రమంలో ఆమె ఎదురు తిరిగుతుంది. దాంతో స్టెల్లా కు డ్రగ్స్ ఇస్తారు అది ఓవర్ డోస్ అయ్యి ఆమె చనిపోతుంది. అదే సమయంలో ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ లోని మరో అమ్మాయి ప్రగ్య, స్టెల్లా ఇంటికి వస్తుంది . ఆమెను కూడా హత్యా చేయాలని ఆమెను తరుముతుంటే యాక్క్సిడెంట్ అయ్యి ఆమె కోమాలోకి వెళ్ళుతుంది. స్టెల్లా మృతి ఫై అనుమానం తో ఆమె తండ్రి పోలీస్ ఆఫీసర్ అయినా నాయక్(హీరో ) ను ఆశ్రయిస్తాడు. ఆ తరువాత నాయక్ ఆ నలుగురిని ఆధారాలతో ఎలా పట్టుకున్నారు అనేదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో నాయక్ పాత్రలో నటించిన నర్సింగ్ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెపుతూ ఆకట్టుకున్నాడు. కేసును సవాల్ గా తీసుకోని దాన్ని సాల్వ్ చేసిన తీరు బాగుంది. విలన్ బ్యాచ్ కు చెందిన నలుగురు కొత్తవాళ్లైనా బాగానే నటించారు.

వాళ్ల హావభావాలతో సినిమాపై ఆసక్తిని తీసుకోవచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. ఇక దర్శకుడు రవి చావలి సెకండ్ హాఫ్ లో తన పట్టు చూపించాడు. డ్రగ్స్ తీసుకున్నవారు ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని చక్కగా చూపెట్టాడు. ఇక సినిమాకు క్లైమాక్స్ లో వేగం తీసుకొచ్చి మంచి ముగింపును ఇచ్చాడు.

మైనస్ పాయింట్స్ :

క్రైమ్ స్టోరీ తోసూపర్ స్కెచ్ కథను రాసుకున్న రవి చావాలి దాన్ని ఆసక్తిగా తెరకెక్కించలేకపోయాడు. లో బడ్జెట్ లో నిర్మించిన చిత్ర కావడంతో తెలిసిన నటి నటులు ఈ చిత్రంలో ఎవరు కనబడరు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వచ్చే సన్నివేశాలు కూడా కూడా ఏమంత ఆసక్తిని క్రియేట్ చేయవు . ఫైగా ఫస్ట్ హాఫ్ చాలా వరకు బోర్ కొట్టిస్తుంది.

ఫోకస్ అంత డ్రగ్స్ మీద పెట్టి అసలు విషయాలను మరిచిపోయాడు డైరెక్టర్ రవి చావాలి. హీరోయిన్ పాత్రను ఎందుకు పెట్టారో కూడా అర్ధం కాదు . ఆమె ఈసినిమాలో చేసింది ఏమి లేదు. హీరోగా నటించిన నర్సింగ్ నటన అక్కడక్కడ కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయ్యాడని అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఈ క్రైమ్ థ్రిల్లర్ కథను తెరకెక్కించడంలో పూర్తిగా విఫలం చెందాడు. పెద్దగా ట్విస్టులు లేకుండా ఈ సినిమా సాగడం ఆద్యంతం బోర్ కొట్టిస్తుంది. కార్తీక కొడకండ్ల ఆంధిచిన సంగీతం కూడా అంతంతమాత్రంగానే అనిపిస్తుంది. వున్నవి రెండే పాటలు అవి కూడా గుర్తించుకోద్దగ్గవి కాదు. ముఖ్యం గా ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అవసరం దాంట్లోను తన ప్రత్యేకతను చూపించలేకపోయాడు. సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది.

ఎడిటర్ జునైద్ సిద్ధికి దాదాపుగా రన్ టైం ను చాల వరకు తగ్గించిన ఇంకా కొన్ని సన్నివేశాలు తొలిగిస్తే బాగుండు అని .అనిపిస్తుంది. బలరాం మక్కల , పద్మనాభారెడ్డి ల నిర్మాణ విలువలు పర్వాలేదు. సినిమాకు అవసరమైన మేర ఖర్చు పెట్టారు.

తీర్పు :

చాలా కాలం తరువాత మంచి క్రైమ్ కథను ప్రేక్షకులకు అందించాలనుకొని ఈ సూపర్ స్కెచ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రవి చావలి. ఆసక్తిలేని ట్విస్ట్ లు, సాగదీసిన సన్నివేశాలతో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం చెందాడు. హీరోగా నటించిన నర్సింగ్ డైలాగులు ఆకట్టుకునే అంశం కాగా సినిమాలోని మిగితా భాగం ప్రేక్షుకులకు అంతగా కనెక్ట్ అవ్వదు.

123telugu.com Rating : 1.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version