విడుదల తేదీ : జనవరి 04, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
నటీనటులు : అజయ్ అమన్ ,అంబికా ,ఝాన్సీ ,శివన్నారాయణ
దర్శకత్వం : ప్రేమ్ భగీరథ్
నిర్మాత : సూర్య కమల
సంగీతం : సాహిణి శ్రీనివాస్
సినిమాటోగ్రఫర్ : గణేశన్
ప్రేమ్ భగీరథ్ దర్శకత్వంలో అజయ్ అమన్ ,అంబికా జంటగా నటించిన చిత్రం అజయ్ పాసయ్యాడు. మరి ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
డిగ్రీ స్టూడెంట్ అజయ్ ( అజయ్ అమన్ ) తొలి చూపులోనే నందిని (అంబికా ) తో ప్రేమలో పడతాడు. అజయ్ చేసిన మంచి పనికి నందిని కూడా అజయ్ ని ఇష్టపడుతుంది. ఈ క్రమంలో తన ఫ్రెండ్ కు హెల్ప్ చేయబోయి అజయ్ ఒక తప్పుడు పని చేసి నందిని కి దొరుకుతాడు. ఆ తరువాత ఏం జరిగింది? వారిద్దరి ప్రేమ కథ ఎలా సుఖాంతమయ్యిందో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
అజయ్ పాత్రలో నటించిన అజయ్ అమన్ మొదటి చిత్రమైన కాన్ఫిడెంట్ గా నటించాడు. తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గా నటించిన అంబికా గ్లామర్ పరంగా అంతంతమాత్రంగానే ఉన్న నటన పరంగా పర్వాలేదనిపించింది.
ఇక హీరో తల్లి తండ్రుల పాత్రల్లో నటించిన ఝాన్సీ , శివన్నారాయణ వారి పాత్రలతో మెప్పించారు అలాగే దర్శకుడు కొన్ని కామెడీ సన్నివేశాలను బాగా డీల్ చేశాడు.
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీకి తోడుఎంగేజింగ్ గా లేని కథనం తో సినిమాను చాలా సాదా సీదాగా మార్చేశాడు దర్శకుడు. ఎంటర్టైన్ చేద్దామని ప్రయత్నించి విసుగు తెప్పించాడు. సినిమాలో ఝాన్సీ , శివన్నారాయణ తప్ప మిగితా అంతా కొత్తవారు కావటం అలాగే వారి నటన కూడా చిరాకు పెట్టించేలా వుంది.
ఇక హీరో, హీరోయిన్ తో ప్రేమ లో పడే సన్నివేశం కూడా చాలా సిల్లీగా ఉంటుంది. సినిమాలో ఒక్క పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ తో నీరసం వచ్చేలా చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ ను అదే రకంగా తెరకెక్కించాడు. దాంతో సినిమా ఎంటర్టైన్ చేయండం ఏమో కానీ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది.
సాంకేతిక విభాగం :
ఈ విషయంలో డైరెక్టర్ తో పాటు మిగితా సాంకేతిక నిపుణులు కూడా తేలిపోయారు. ముందుగా డైరెక్టర్ విషయానికి వస్తే ఇంట్రెస్టింగ్ స్టోరీ , గ్రిప్పింగ్ సన్నివేశాల తో సినిమా ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించలేకపోయాడు. ఇక సాహిణి శ్రీనివాస్ అందించిన సంగీతం బిలో యావరేజ్ గా వుంది. గణేశన్ సినిమాటోగ్రఫీ లో ప్రత్యేకత ఏమి లేదు. ఇక నిర్మాణ విలువలు కూడా ఆర్డినరీ గా వున్నాయి.
తీర్పు :
లవ్ &కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం రొటీన్ స్టోరీ తో ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా సిల్లీ సన్నివేశాలతో మెప్పించలేకపోయింది. దాంతో ఈచిత్రం అటు యూత్ కు అలాగే ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. చివరగా ఈ చిత్రానికి దూరంగా ఉండడమే మంచిది.
123telugu.com Rating : 1.5/5
Reviewed by 123telugu Team