సమీక్ష : దేనికైనా రెడీ – కామెడీ డ్రామా

విడుదల తేదీ: 24 అక్టోబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకుడు : జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాత : మోహన్ బాబు
సంగీతం: యువన్ శంకర్ రాజా , చక్రి
నటీనటులు : విష్ణు మంచు, హన్సిక

‘ఢీ’ సినిమాతో మొదటి హిట్ అందుకున్న మంచు విష్ణు మళ్ళీ అదే తరహాలో ‘దేనికైనా రెడీ’ అనే కామెడీ విత్ యాక్షన్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. సీమ శాస్త్రి, సీమ టపకాయ్ వంటి కామెడీ చిత్రాలను అందించిన జి. నాగేశ్వర రెడ్డి డైరెక్షన్లో వచ్చిన దేనికైనా రెడీ సినిమాని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై డాక్టర్ మోహన్ బాబు నిర్మించారు. విష్ణుకి జోడీగా హన్సిక నటించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. దేనికైనా రెడీ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

సరస్వతి (సీత) భాషా (సుమన్) ప్రేమించుకొని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడంతో సరస్వతి తండ్రి చనిపోతాడు. దీంతో సరస్వతి అన్న వీర నరసింహ నాయుడు (ప్రభు) వారిద్దరి మీద కోపం పెంచుకుంటాడు. భాషా – సరస్వతిల సంతానం సులేమాన్ (విష్ణు) తమ రెండు కుటుంబాలని కలపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. నరసింహ నాయుడు ఇంట్లో యాగం చేయించాలని చెప్పడంతో బంగార్రాజు సహాయంతో (బ్రహ్మానందం) సహాయంతో కృష్ణ శాస్త్రిగా ఆ ఇంట్లో అడుగు పెడతాడు. తను సులేమాన్ కాదు కృష్ణ శాస్త్రిని అని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మిస్తూ ఆ రెండు కుటుంబాలని ఎలా కలిపాడు అన్నది మిగతా సినిమా.

ప్లస్ పాయింట్స్ :

విష్ణు ఈ సినిమాతో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. డాన్సుల్లో చాలా డెవెలప్ అయ్యాడు. టైటిల్ సాంగ్ లో డాన్స్ బాగా చేసాడు. ఢీ తరహాలోనే కామెడీ టైమింగ్ ని కంటిన్యూ చేసాడు. తను సులేమాన్ కాదు కృష్ణ శాస్త్రి అని నమ్మించే కామెడీ సీన్స్ బావున్నాయి. విష్ణు తరువాత ఈ సినిమాలో అంతటి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర బంగార్రాజుదే. అతని పాత్ర ఢీ, రెఢీ లను తలపించినప్పటికీ చాలా సన్నివేశాల్లో బాగా నవ్వించాడు. సెకండాఫ్ లో చాల సన్నివేశాల్లో కడుపుబ్బా నవ్వించాడు. హన్సిక తన పాత్ర పరిధిమేరకు పర్వాలేదనిపించింది. ప్రభు, సుమన్ పాత్ర పరిధిమేరకు చేసుకుంటూ వెళ్లారు. ఎం.ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, వెన్నెల కిషోర్అందరూ బాగానే నవ్వించారు. యాక్షన్ సన్నివేశాల్లో టేకింగ్ బావుంది.

మైనస్ పాయింట్స్ :

ఇంటర్వెల్ ముందు వరకు సినిమా స్లోగా సాగుతుంది. సాంగ్స్ ప్లేస్ మెంట్ కూడా ఇంకా బెటర్ గా ఉండుంటే బావుండేది. సురేఖా వాణి కామెడీ అంతగా నవ్వించలేదు. కోట శ్రీనివాస రావు వంటి టాలెంట్ ఉన్న సీనియర్ నటుడి పాత్రని సరిగా వాడుకోలేకపోయారు. ఈ సినిమాకు రచయితలు అయిన కోన వెంకట్, గోపి మోహన్, బివిఎస్ రవి గతంలో ఢీ, రెఢీ సినిమాలకు పనిచేసిన వారు కావడంతో ఆ సినిమాల నుండి కథని బాగా ఇన్స్పైర్ అయి రాసుకున్నారు. సినిమా చూస్తున్నంతసేపు ఆ సినిమాల ఫ్లేవర్ బాగా కనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

6 పాటల్లో మూడు పాటలు యువన్ శంకర్ రాజా అందించగా మిగతా మూడు పాటలు చక్రి అందించారు. టైటిల్ సాంగ్, పిల్లా నీ వాళ్ళ పాటలు బావున్నాయి. చైనా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయింది. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

తీర్పు :

దేనికైనా రెడీ ఎలాంటి వల్గారిటీ లేని క్లీన్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్. దసరా పండగకి సరదాగా కుటుంబ సభ్యులందరితో చూడతగ్గ చిత్రం. డీ తరహాలో దేనికైనా రెడీ కూడా మంచి కామెడీ సినిమా టైం పాస్ కోసం ఈజీగా చూడొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

అశోక్ రెడ్డి .ఎమ్

Click Here For ‘Dhenikaina Ready’ English Review

Exit mobile version