రాజమౌళి చిత్రం మర్యాదరామన్న లోని పాట ‘తెలుగమ్మాయి’ ప్రేరణతో దర్శకుడు రాజా వన్నెంరెడ్డి తన చిత్రానికి అదే శీర్షిక ను పెట్టాడు. హీరోయిన్ గా కూడా అదే అమ్మాయి సలోని ని ఎంచుకున్నాడు. ఇవాళ తెలుగమ్మాయి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్ర తీరు తెన్నులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
చిత్రం గురించి : ప్రారంభంలోనే కాళిదాసు (షఫీ) హాస్టల్ లో ఉండే ఒక యువతి ని రేప్ చేసి హత్య చేస్తాడు. కట్ చేస్తే.. టీవీ న్యూస్.. తరచూ ఇదే తరహా హత్యలు కొనసాగుతున్నా ఇంతవరకూ హంతకుణ్ణి పట్టుకోలేకపోయరంటూ వార్త. కట్ చేస్తే.. రైల్వే స్టేషన్.. అక్కడ శివ, చిన్న, మున్నా సహా కొన్ని పాత్రలు ఒకటి వెంట ఒకటి పరిచయమవుతాయి. వీరంతా బాల త్రిపుర సుందరి (సలోని) ని ఆకట్టుకోవటానికి ప్రతినబూనతారు. ఇదిలాఉంటే, ఎంత నెమ్మదిగా వెళ్ళగలిగితే అంత నెమ్మదిగా సినిమా, హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ప్రయాణిస్తుంది. ఇంతలో కాళిదాసు ఎంటరై అందరితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. హాఫ్ సారీ లో ఉన్న మన హీరోయిన్ తో ఇంకాస్త ఎక్కువ చేస్తుంటాడు. దీనికి బాయ్స్ అంతా కలసి ఏదోటి చేయాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళు ఏమి చేసారు. అతన్ని చంపేసారా…! శవాన్ని దూరంగా పడేశారా… ఇంతకాలం పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న హంతకుణ్ణి పోలీసులు పట్టుకున్నారా..?, వాళ్ళు నిజంగా ముద్దయిలేనా, ఒక రాపిస్ట్ ని చంపితే అది నేర మవుతుందా ? తదితర సమాధానాలకు తెలుగమ్మాయి చూడాలి. .
ఇవి బాగున్నాయి : మొదటి యాభై నిమిషాలు అసలు ఏమిటి , ఎందుకు జరుగుతుందో తెలియదు. ఎంత వ్రాద్దామన్నా ఏమి ఉండదు. సాయి కుమార్ మాత్రం అతిథి పాత్ర లో మెప్పించాడని చెప్పవచ్చు. చిన్న విల్లన్ రోల్ ను షఫీ అద్భుతంగా పోషించాడు. అయితే చిన్న చిన్న స్క్రీన్ ప్లే లోపాలతో తెలుగమ్మాయి గజిబిజిగా మారింది.
ఇవి బాగు లేవు : సినిమాలో సలోని ని చూస్తుంటే చాల అసౌకర్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మొదటి అర్ధభాగంలో ఆమె బిగ్గరగా మాట్లాడే తీరు ఏమాత్రం మెప్పించదు. ఇతర తారాగణం.. వేణు మాధవ్, గీతా సింగ్, ఝాన్సీ, ఎంఎస్ నారాయణ పాత్రలు చూడటానికి ఆసక్తి కరంగా ఉండవ్. కాని సాధారణంగా వారి పాత్రలకు మాత్రం న్యాయం చేసినట్టే కనిపిస్తుంది. ఇతర నలుగురి కుర్రాళ్ళు చూడటానికి బాగున్నప్పటికీ సరిగా నటించాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం రాలేదు. ఎందుకంటే, దర్శకుడు ట్రైన్ సీక్వేన్సు ను విపరీతంగా సాగదీయటమే ఇందుకు కారణం. వెంకి సినిమాలో శ్రీను వైట్ల మాదిరి ట్రైన్ సీన్ నడపాలనుకున్న దర్శకుడు ఈ సందర్భంలో కథను చెప్పటం పై పట్టు కోల్పోయాడు. తర్వాత రియలైజ్ అయినప్పటికీ, సినిమాను కామిక్ త్రిల్లర్ గా నడపాలా లేక ఉమెన్ ఓరిఎంటేడ్ మూవీగా తీర్చిదిద్దలా అనే మీమాంసలో దర్శకుడు పడిపోయాడు. సన్నివేశాలు కథకు పొసగక పోవటం బాధాకరం.
సాంకేతిక విభాగాలు : ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ చాలా పేలవంగా ఉన్నాయి. డైలాగ్స్ బిలోయావరేజ్ గా పేలాయి. ఈ డిపార్టుమెంటులో మరింత కసరత్తు చేసి ఉండాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పనక్కరలేదు. చివరలో స్క్రీన్ ప్లే కొంత బావున్నప్పటికీ దర్శకుడు ఐటెం సాంగ్ ను చొప్పించటంతో అదికాస్తా నాశనం అయిపోయింది .
ఉప సంహారం : ఒక తెలుగు సినిమా సమీక్షకుడిగా నేను చెప్పేదేమిటంటే.. ఈ సినిమాను చూడటమంటే సహనాన్ని పరీక్షించు కోవటమే. సహనాన్ని పరీక్షించే సినిమాలలో ‘తెలుగమ్మాయి’ది మొదటి స్థానం. ఈ సినిమాలో చూడటానికి ఏమీలేదు.
-నారాయణ ఎ.వి