సమీక్ష : ప్రియుడు – అంత గా ఆకట్టుకోని చిత్రం

విడుదల తేది : 01 డిశంబర్ 2011
123 తెలుగు .కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు : శ్రావణ్
నిర్మాత :ఉదయ కిరణ్
సంగిత డైరెక్టర్ : మోహన్ జాన
తారాగణం : వరుణ్ సందేశ్ , ప్రీతిక రావు , శ్వేత ప్రసాద్ , కోట శ్రీనివాసన్ రావు

వరుణ్ సందేశ్, ప్రీతిక రావు లు జంట గా నటించిన చిత్రం ‘ప్రియుడు’. శ్రవణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పి.ఉదయ కిరణ్ నిర్మించారు. ఈ చిత్రం నేడు రాష్ట్రం అంతటా విడుదల అయింది. ఎ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ :

చిత్రం ప్రారంభం లో పేర్లు పడుతున్న సమయం లో “ఈ చిత్రం పలు చిత్రాలను ఆధారం గా తీసుకుంది” అని వేసారు. ఇది అక్షరాలా నిజం. కార్తీక్ (వరుణ్ సందేశ్) ఒక ధనవంతుడు. జల్సా గా తిరిగే ఈ కుర్రాడికి ప్రేమ అన్న, నియమాలు అన్న ఇష్టం ఉండవు. ప్రేమ లో పడితే, ఎక్కడ తన స్వతంత్రం పోతుందో అని భయపడతాడు. ఇతడి జీవితం లోకి మధు( ప్రీతిక రావు ) అడుగుపెడుతుంది. మధు తండ్రి, కార్తిక్ తండ్రి చిన్ననాటి స్నేహితులు. మధు కార్తిక్ ను ఇష్టపడుతున్నట్లు గా తెలుసుకున్న పెద్దలు, మహా సంతోషం గా వీరి పెళ్లి ఖరారు చేస్తారు.

అయితే ఈ పెళ్లి ఇష్టం లేని కార్తిక్, తన మీదకు నింద రాకుండా మధు ని వదిలించుకోవాలని ప్రయత్నిస్తాడు. మధు అంటే బాగా ఇష్టపడే జీనియస్ (రణధీర్) అనే కుర్రాడిని మధు మీదకి మళ్ళించి, ఆమె అతడి తో ప్రేమ లో పడేందుకు ప్రయత్నిస్తాడు. సరిగ్గా మధు మనసు మారే సమయానికి కార్తిక్ మనసులో కూడా మార్పు ఒస్తుంది. ఆ మార్పు ఏమిటి? మధు ఎవరికీ దక్కుతుంది?? అదే కథ.

ఎం బాగున్నాయి :

చిత్రం మొదటి భాగం లో అక్కడక్కడ కామెడీ ఒక మాదిరిగా  పండింది. వరుణ్ సందేశ్ మరియు ప్రితిక రావు లు చూడటానికి ఫర్వాలేదు అనిపించారు. తనకు ఉన్న మితమైన పాత్ర లో కోటా శ్రీనివాస రావు బాగా నటించారు.  ఆలి కామెడి ఫర్వాలేదు. కుఫ్లి బాబా , హుక్కా బాబా, మరియు పుంగి బాబా గా అతడి వేషాలు కాస్త వినోదాన్ని తెచ్చాయి.తాగుబోతు రమేష్ ఫర్వాలేదు.

చిత్రం లో ని కొన్ని పాటలు బాగా చిత్రీకరించారు .

ఎం బాగోలేదు :

వరుణ్ సందేశ్ నటన అన్ని చిత్రాల లోనూ ఒకే లాగా ఉంటోంది. అతడు త్వరగా దానిని సరిదిద్దు కోవాలి. ప్రీతిక రావు కూడా నటన పై దృష్టి పెట్టక పోతే నిలదొక్కుకోవటం కష్టం. చిత్రం రెండవ భాగం చాలా ఘోరం గా ఉంది.బాగా సాగదీసినట్టు గా అనిపించి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. దర్శకుడు అసల కథ ఎటు వేల్తోందో కూడా తెలుసుకోలేదేమో అని అనిపిస్తుంది.

వెన్నెల కిశోరే పాత్ర అంతగా బాగోలేదు.  సెంటిమెంట్ సన్నివేశాలు సరిగ్గా పండలేదు. హీరో హీరోఇన్లు ఒకరి కోసం ఒకరు వీపరీతం గా త్యాగాలు చేసుకుంటారు. ఎందుకు చేస్తున్నారో, అసల అర్ధం అయి చేస్తున్నారో లేదో కూడా తెలియకుండా చేస్తున్నట్లు అనిపిస్తుంది.

స్క్రీన్ప్లే మరియు దర్శకత్వం చిత్రానికి అత్యంత పెద్ద మైనస్ పాయింట్లు.

సాంకేతిక విభాగం :

ఛాయాగ్రహణం కొన్ని చోట్ల బాగుంటే కొన్ని చోట్ల బాగోలేదు.  సంగీతం అంతంత మాత్రమే . ఎడిటింగ్ ఫర్వాలేదు. డైలాగులు బాగోలేదు.ప్రేక్షకులలో ఎటువంటి ఉత్సాహాన్ని రేపవు

విశ్లేషణ:

ప్రియుడు చిత్రం అన్ని విధాలా విఫలం అయింది. మొదటి భాగం లో అక్కడక్కడ కామెడీ మినహా, చిత్రం లో చెప్పుకోదగ్గ విశేషాలు ఏమి లేవు. ముఖ్యం గా రెండవ భాగం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. వరుణ్ సందేశ్ మరొకసారి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాడు.

Mahesh K.S

123తెలుగు.కాం రేటింగ్: 2 .5/5

Exit mobile version