విడుదల తేదీ : మే 17, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : మనోజ్ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక తదితరులు..
దర్శకత్వం : పి.సునీల్ కుమార్ రెడ్డి
నిర్మాత : ఎక్కలి రవింద్రబాబు
సంగీతం : సుధాకర్ మారియో
సినిమాటోగ్రఫర్ : ఎస్.వి. శివరామ్
ఎడిటర్ : శామ్యుల్ కళ్యాణ్
పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రొమాంటిక్ క్రిమినల్స్. ఎక్కలి రవింద్రబాబు, బి.బాపిరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
డ్రగ్స్ వల్ల యువత ఎలా పాడైపోతున్నారు అనే అంశాన్ని హైలెట్ చేస్తోంది ఈ రొమాంటిక్ క్రిమినల్స్ చిత్రం. వైజాగ్ లో ఉండే కార్తీక్ – ఏంజెల్ అనే యువ జంట డ్రగ్స్ ప్రభావంతో డ్రగ్ మాఫియా సహాయంతో వివిధ నేరాలకు పాల్పడతారు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం వాళ్లు అన్ని నేరాలు ఆపేసి జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకుంటారు. మరి వారు సులభంగా ఆ నేర ప్రపంచం నుండి బయటకు రాగలిగారా? ఆ క్రమంలో వాళ్లు ఏ విధమైన హర్డిల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో డ్రగ్స్ కారణంగా విచ్చలవిడితనం, దిగజారుతున్న మానవ విలువలు అలాగే మత్తు వైపు మళ్లిస్తున్న పరిస్థితులను అర్ధవంతంగా చూపించడం బాగుంది. డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి ఈ సినిమాతో చెప్పాలనుకున్న పాయింట్ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది.
నటీనటుల విషయానికి వస్తే.. ముందుగా చెప్పాల్సింది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అవంతిక నటన గురించి. అవంతిక చాలా బాగా నటించింది. ఇక హీరోగా చేసిన మనోజ్ నందం కూడా తన గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో బాగా నటించాడు. మిగిలిన నటీనటులు కూడా ఉన్నంతలో బాగానే చేశారు.
మైనస్ పాయింట్స్ :
‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ ఒక క్రిమినల్ ప్రేమ కథ’ సినిమాలకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చినప్పటికీ.. ఆ సినిమాల్లో ఉన్న ఎమోషనల్ ట్రీట్మెంట్, కామెడీ ఈ సినిమాలో మిస్ అయింది. అయితే యూత్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఈ సినిమాలో ఉన్నా.. అది సరిగ్గా ఎలివేట్ కాలేదు.
మెయిన్ ప్రతి సీన్ కథలో మిళితమయ్యే ఉంటుందిగాని కథను మాత్రం పరుగులు పెట్టించదు. కథనం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మొత్తానికి దర్శకుడు సినిమాలో యూత్ కి కనెక్ట్ అయ్యేలా అడల్ట్ కామెడీని ఇందులో పండించలేకపోయాడు. పాయింట్ బాగున్నా.. బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద ఇంట్రస్ట్ ని కలగకుండా చేశారు.
ముఖ్యంగా హీరోహీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ సినిమాని బలహీనపరిచాయి. ఇక టేకింగ్ కూడా షార్ట్ ఫిల్మ్ టేకింగ్ తో సాగుతుంది. దాంతో సినిమా పై ఇర్రిటేషన్ కలుగుతుంది. దర్శకుడు స్క్రిప్ట్ తో పాటు టేకింగ్ పై కూడా ఇంకా బాగా దృష్టి పెట్టాల్సింది.
సాంకేతిక విభాగం:
ఈ సినిమాలో సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్ గా చేసిన శివ రామ్ కెమెరా పనితనం పర్వాలేదనిపిస్తోంది. సుధాకర్ అందించిన సంగీతం పెద్దగా మ్ ఆకట్టుకోదు. ఎడిటర్ వి.నాగిరెడ్డి తన కత్తెరకి ఇంకొంచెం పనిచెప్పి ఉంటే బాగుండేది. దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి తనే స్వయంగా రాసుకున్న ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే ఇంకొంచెం పగడ్బందీగా రాసుకోని ఉంటే బాగుండేది. నిర్మాతలు ఎక్కలి రవింద్రబాబు, బి.బాపిరాజుల నిర్మాణ విలువులు బాగాలేదు.
తీర్పు:
ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ ఒక క్రిమినల్ ప్రేమ కథ’ సినిమాలకు సీక్వెల్ గా పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నిరుత్సాహ పరుస్తోంది. విషయం లేని కథలో అనవసరమైన సన్నివేశాలల్లో పండని ఎమోషన్ని సెంటిమెంట్ని రంగరించినప్పటికీ ఈ డ్రగ్ కథ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team