విడుదల తేదీ : ఏప్రిల్ 26, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : దిలీప్‌కుమార్ సల్వాది, చత్రపతి శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని భగవనాని
దర్శకత్వం : దిలీప్‌కుమార్ సల్వాది
నిర్మాతలు : శైలజ సముద్రాల, నరసింహరాజు రాచూరి
సంగీతం : పద్మనాభ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫర్ : జయకృష్ణ
దిలీప్‌కుమార్ సల్వాది హీరోగా నటించి డైరెక్ట్ చేసిన చిత్రం దిక్సూచి. డివోషనల్ క్రైమ్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో చాందిని నాయికగా నటించగా ఛత్రపతి శేఖర్ ముఖ్య పాత్రలో నటించాడు. మరి ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..
కథ :
దిలీప్ (దిలీప్ కుమార్) ప్రెస్ రిపోర్టర్. తొలి చూపులోనే చాందిని తో ప్రేమలో పడుతాడు. ఇక అనుకోకుండా ఒక రోజు అజ్ఞాత వాసి నుండి ఫోన్ రావడం అతను చెప్పింది చేయకపోతే తన వాళ్లను చంపేస్తానని బెదిరచడం తో దిలీప్ భయపడిపోయి తన వాళ్లను తనకు తెలియకుండా కిడ్నాప్ చేస్తాడు. ఆతరువాత తన వాళ్లను కనిపెట్టే క్రమంలో 1975లో రాజా బుధురాపురం లో ఇలాగే కొన్ని కిడ్నాప్లు జరుగుతాయి. సో దానికి ఇప్పుడు తన జీవితంలో జరుగుతున్నదానికి ఏదో లింక్ ఉందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ ఊరికి , దీలిప్ ఉన్న సంబంధం ఏంటి ? అసలు ఆ అజ్ఞాతవ్యక్తి ఎవరు ? ఎందుకు అతను కిడ్నాప్లు చేస్తాడు ? అనేదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో కి ప్లస్ పాయింట్స్ అంటే దిలీప్ మరియు ఛత్రపతి శేఖర్ పాత్రలు. దిలీప్ పాత్రలో నటించిన దిలీప్ కుమార్ తన రోల్ లో బాగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇక దిలీప్ తరువాత సినిమాకు కీలమైన పాత్రలో నటించాడు చత్రపతి శేఖర్. ఆపాత్రకు ఆయనకు కరెక్ట్ గా సెట్ అయ్యాడు.తన నటనతో ఆపాత్రను బాగా ఎలివేట్ చేయగలిగాడు శేఖర్.
ఇక వీరితో పాటు హీరోయిన్ చాందిని , బిత్తిరి సత్తి, చైల్డ్ ఆర్టిస్ట్ ధన్వి తమ పాత్రల్లో ఒదిగిపోయారు.ఆలాగే సినిమా కు ఫస్ట్ హాఫ్ చాలా ప్లస్ అయ్యింది. ఇంట్రో సీన్లతో ఎక్కువ లాగ్ చేయకుండా డైరెక్ట్ గా స్టోరీలోకి తీసుకుపోయాడు డైరెక్టర్. దాంతో సినిమాలో తరవాత ఏం జరుగుతుంది అనే సస్పెన్సు క్రియేట్ చేయగలిగాడు. ఇక రన్ టైం తక్కువ గా ఉండడం కూడా ఈ సినిమా ప్లస్ అయ్యింది.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో మెయిన్ మైనస్ పాయింట్ అంటే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలే. ఫస్ట్ హాఫ్ ను చాలా ఇంట్రస్టింగ్ గా తెరకెక్కించి తరువాత ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ ను క్రియేట్ చేయగలిగిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని చోట్ల తేలిపోయాడు. కథ రాజా బహుదురాపురం షిఫ్ట్ అయిన తరువాత వచ్చే కథనం అంతగా ఆసక్తిగా లేకపోయింది.
సపెన్స్ ను రివీల్ చేసే క్రమంలో దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు కొంచం అతిగా లాజిక్ కు దూరంగా అనిపిస్తాయి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అంత కన్వీన్సింగ్ గా అనిపించదు. ఫస్ట్ హాఫ్ లో లాగా సెకండ్ హాఫ్ ను కూడా అంతే ఇంట్రస్టింగ్ సీన్స్ తో రాసుకుని ఉంటే సినిమా ఫలితం వేరేలావుండేది.
సాంకేతిక విభాగం :
హీరోగా సక్సెస్ అయిన దిలీప్ కుమార్ డైరెక్టర్ గా మాత్రం మెప్పించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ ను ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దాడు కానీ సెకండ్ హాఫ్ విషయంలో తడబడ్డాడు. కానీ ఇతర టెక్నీషియన్స్ నుండి మంచి అవుట్ ఫుట్ ను రాబట్టుకోగలిగాడు. ముఖ్యంగా జయకృష్ణ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అయ్యింది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలను బాగా చూపెట్టాడు.
ఇక మ్యూజిక్ కూడా డీసెంట్ గా వుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సన్నివేశాలను ఎలివేట్ చేయగలిగింది. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.
తీర్పు :
డివోషనల్ క్రైమ్ డ్రామా గా తెరకెక్కిన ఈ దిక్సూచిలో హీరో ,చత్రపతి శేఖర్ ల నటన అలాగే ఫస్ట్ సినిమా కు హైలెట్ అవ్వగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతిశాయి. ఓవరాల్ గా డిఫ్రెంట్ జోనర్లో వచ్చిన ఈ చిత్రం బిసి సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team