విడుదల తేది : 03 |
||
123తెలుగు.కాం రేటింగ్: 2/5 | ||
దర్శకుడు : ఎస్.ఆర్ చరణ్ రెడ్డి | ||
నిర్మాతలు : ఎస్.ఎల్.వి.ఎస్ రంగారావు మరియు ఎస్.వి ఆర్ | ||
సంగీతం : మున్నా కాశీ | ||
నటీనటులు : జూ. ఎస్.వి.ఆర్, నీలం ఉపాద్యాయ్ |
తెలుగు పరిశ్రమలో గొప్ప నటులలో ఒకరు ఎస్ వి రంగరావు. పరిశ్రమలో ప్రతిభ కల నటుడిగా ముందుతరాలకు మార్గదర్శిగా ఎస్ వి రంగారావు గారు పేరొందారు. ప్రస్తుతం ఆయన మనవడు అయిన జు. ఎస్విఆర్ అయన పేరు నిలబెట్టడానికి “మిస్టర్ 7” చిత్రంతో మన ముందుకు వచ్చారు. తమ స్వంత బ్యానర్ మీద నిర్మించిన ఈ చిత్రంలో నీలం ఉపాద్యాయ్ కథానాయికగా నటించింది ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ:
లక్ష్మణ్ (జూ. ఎస్వీఆర్) ఒక సెంటిమెంట్ తో కార్లను దొంగతనం చేస్తుంటాడు. 7 నెంబర్ ఉన్న కార్లను మాత్రమే లక్ష్మణ్ దొంగతనం చేస్తుంటాడు. అలాంటి తనకి నక్షత్ర (నీలం) పరిచయం అవుతుంది. తనతో ప్రేమలో పడతాడు అలాగే నక్షత్ర కూడా లక్ష్మణ్ తో ప్రేమలో పడుతుంది. నక్షత్ర తండ్రికి ఈ విషయం తెలుస్తుంది. అతను వారి బంధానికి అడ్డు చెప్పి లక్ష్మణ్ ని మంచివాడు మరియు కష్టపడేవాడిగా నిరూపించుకోవాలని నియమం పెడతారు. అప్పుడు లక్ష్మణ్ ఒక బెంజ్ కార్ ని దొంగతనం చేసి వచ్చిన డబ్బుతో రెస్టారెంట్ ప్రారంభించాలని అనుకుంటాడు. ఇక్కడే తనకి ప్రతినాయకుడు నాయక్(సత్య) ఎదురవుతాడు. అప్పటి నుండి వారి మధ్య ఘర్షణ మొదలవుతుంది. నాయక్ ఎందుకు లక్ష్మణ్ ని చంపాలి అనుకుంటాడు? లక్ష్మణ్ తన ప్రేమ కథలో సఫలం అయ్యాడా? అనేది తెర మీద చూడవలసిందే.
ప్లస్:
తనకి ఇచ్చిన పాత్రలో నీలం ఉపాద్యాయ్ చాలా బాగా చేసింది. చిత్రంలో చాలా అందంగా కనిపించింది. కీలక సన్నివేశాలలో ఆమె నటన పరవాలేదనిపించింది. చిత్రంలో కావలసినంత హాస్యాన్ని శ్రీనివాస రెడ్డి పండించారు. ఎప్పటిలానే కామెడి టైమింగ్ తో ఆకట్టుకున్నారు. పృథ్వీ ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించారు. పోలీసు ఆఫీసర్ గా కనిపించిన శ్రావణ్ ఆకట్టుకున్నారు. ఎం ఎస్ నారాయణ పరవలేధనిపించారు.
మైనస్ :
అంతటి గొప్ప నటుడి వారసుడిని పరిచయం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవటం చిత్రానికి మొదటి మైనస్. అతనికి శరీర ధారుడ్యం అయితే ఉంది కాని హీరో కావలసిన లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన తన లుక్ మీద వాక్చాతుర్యం మీద నటన మీద చాలా శ్రద్ద చూపించాలి. ఏ నటుడిని అయిన పరిచయం చేసేప్పుడు నటుడిలోని ప్రత్యేకతలను చూపించాలి ఈ చిత్రంలో అలా జరగలేదు. ఈ చిత్రంలో కథ మరియు స్క్రీన్ ప్లే రెండు బాగోలేదు. పాటలు వచ్చే సన్నివేశాలకి అర్ధం లేదు. చిత్రంలో వినోదాత్మక అంశాలు అసలు కనిపించవు. యువతను కాని విద్యార్థులను కాని ఆకట్టుకునే అంశాలు లేవు. చిత్రంలో రాబోయే సన్నివేశాలను ముందే పసిగాట్టేయచ్చు కావున చిత్రం చాలా బోర్ అనిపిస్తుంది.
సాంకేతిక అంశాలు :
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు పరవాలేదనిపించాయి. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశానికి తగ్గట్టుగా ఉన్నాయి. కాని పాటలు మాత్రం రొటీన్ గా ఉన్నాయి. డైలాగ్స్ లో ప్రత్యేకత ఏమి లేదు. దర్శకత్వం మరియు స్క్రీన్ ప్లే విభాగాలో చరణ్ రెడ్డి ఘోరంగా విపలం అయ్యారు.
తీర్పు :
ఎస్ వి రంగారావు గారి మీద నాకు అపారమయిన గౌరవం ఉంది జు ఎస్వీఆర్ మంచి నటనతో తెరకు పరిచయం అవుతారని ఊహించాను. కాని అక్కడ అలా జరగలేదు. మిస్టర్ 7 చాలా సాదారణమయిన చిత్రం ఈ చిత్రంలో చెప్పుకోడానికి ప్రతేయ్కతలు లేవు. భవిష్యత్తులో జు ఎస్వీఆర్ తన నటనని నిరూపించుకుంటాడని అనుకుందాం
123తెలుగు రేటింగ్ : 2/5
అనువాదం : రవి