సమీక్ష : వరల్డ్ ఫేమస్ లవర్ – స్లోగా సాగే రొమాంటిక్ లవ్ డ్రామా !

WFL review

విడుదల తేదీ : ఫిబ్రవరి 14, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు :  విజ‌య్ దేవ‌ర‌కొండ, రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, క్యాథెరిన్ థెరిస్సా, ఇసబెల్లా

దర్శకత్వం : క్రాంతి మాధవ్

నిర్మాత‌లు : కె.ఎ.వ‌ల్ల‌భ

సంగీతం :  గోపి సుందర్

సినిమాటోగ్రఫర్ : జయకృష్ణ గుమ్మడి

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఎమోషన్ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ వరల్డ్ ఫేమస్ లవర్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాశి ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం ఈ రోజు ప్రేమికుల రోజు కానుకగా విడుదల అయింది.

 

కథ :

గౌతమ్(విజయ్ దేవరకొండ) – యామిని(రాశీ ఖన్నా) ఇద్దరూ కాలేజ్ నుండే ప్రేమించుకుంటారు. వారి ప్రేమను యామిని ఫాదర్ ఒప్పుకోకపోతే ఇద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటారు. అయితే హ్యాపీగా సాగుతున్న వాళ్ళ లైఫ్ ల్లోకి కొన్ని సమస్యలు వస్తాయి. కాలేజీ డేస్ నుంచే రైటర్ కావాలని బుక్స్ రాయటం స్టార్ట్ చేసిన గౌతమ్ జాబ్ మానేసి రైటర్ అవుతాను అంటాడు. దాంతో వారి మధ్య అపార్ధాలు కారణంగా యామిని గౌతమ్ ను వదిలేసి వెళ్ళిపోతుంది. గౌతమ్ ఆమె వెంట పడుతూ కన్వీన్స్ చేయటానికి ట్రై చేస్తాడు. ఈ మధ్యలో భార్య భర్తలైన శీనయ్య(విజయ్) మరియు సువర్ణ(ఐశ్వర్య రాజేష్)ల కథ నడుస్తోంది. వారి కథలో ఉన్న సమస్య ఏమిటి ? ఈ కథలో (స్మిత)క్యాథెరిన్ ఎందుకు వస్తోంది ? అలాగే ఈజా (ఇసబెల్లా) కథ ఏమిటి ? అమెకు గౌతమ్ కు ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఈ కథలు నిజమా ? కల్పితమా ? చివరికి యామిని గౌతమ్ ఒక్కటవుతారా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

ఎప్పటిలాగే విజయ్ దేవరకొండ తన నటనతో సినిమాలోనే హైలైట్ గా నిలిచాడు. అలాగే డిఫరెంట్ వేరియేషన్స్ లో స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. తన మాడ్యులేషన్ అండ్ తన టైమింగ్‌ తో అక్కడక్కడా.. తన మార్క్ యాక్టింగ్ తో నవ్విస్తూనే.. ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తోనూ విజయ్ శీనయ్య, గౌతమ్ పాత్రలకి పూర్తి న్యాయం చేశాడు. ఇక శీనయ్య క్యారెక్టర్ వైఫ్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ సువర్ణ పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ఫ్యామిలీ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ ఐశ్వర్య నటన చాల బాగుంది.

అలాగే రాశి ఖన్నా నటన, విజయ్ తో కెమిస్ట్రీ చాలా బాగుంది. ఎమోషనల్ సీన్ లో ఆమె కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ క్యాథెరిన్ థెరిస్సా, ఇసబెల్లా తమకిచ్చిన చిన్న పాత్రల్లో నటించడానికి ఓ ప్రయత్నం అయితే చేశారు. పెద్దగా స్క్రీన్ టైం కూడా లేకపోయినా ఉన్నంతలో తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. కమెడియన్ ప్రియదర్శి హీరో ఫ్రెండ్ గా, హీరోకి హెల్ప్ చేసే సపోర్టింగ్ రోల్ లో బాగా నటించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

 

మైనస్ పాయింట్స్:

దర్శకుడు క్రాంతి మాధవ్ లవ్ అండ్ ఎమోషన్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథ కథనాన్ని రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో చాలా సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి.

సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి చాలా స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా, తను అనుకున్న ఎమోషన్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపించాడు. దాంతో లవ్ సీన్స్ బోర్ గా సాగాయి. దీనికి తోడు సినిమాలో ఎక్కడా సరైనా ఇన్ వాల్వ్ చేసే కాన్ ఫ్లిక్ట్ లేకపోవడం కూడా.. సినిమా పై ఆసక్తిని నీరుగారుస్తోంది.

 

సాంకేతిక విభాగం:

సాంకేతిక విభాగం విషయానికి వస్తే  ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు లవ్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు సరైన కథ కథనాలని రాసుకోలేకపోయారు. గోపిసుందర్  అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తోంది. కానీ ఆయన అందించిన పాటలు మాత్రం ఆకట్టుకోవు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది.  సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో  రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో  చాలా బ్యూటిఫుల్ గా  చూపించారు.  ఎడిటింగ్ బాగుంది కానీ,  సినిమాలోని  సాగతీత సన్నివేశాలను  తగ్గించి ఉంటే..  సినిమాకి ప్లస్ అయ్యేది.  నిర్మాత కె.ఎ.వ‌ల్ల‌భ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు:

ఎమోషన్ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. లవ్ స్టోరీస్ లో ఎదురయ్యే కొన్ని నాటకీయ పరిణామాలను, సమస్యలను దర్శకుడు ఆసక్తికరంగా చూపించలేకపోయారు.కథనం కూడా నెమ్మదిగా సాగుతూ బోర్ కొడుతుంది. అయితే విజయ్ దేవరకొండ యాక్టింగ్, యాటిట్యూడ్‌ అండ్ విజయ్ – రాశిల మధ్య కెమిస్ట్రీ అలాగే కొన్ని లవ్ ఎపిసోడ్లు పర్వాలేదనిపిస్తాయి. మొత్తం మీద ఈ సినిమాలోని కొన్ని ఎలెమెంట్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు నచ్చుతాయి. మరి మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version