సమీక్ష : ప‌హిల్వాన్‌ – అక్కడక్కడ పర్వాలేదనిపిస్తాడు

Pehlwaan movie review

విడుదల తేదీ : సెప్టెంబరు 12, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : కిచ్చా సుధీప్,సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్,సుశాంత్ సింగ్ తదితరులు.

దర్శకత్వం : కృష్ణ

నిర్మాత‌లు : స్వప్న కృష్ణ

సంగీతం : అర్జున్ జ‌న్యా

సినిమాటోగ్రఫర్ : కరుణాకర్ ఏ

ఎడిట‌ర్‌ : రూబెన్‌

స్క్రీన్ ప్లే : కృష్ణ ,డి ఎస్ కణ్ణన్, మధో

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘ప‌హిల్వాన్‌’. బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టితో పాటు ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో నటించిన ఈ చిత్రానికి అర్జున్ జ‌న్యా సంగీతం అందించగా క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

‘ప‌హిల్వాన్‌ కృష్ణ’ (కిచ్చా సుదీప్) ఓ అనాధ. అయితే ఎదుటివారి కోసం పోటీలో నిలిచి గెలిచే తత్త్వం ఉన్న కృష్ణను చూసి సర్కార్ (సునీల్ శెట్టి) చిన్నప్పుడే అతన్ని తన ఇంటికి తీసుకొచ్చి కన్న కొడుకులా పెంచి కుస్తీ వీరుడిగా తీర్చిదిద్దుతాడు. దేశం తరుపున మెడల్ సాధించాలనే తన ఆశయాన్ని కృష్ణ ద్వారా తీర్చుకోవాలనుకుంటాడు. దాని కోసం ప్రేమ పెళ్లి లాంటివి కృష్ణ జీవితంలో ఉండకూడదని సర్కార్ బలంగా కోరుకుంటాడు. కానీ ఈ క్రమంలో ‘ప‌హిల్వాన్‌ కృష్ణ’ రుక్మిణీ (ఆకాంక్ష సింగ్)తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ‘కృష్ణ’ రుక్మిణీ పెళ్లి చేసుకుంటాడు. అది ఇష్టం లేని సర్కార్, ఇక కుస్తీని జీవితంలో మర్చిపోమని కృష్ణను దూరం పెడతాడు. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల ‘కృష్ణ’ మళ్లీ ‘ప‌హిల్వాన్‌’ ఎలా మారాడు ? సర్కార్ మరియు కృష్ణ మళ్లీ కలిశారా ? ఇంతకీ ఒక కుస్తీ వీరుడు బాక్సింగ్ రింగ్ లోకి ఎందుకు దిగాడు ? ‘ప‌హిల్వాన్‌ కృష్ణ’ బాక్సింగ్ లో గెలిచాడా ? తన ఆశయం నెరవేర్చుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన కిచ్చా సుదీప్ ‘ప‌హిల్వాన్‌ కృష్ణ’గా కుస్తీ వీరుడి పాత్ర‌లో అద్భుతంగా నటించాడు. ఒక కుస్తీ వీరుడు బలమైన ఆశయంతో బాక్సింగ్ రింగ్ లో దిగితే ఎలా ఉంటుందనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో.. స్పోర్ట్స్ కి సంబంధించిన స్ట్రాంగ్ మెసేజ్ తో పాటు బలమైన ఎమోషనల్ సీన్స్ మరియు కొన్ని లవ్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ బాగా ఆకట్టుకుంటాయి. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి – సుదీప్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి. దర్శకుడు చెప్పాలనుకున్న థీమ్ తో పాటు సినిమాలో స్పోర్ట్స్ లవర్స్ కి నచ్చే అంశాలు ఉండటం సినిమాకి బాగా ప్లస్ అవుతుంది.

ఇక హీరోగా నటించిన సుదీప్ తన పాత్రకు తగ్గట్లు లుక్స్ అండ్ నటన పరంగా ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా తన సిక్స్ ప్యాక్ తో తన డాన్స్ మూమెంట్స్ తో సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే బాక్సింగ్ సీన్ లో సుదీప్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక హీరోయిన్ ఆకాంక్ష సింగ్ తో ప్రేమలో పడే సీన్ కూడా బాగుంది. హీరోయిన్ గా నటించిన ఆకాంక్ష సింగ్ బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. సునీల్ శెట్టి కూడా సర్కార్ పాత్రలో ఒదిగిపోయారు. ఆయన చేత చెప్పించిన డైలాగ్స్ కూడా బాగా అలరిస్తాయి. హీరో ఫ్రెండ్ గా నటించిన నటుడు… అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

 

 

మైనస్ పాయింట్స్:

 

సినిమాలో స్పోర్ట్స్ కి సంబంధించి చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ బాగున్నా.. ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోవు. అవసరానికి మించి బిల్డప్ సీన్స్ ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలకు అయితే సరైన ప్లో కూడా ఉండదు. పైగా ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొడుతుంది.

ఇక యాక్షన్ సీన్స్ కూడా ఏ సీన్ కి ఆ సీన్ కథ ప్రకారమే సాగుతున్న భావన కలిగినా ఓవరాల్ గా కథనాన్ని మాత్రం ముందుకు నడిపించవు ఆ సీన్స్. పైగా కొన్ని యాక్షన్ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం కూడా సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. దీనికి తోడు ప్లే ఆసక్తికరంగా సాగకపోగా స్లోగా సాగుతుంది.

మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద ఇంట్రస్ట్ కలిగించేలా ఎలివేట్ చేయలేకపోయారు. సినిమాలో అక్కడక్కడ ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ ఉన్నా… దర్శకుడు సినిమాని ఆసక్తికరంగా మలచలేకపోయారు. మెయిన్ గా స్టోరీ పాయింట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం ఆ పాయింట్ ను సెకెండ్ ప్రీ క్లైమాక్స్ ముందు రివీల్ చేసి అసలు కథాంశాన్ని తక్కువ సీన్స్ కే పరిమితం చేశాడు.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ముందు చెప్పుకున్నట్లుగానే దర్శకుడు కృష్ణ కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఇక కరుణాకర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కుస్తీ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో వచ్చే దృశ్యాలన్నీ ఆయన చాలా బాగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు అర్జున్ జ‌న్యా అందించిన నేపథ్య సంగీతం బాగున్నా… పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు. రూబెన్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాత స్వప్న కృష్ణ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

భారీగా అంచనాలతో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో స్పోర్ట్స్ కి సంబంధించిన స్ట్రాంగ్ మెసేజ్ తో పాటు బలమైన ఎమోషనల్ సీన్స్ మరియు కొన్ని లవ్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. అయితే ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకోకపోవడం, ఫస్ట్ హాఫ్ స్లోగా బోర్ గా సాగడం, దర్శకుడు తీసుకున్న ఎమోషనల్ కంటెంట్ ను స్క్రీన్ మీద ఇంట్రస్ట్ కలిగించేలా ఎలివేట్ చేయలేకపోవడం, అన్నిటికి మించి సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే సుదీప్ ‘ప‌హిల్వాన్‌ కృష్ణ’గా అద్భుతంగా నటించాడు. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

 

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version