సమీక్ష : అవును – ఒక థ్రిల్లింగ్ అనుభవం

విడుదల తేదీ: 21 సెప్టెంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకుడు : రవిబాబు
నిర్మాత : డి సురేష్ బాబు, ప్రసాద్ పొట్లూరి
సంగీతంశేఖర్ చంద్ర
నటీనటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే

వినూత్న చిత్రాలు చెయ్యడంలో తనదయిన శైలితో మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు రవిబాబు. ఈరోజు ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ “అవును” చిత్రం విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో జనం అంచనాలను చేరుకుందో లేదో చూద్దాం

కథ :

“అవును” చిత్రం దాదాపుగా మోహిని(పూర్ణ) మరియు ఆమె భర్త హర్ష(హర్షవర్ధన్ రాణే) ల చుట్టూ తిరుగుతుంది. కొత్తగా పెళ్ళయిన వీరి జంట గండిపేట్ దగ్గరలో క్లాసిక్ హోమ్స్ అనే ప్రదేశంలో నివసిస్తూ ఉంటారు. త్వరలోనే ఆ ఇంట్లో కొన్ని విచిత్రమయిన సంఘటనలు జరుగుతాయి దయ్యం/ఆత్మ మోహినిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

ఇదిలా ఉండగా పక్కన ఇంట్లో పిల్లాడు విక్కి తన చనిపోయిన తాతతో మాట్లాడుతుంటాడు. విక్కికి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి కాని ఎవరు అతనిని నమ్మరు. మోహిని వాళ్ళ ఇంట్లో కెప్టన్ రావు ఆత్మ ఉందని ఆ అబ్బాయి చెప్తాడు.

హర్ష మరియు మోహిని హనీమూన్ కోసం పరిస్ వెళ్ళాలని ప్లాన్ చేస్తారు కాని దయ్యం మోహినిని మరింత ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టడంతో పరిస్థితి మారిపోతుంది ఆ దయ్యం నుండి పారిపోవాలని ప్రయతించిన మోహిని ప్రయత్నాలు విఫలం అవుతాయి.

మెల్లగా విక్కి తల్లి తండ్రులు మరియు చుట్టుపక్కల వాళ్ళు కెప్టన్ రావు ఆత్మ నిజంగానే ఉందని తెలుసుకొని మోహినిని కాపాడడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ ప్రయత్నం సఫలం అయ్యిందా? ఈ కెప్టన్ రావు ఎవరు? అనేది మిగిలిన కథ.

ప్లస్ :

పూర్ణ ఈ చిత్రంలో అద్భుతమయిన ప్రదర్శన కనబరిచింది. ఈ చిత్రానికి తన పాత్రనే చాలా ముఖ్యం. మొత్తం చిత్రాన్ని తన భుజాల మీద మోసింది అనే చెప్పాలి. కీలక సన్నివేశాలలో తన హావభావాలు ప్రేక్షకుడికి తన పాత్ర చేరువయ్యేలా చేశాయి. ఈ పాత్రకి ఆర్ జే కాజల్ అందించిన గాత్రం పూర్ణ పాత్రకి న్యాయం చేసింది.హర్షవర్ధన్ రాణే బాగా చేశారు. కీలక సన్నివేశాలలో అయన నటన ఆకట్టుకుంది. ప్రముఖ యాంకర్ గాయత్రి భార్గవి తన పాత్రకు తగ్గ న్యాయం చేశారు. రవి బాబు చేసింది చిన్న పాత్రనే అయిన చిత్రంలో కీలక పాత్ర చేశారు పోలీసు ఆఫీసర్ గా ఆకట్టుకున్నారు. విక్కి పాత్రలో నటించిన పిల్లాడు చాలా బాగా చేశాడు. సుధా,రాజేశ్వరి మరియు చలపతి రావు వారి పాత్రల పరిధి మేరకు చేశారు.కథ మరియు కథనం చాలా బాగున్నాయి. కథనం మంచి వేగంగా సాగుతుండటం చివరి వరకు సస్పెన్స్ ఉంచగలగడం సౌండ్ ఎఫెక్ట్స్ మరియు నేపధ్య సంగీతం చిత్రంలో ప్రేక్షకుడిని లీనమయ్యేలా చేసి భయపెడుతుంది.దర్శకుడు ఈ చిత్రంలో మనుషుల హావభావాలలో రెండింటిని అద్భుతంగా చూపించారు – కామం మరియు భయం.ఈ చిత్రంలో వచ్చే చివరి మలుపు చాలా బాగుంది కాని చివరి సన్నివేశాన్ని ఇట్టే పసిగట్టేయచ్చు. చిత్రంలో మోహిని వెనక పడే ఆ పాత్రకు సరయిన న్యాయం చేశారు.స్పెషల్ ఎఫెక్ట్స్ ని అభినందించి తీరాల్సిందే తక్కువగానే ఉన్న చాలా బాగుంది ఈ చిత్రానికి ఉపయోగించిన లైటింగ్ స్కీమ్స్ చాలా బాగున్నాయి.

