రవితేజ డేంజరస్ కిల్లింగ్ మెషిన్ లా కనిపిస్తున్నాడే…!

రవితేజ ఈ సారి గట్టిగా కొట్టేలా ఉన్నారు. ఆయన తన రేంజ్ హిట్ అందుకొని చాలా కాలం ఐయ్యింది. డిస్కో రాజా చిత్రం తరువాత ఆ దాహం తీరడం ఖాయంగా కనిపిస్తుంది. నిన్న విడుదలైన టీజర్ తో ఆ విషయం అర్థం అవుతుంది. ఈ మూవీలో రవితేజ లుక్ అండ్
క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటాయని స్పష్టం అవుతుంది. ముఖ్యంగా రవితేజ ఓ కిల్లింగ్ మెషిన్ గా చేస్తున్నారా అనిపిస్తుంది.

డిస్కో రాజా చిత్రం ఓ సైంటిఫిక్ ఫిక్షనల్ స్టోరీ గా తెరకెక్కుతుండగా, ఓ శాస్త్రవేత్త రవితేజ పై ఏదో ప్రయోగం చేసి అతన్ని అసాధారణ వ్యక్తిగా మారుస్తాడనిపిస్తుంది. దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాయల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.వచ్చే ఏడాది జనవరి 24న డిస్కో రాజా విడుదల కానుంది.

Exit mobile version