శ్రీ రామ రాజ్యం సెట్ల వెనుక అద్బుతమైన కృషి


శ్రీ రామ చిత్రం అధ్బుత దృశ్య కావ్యంగా రూపొందటంలో సెట్లు కీలక పాత్ర పోషించాయి. రాముని ఏకాంత మందిరం, సూర్య దేవుడి నిలువెత్తు విగ్రహం వంటివి అధ్బుతంగా తీర్చిదిద్దారు.
హాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే సాధ్యమయ్యే కొన్ని సెట్లను చేసి చూపించగలిగారు ఈ చిత్ర ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్. హైదరాబాదులో జరిగిన విలేఖరుల సమావేశంలో కిరణ్ కుమార్ మాట్లాడుతూ చిత్రంలోని ముఖ్యమైన సెట్లను 90 రోజుల్లో పూర్తి చేసామని చెప్పారు.

ఆ సెట్లను చూసిన వెంటనే బాలకృష్ణ మరియు బాపు గారు అధ్బుతంగా తీర్చిదిద్దావని తనను మెచ్చుకున్నారని అన్నారు. ప్రస్తుతం కిరణ్ ఉపేంద్రతో కలిసి కళ్యాణ్ రామ్ రూపొందిస్తున్న 3D చిత్రానికి పనిచేస్తున్నారు.

Exit mobile version