మైనస్:

ఈ చిత్రం చాలా సన్నని కథతో నడుస్తుంది కాబట్టి చెయ్యాల్సిన మాయాజాలం మొత్తం కథనం విషయంలో చెయ్యవలసి వచ్చింది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు “హలోమన్” చిత్రాన్ని పోలి ఉంటాయి. దయ్యం పాత్రలో కీలక మార్పులను సరిగ్గా చూపించలేకపోయారు. ఇది హారర్ చిత్రం కాబట్టి అన్ని రకాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకోదు హార్రర్ చిత్రాలను ఇష్టపడే వాళ్ళు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చెయ్యగలరు మాములు చిత్రాలను కోరుకునే వారికోసం కాదు ఈ చిత్రం.

సాంకేతిక అంశాలు:

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది కెమెరాను ఎక్కువగా కదిలించకపోయినా ఫీల్ ని క్రియేట్ చెయ్యగలిగారు. గతంలో చెప్పినట్టుగా లైటింగ్ స్కీమ్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ మొదటి అర్ధ భాగంలో రెండు మూడు చోట్ల తప్ప చాలా బాగుంది. డైలాగ్స్ పరవాలేదు.

శేఖర్ చంద్ర అందించిన నేపధ్య సంగీతం మరియు రీ రికార్డింగ్ పనులు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. చిత్రంలో చాలా వరకు దయ్యం కనపడకుండా ఉన్నా ఫీల్ క్రియేట్ చెయ్యడంలో మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. రవి బాబు దర్శకత్వం చాలా బాగుంది ఈ చిత్రం ఆసాంతం ఆసక్తిని సృష్టించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.

తీర్పు:

రవిబాబు “అవును” కథనంలో మంచి వేగంతో సాగే చూడదగ్గ చిత్రం. ఇలాంటి వినూత్న చిత్రాలతో ప్రేక్షకుల వస్తున్నందుకు రవిబాబుని అభినందించాలి. ఇంతకముందే చెప్పినట్టుగా ఈ చిత్రంలో కామం మరియు భయం అనే రెండు భావాలను చూపించడంలో దర్శకుడు విజయం సాదించాడు. ఈ చిత్రం ఏ సెంటర్స్ మరియు మల్టీప్లెక్స్ లో విజయం సాదిస్తుంది. వినోదాత్మక చిత్రాలను ఆశించే వారికి ఈ చిత్రం సరయినది కాదు. హర్రర్ చిత్రాలను ఇష్టపడేవారు ఖచ్చితంగా చూడవలసిన చిత్రం.

123తెలుగు.కామ్ రేటింగ్ – 3.25/5

అనువాదం – రవి

Click Here For ‘Avunu’ English Review

Exit mobile version