విడుదల తేదీ : నవంబర్ 22, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : జయప్రద, ఆకాష్ కుమార్, మిస్తీ చక్రబోర్తి
దర్శకత్వం : నరసింహ రావు
నిర్మాత : అశ్విని కుమార్
సంగీతం : కోటి
సినిమాటోగ్రఫర్ : రమణ సెల్వ
సీనియర్ నటి జయప్రద ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘శరభ’. రెండు సంవత్సరాలు నిర్మాణంలో వున్న ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుకముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
సింగాపుర గ్రామంలో ఈ చిత్ర కథ మొదలువుతుంది. ఆక్కడ చంద్రక్ష ( పునీత్ ఇస్సేర్ ) అనే క్షుద్ర మాంత్రికుడు అతీతమైన శక్తులను కావాలనుకుంటాడు. దీని కోసం అతను 18 ప్రత్యేక పూజలను నిర్వహించి నరబలి ఇవ్వాల్సి ఉంటుంది. ఈక్రమంలో దివ్య ( మిస్తీ చక్రబోర్తి ) ని చంపాలనుకుంటాడు. కానీ ఈపనికి శరభ (ఆకాష్ కుమార్) అతని తల్లి (జయప్రద) అడ్డుపడి చంద్రక్ష కు ఆ శక్తులు రాకుండా ఏం చేశారనేదే మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమా స్టార్ట్ కావడమే చాలా ఇంట్రస్టింగ్ ప్రారంభం అయ్యి చిత్రం ఫై ఇంట్రెస్ట్ ను తీసుకువస్తుంది. చిత్రం యొక్క కాన్సెప్ట్ కూడా చిత్రానికి బలంగా నిలిచింది.
ఇక చాలాకాలం తరువాత స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో నటించిన సీనియర్ నటి జయప్రద తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది.
ఇక హీరో ఆకాష్ కుమార్ శరభ పాత్రలో బాగా నటించాడు అలాగే హీరోయిన్ మిస్తీ , దివ్య పాత్రకు చక్కగా సరిపోయింది. ఇక స్పెషల్ పాత్రలో నటించిన నాజర్ తన నటనతో మెప్పించాడు.
మైనస్ పాయింట్స్ :
సినిమా ప్రారంభంలో మొదటి 10నిమిషాల తరువాత వచ్చే సన్నివేశాలు చాలా సిల్లీగా అనిపించి చికాకు కలిగిస్తాయి. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ కూడా బోర్ కొట్టిస్తుంది.
ఇక చిత్రంలో నాటకీయత మరి ఎక్కువగా ఉండడం వల్ల ఒకానొక స్టేజ్లో సినిమా ఫై ఆసక్తి సన్నగిల్లుతుంది. దీనికి తోడు నటీనటులు ఓవర్ యాక్షన్ చికాకు తెప్పిస్తాయి. ఇక కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసం క్లైమాక్స్ ను పొడిగించడం వల్ల సినిమా సాదాసీదాగా అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం :
అశ్విని కుమార్ నిర్మాణ విలువలు చిత్రానికి గ్రాండియర్ లుక్ ను తీసుకోవచ్చాయి. ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ లో వచ్చే సన్నివేషాల్లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఇక ఈచిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన కోటి ఫస్ట్ హాఫ్ లో ఒకే అనిపించాడు కానీ క్లైమాక్స్ సన్నివేశాలకు చాలా ఆర్డినరి సంగీతాన్ని అందించాడు. రమణ సెల్వ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాకు రిచ్ లుక్ ను తీసుకరావడంలో ఆయన విజయం సాధించాడు.
ఇక డైరక్టర్ నరసింహ రావు విషయానికి వస్తే మంచి కాన్సెప్ట్ ను తీసుకున్న దాన్ని తెరమీదకు తీసుకురావడం లో చాలా చోట్ల తడబడ్డాడు. ఆసక్తికరమైన సన్నివేశాలతో , గ్రిప్పింగ్ నరేషన్ ఉంటే కనుక ఈ చిత్రం మరో స్థాయిలో ఉండేదే.
తీర్పు :
థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ‘శరభ’ చిత్రం విజువల్ పరంగా ఓకే అనిపించుకున్న అనవసరమైన ఎమోషనల్ సన్నివేశాలు , అలాగే గ్రిప్పింగ్ లేని నరేషన్ చిత్ర ఫలితాన్ని దెబ్బతిశాయి. చివరగా ఈ చిత్రాన్ని థ్రిల్లర్ జోనర్ ను ఇష్ట పడేవారు ఒకసారి ట్రై చేయొచ్చు కానీ రెగ్యులర్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వదు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team