సమీక్ష : కొబ్బరి మట్ట – సంపూ అభిమాలకు మాత్రమే

Kobbari Matta movie review

విడుదల తేదీ : ఆగస్టు 10, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : సంపూర్ణేష్ బాబు,ఇషికా సింగ్,షకీలా,మహేష్ కత్తి

దర్శకత్వం : రోనాల్డ్ రూపక్ సన్

నిర్మాత‌లు : సాయి రాజేష్ నీలం

సంగీతం : సయీద్ కమ్రాన్

సినిమాటోగ్రఫర్ : ముజీర్ మాలిక్

ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్

2014లో వచ్చిన హృదయ కాలేయం చిత్రంతో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన నటుడు సంపూర్ణేష్ బాబు.ఆ చిత్రంలో తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ తో బాగానే నవ్వించాడు సంపూ.ఐతే ఆయన తాజాగా నటించిన “కొబ్బరి మట్ట” మూవీ నేడు విడుదలైంది. మరి ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో చర్చిద్దాం.

 

కథ:

రాయుడు(సంపూర్ణేష్ బాబు) తన గ్రామ పెద్దగా, తన ఊరి ప్రజలకు పెద్ద దిక్కుగా, తన ముగ్గురు భార్యలతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు. అలాంటి రాయుడు జీవితం యాండ్రాయుడు(సంపూర్ణేష్ బాబు) రాకతో ఒడిదుడుకులకు లోనవుతుంది. అసలు ఎవరు ఈ యాండ్రాయుడు? అతనికి రాయుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూసి తెలుసుకోవాలి.

 

ప్లస్ పాయింట్స్:

 

దర్శకుడు సాయి రాజేష్ ఈ మూవీలో సంపూర్ణేష్ చేత పాపారాయుడు,పెద్ద రాయుడు,యాండ్రాయుడు అనే మూడు విభిన్న పాత్రలు చేయించి మంచి హాస్యాన్ని తెరపై పండించారు. ఈ మూవీకి హాస్యంకోసం వెళ్లే ప్రతి ప్రేక్షకుడు నిరుత్సాహపడరు. అంతగా సంపూ ఈ మూవీలో నవ్వించాడు అని చెప్పాలి.

ఇక మూవీ హీరో సంపూ మూడు విభిన్న పాత్రలలో అద్భుతంగా నటించిన చక్కని హాస్యం పంచారు. తనదైన డైలాగులతో, డాన్స్ లతో, నటనతో సంపూ ప్రేక్షకులకు కావలసినంత హాస్యం పంచారు, మూడు అవతారాలలో ఆయన నటన ఆకట్టుకుంటుంది.

ఇక ఈ మూవీలో కీలకమైన పాత్ర దక్కించుకున్న కత్తి మహేష్ సమకాలిక అంశాలపై వేసే సెటైర్స్ చక్కగా పేలాయి. మరో ముఖ్య పాత్రలో నటించిన షకీలా డీసెంట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది. సందర్భానుసారంగా వచ్చే సాంగ్స్ కూడా మంచి హాస్యం పంచుతూ అలరిస్తాయి.

 

మైనస్ పాయింట్స్:

సంపూర్ణేష్ బాబు బాగా పరిచయమున్న ఆడియన్స్ కి , కామెడీని అంటే అమితంగా ఇష్టపడే వారికి మినహా మిగతా వారికి సన్నివేశాలు చాలా సిలీగా అనిపిస్తాయి.

కొన్ని సందర్భాలలో అద్భుత కామెడీ సన్నివేశాలలో అలరించే మూవీ, కొన్ని చోట్ల అసలు ఎటువంటి ప్రభావం లేకుండా నిర్జీవంగా సాగుతూ ఉంటుంది. లాజిక్ లేని సన్నివేశాలు ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చక పోవచ్చు.

 

సాంకేతిక విభాగం:

చిత్ర బడ్జెట్ పరిధిలో నిర్మాణ విలువలు డీసెంట్ గా పర్వాలేదు అనిపిస్తాయి. హై పిచ్ లో నడిచే అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఇక ముఖ్యంగా స్టీవ్ శంకర్ రాసిన డైలాగ్స్ తెరపై నవ్వులు పూయించాయి. ఆయన డైలాగ్స్ మూవీకి మంచి ఆకర్షణ గా నిలిచాయి. అలాగే మూవీ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. మూవీ ప్రతి పదినిమిషాల వ్యవధిలో చక్కగా చొప్పించిన హాస్య సన్నివేశాలు ఆహ్లదం కలిగిస్తాయి.

ఇక దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ మూవీ అక్కట్టుకొనేలా తీయడంలో ఎంత కష్టపడ్డారో తెరపై కనిపిస్తుంది. కథలో కానీ సన్నివేశాలలో కానీ ఎటువంటి లాజిక్ లేకపోయినప్పటికీ తాను అనుకున్న విధంగా సంపూర్ణేష్ తో తెరపై హాస్యం పండించడంలో విజయం సాధించారు అని చెప్పొచ్చు.

 

తీర్పు:

 

మొత్తంగా చెప్పాలంటే కొబ్బరి మట్ట సంపూర్ణేష్ బాబు అభిమానులను ఆద్యంతం అలరించే సంపూర్ణమైన కామెడీ మూవీ. కానీ సాధారణ ప్రేక్షకుడుకి లాజిక్ లేని సన్నివేశాలు వినోదం పంచకపోవచ్చు. కేవలం హాస్యం మాత్రమే ఆశించి వెళ్లేవారిని మాత్రం సంపూ సంతృప్తి పరుస్తాడు అనడంలో సందేహం లేదు.

123telugu.com Rating :   2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version