వెంకీ మామ చిత్రంలో అసలు ట్విస్ట్ అదే..!

నిన్న ఖమ్మం వేదికగా వెంకీ మామ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఉహించినదానికి మించి అభిమానులు ఈ వేడుకకు హాజరై సందడి చేయడం చిత్ర యూనిట్ లో ఉత్సాహం నింపింది. వెంకీ మామ విజయంపై వెంకీ మామ టీమ్ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇక ప్రీ రిలీజ్ వేదిక పై వెంకీ మామ ట్రైలర్ విడుదల చేశారు.రెండు నిమిషాలకు పైగా గల ట్రైలర్ ని ఫన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో నింపేశారు. పల్లెటూరిలో మామ అల్లుళ్ళ అల్లర్ల తో పాటు, చిన్నప్పటి నుండి మామ అల్లుడికి అన్నీ తానై పెంచిన విధానం వంటి ఎమోషన్స్ తో కూడిన కామెడీ ఎలిమెంట్స్ తో దర్శకుడు బాబీ తెరకెక్కించాడని అర్థం అవుతుంది.

ప్రేమించిన అమ్మాయిని వదులుకొని సున్నితంగా అల్లరిగా పెరిగిన చైతూ ఆర్మీలో జాయిన్ కావడానికి గల అసలు కారణం ఏమిటీ? ప్రేమను మామను వదిలి దేశంకోసం బోర్డర్ కి చైతూ ఎందుకు వెళ్ళాడు అనేది అసలు ట్విస్ట్ గా కనిపిస్తుంది. మామయ్య కల కోసం ప్రేమను వదులుకున్నాడా? లేక ఇంకేమైనా కారణం ఉందా అనేది వెంకీ మామ చిత్రంలో ఆసక్తికర మలుపు. ఏదిఏమైనా వెంకీ మామ చిత్రంతో ఈ మామ అల్లుళ్లు మంచి హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. దర్శకుడు కె ఎస్ రవీంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Exit mobile version