“మొగుడు” పేరుతో వస్తోన్న కృష్ణవంశీ ఫ్యామిలీ డ్రామాలో గోపీచంద్-తాప్సీ అలరించనున్నారు. ఈ సినిమాను నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు. బాబు శంకర్ ఈ చిత్రం తో తెలుగు తెరకు కొత్త సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల ఈ చిత్రం ఆడియో విడుదల అయింది. అంగరంగ వైభవం గా సాగిన ఈ కార్యక్రమమానికి చిత్ర పరిశ్రమ లోని ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు ఆ గీతాలు ఎంతగా సక్సస్ అవుతాయో ఓసారి పరికిద్దాం. …
పాట : కావాలి కావాలి
కళాకారులు : మధుమిత
రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి
ఈ గీతం తనకు కాబోయే భర్త గురించి ఊహించుకుంటూ హీరోయిన్ పడుకునే పాట. ఈ పాటను హృదయానికి హత్తుకునేలా సీతారామ శాస్త్రి రచించగా, బాబు శంకర్ శ్రావ్య మైన సంగీతం అందించారు. మధురిమ ఎంతో భావాత్మకంగా ఈ గీతాన్ని ఆలపించింది. ఈ ఆల్బంలోని మంచి పాటల్లో ఇదిఒకటి.
పాట : బ్యాచిలర్ బాయ్స్
కళాకారులు : బెన్నీ దయాళ్, బాబు శంకర్
రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
హీరోని పరిచయం చేసే ఈ క్లాసికాల్ సోలో సాంగ్ గోపీచంద్ మ్యారేజ్ కు ముందు వస్తుంది.
పాట : చూస్తున్నా
కళాకారులు : కార్తీక్
రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి
‘కావాలి కావాలి’ అనే పాటలో ఈ దఫా హీరో వంతు అన్నట్లుగా తన భార్య అందాలను హీరో పొగిడే సాంగ్. ఈ పాట ద్వారా మరోమారు సీతారామశాస్త్రి సాహిత్యం అంబరాన్ని తాకింది. ఈ మధ్య కాలంలో వస్తున్న పాటల్లో ఇదో గొప్ప గీతం అని చెప్పొచ్చు. కార్తీక్ ఈ పాటను వినసొంపుగా ఆలపించారు. ఈ సాంగ్ చిత్రీకరణలో కృష్ణవంశీ ప్రతిభ మొత్తం కనిపిస్తుందని ఆశించవచ్చు.
పాట : ఆకలకలక
కళాకారులు : హేమచంద్ర , చిన్మయీ
రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఇది భార్య , భర్త ల మధ్య ఒక శృంగార యుగళ గీతం. మూన్ లైట్ లో చిత్రించిన ఈ సెమి మసాల సాంగ్ లో కొరియోగ్రఫీ పూర్తి మాస్ గా ఉంది. ఈ సాంగ్ ప్రధానంగా ముందు సీట్లలో కూర్చునే ప్రేక్షకులను బాగా ఆకర్షించే విధంగా ఉంది.
పాట : ఎప్పుడు నీ రూపంలో
కళాకారులు : కార్తీక్
రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
హీరో హృదయాయాంతరాలం నుంచి వచ్చే ఈ పాటకు సీతారామ శాస్త్రి రచన అద్భుతం. ఈ పాటను మెలోడియస్ గా మలచటంలో బాబు శంకర్ పనితనం ప్రసంసనీయం. కార్తీక్ ఈ పాటను బాగా పాడారు. ఈ పాటకు అందరూ నెమ్మదిగా బానిసల్లా మారే అవకాశం కనిపిస్తోంది. ఇది మొత్తం ఆల్బం లోనే బెస్ట్ సాంగ్ అని చెప్పవచ్చు.
పాట : నువ్వంటే నాకు
కళాకారులు : సునీతా సారథి
రచయిత : రామ జోగయ్య శాస్త్రి
ఈ సాంగ్ మొదటి సారి విన్నప్పుడు ఒక బేయోన్స్ లేదా షాకిర పాట గుర్తొస్తుంది. ఈ పాటను బహుశా శ్రద్ధ దాస్ ఫై చిత్రీకరించి ఉండవచ్చు. సునీతా సారథి సాహిత్యం బావుంది. ఇందులో ఆమె సామర్ద్యం బయటపడుతుంది. బాబు శంకర్ అందించిన మ్యూజిక్ బావుంది. వింటుంటే ఉత్తేజాన్ని కలిగించే ఈ సాంగ్, అంతగా మదిలో నిలిచిపోయే సాంగ్ మాత్రం కాదు.
పాట : ఎట్టాంటీ మొగుడు
కళాకారులు : గీతా మాధురి
రచయిత : సుద్దాల అశోక్ తేజ
ఈ పాట నిన్నే పెళ్ళాడుత సినిమాలోని ‘నా మొగుడు రామ్ ప్యారీ’ తరహాలో సాగుతుంది. సాంగ్ చిత్రీకరణ కూడా అలానే ఉంటుందని ఊహించవచ్చు. ఇలాంటి రచనలు చేయటంలో సుద్దాల అశోక్ తేజ సిద్దహస్తుడు. ఈ పాటలో సంగీతం ఒక చక్కటి గ్రామీణ అనుభూతిని కలిగిస్తుంది.
తీర్పు : మొత్తంగా ‘మొగుడు’ ఆల్బమ్ లో కృష్ణ వంశీ బ్రాండ్ మార్క్ కనిపిస్తుంది. ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమైన బాబు శంకర్ అరంగేట్రం చక్కగా ఉంది. క్లాస్ ను మాస్ ను మెప్పించటం లో కృష్ణవంశీ ప్రతిభ కనిపిస్తుంది. ‘కావాలి కావాలి ‘, ‘ఎప్పుడు నీ రూపం లో’ మరియు ‘ఎట్టాంటీ మొగుడు’ పాటలు నాకు బాగా నచ్చాయి. ఈ పాటలను కృష్ణవంశీ అద్భుతమైన చిత్రీకరించినట్టు అనిపిస్తుంది.
– నారాయణ ఎ.వి