సమీక్ష : ‘ప్రెజర్ కుక్కర్’ – స్లోగా సాగే అమెరికా డ్రీమ్ డ్రామా !

Bheeshma movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 21, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు :  సాయి రోనక్‌, ప్రీతి అస్రాని, తనికెళ్ల భరణి, రాహుల్‌ రామకృష్ణ, సంగీత, నరసింహారావు, తదితరులు

దర్శకత్వం : సుజోయ్, సుశీల్‌

నిర్మాత‌లు : సుశీల్‌ సుభాష్, అప్పిరెడ్డి

సంగీతం :  సునీల్‌ కశ్యప్, రాహుల్‌ సిప్లిగంజ్, స్మరణ్, హర్షవర్ధన్‌ రామేశ్వర్‌


 
సుజయ్ – సుశీల్ దర్శకత్వంలో సాయి రోనాక్ – ప్రీతీ ఆష్రాని జంటగా ఫన్నీ టైటిల్ తో పాటు మంచి కాన్సెప్ట్ తో కొత్తగా రాబోతున్న చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

కిశోర్‌(సాయి రోనక్‌) చిన్న తనం నుండే అతని తండ్రి నారాయణ (సీవీఎల్‌ నరసింహారావు) కిశోర్ ను అమెరికాను పంపాలని.. తన కొడుకు అమెరికాకి పోయాడని అందరికీ గొప్పగా చెప్పుకోవాలని ఆరాటపడతాడు. తపించిపోతాడు. కానీ కిశోర్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమెరికాకు మాత్రం వీసా దొరకదు. దాంతో అందరూ చేసే కామెంట్స్ వినలేక.. వీసా ప్రయత్నాలు అని చెప్పి హైదరాబాద్‌ లో ఉంటున్న తన ఫ్రెండ్స్ దగ్గరకు వస్తాడు. ఈ క్రమంలోనే అతనికి అనిత (ప్రీతి అస్రాని)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈ మధ్యలో కిశోర్ కి వరుసగా వీసా రిజెక్ట్‌ అవుతుంది. అంతలో అనుకోని ఆపదలో చిక్కుకుంటాడు. దాని నుండి బయటపడే క్రమంలో గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే పరికరం కనిపెడతాడు. దాంతో అతని లైఫ్ మారుతుంది. వీసా వస్తోంది. కానీ ఆనంద్ రావు (తనికెళ్ల భరణి) రూపంలో అతని ఆలోచనా విధానం మారుతుంది. మరి కిశోర్‌ తన తండ్రి కోరిక మేరకు అమెరికా వెళ్లాడా? లేదా? అలాగే కిశోర్‌- అనితల లవ్ స్టొరీ ఎలా సాగింది? చివరికి వారు ఒక్కటయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండితెర పై ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

సినిమా పేరులోనే ‘ప్రెజర్ కుక్కర్’ ఉన్నట్లు.. ఈ సినిమా కూడా ఎక్కువుగా అమెరికా పోవాలి అనే ఆ ‘ప్రెజర్’ అనే పాయింట్ చుట్టే తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన సాయి రోనక్‌ తన పాత్రకు తగ్గట్లు… తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరోయిన్ తో సాగే ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన ప్రీతీ ఆష్రాని కొన్ని లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే ఎమోషనల్ పాత్రలో నటించిన తనికెళ్ల భరణి అద్భుతంగా నటించారు. ఇక హీరో ఫ్రెండ్స్ గా నటించిన రాహుల్ రామకృష్ణతో పాటు మరో నటుడు కూడా తన కామెడీ టైమింగ్ తో తానూ కనిపించిన సీన్స్ లో బాగా అలరించారు. దర్శకులు తీసుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. వాళ్ళు రాసుకున్న కొన్ని లవ్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అలాగే మెయిన్ గా.. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ అండ్ కొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకులు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత ఆసక్తి కరంగా సాగని సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. పైగా అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తోంది. అయితే దర్శకులిద్దరూ రాసుకున్న థీమ్, కొన్ని ప్రేమ సన్నివేశాలు పర్వాలేదనిపించినప్పటికీ.. కథ కథనాల్లో మాత్రం ప్లో మిస్ అయింది. ముఖ్యంగా కథనం ఆకట్టుకొన్నే విధంగా సాగలేదు. దీనికి తోడు సెకెండ్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొడుతోంది.

మొత్తంగా సినిమాలో మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. అలాగే సినిమాలో ఉన్న కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు. దీనికితోడు హీరో చుట్టూ సాగే డ్రామా కూడా బలహీనమైన సంఘటనలకు లోబడి బలహీనంగా సాగడంతో.. సినిమాలో బలమైన సంఘర్షణ మిస్ అయింది. స్క్రిప్ట్ లో కాన్ ఫిల్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు అందించిన నేపధ్య సంగీతం జస్ట్ ఒకే అనిపించింది. హీరోయిన్ లవ్ స్టోరీకి ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. ప్రేమ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

 

తీర్పు :

 

సినిమాలో మంచి పాయింట్ అండ్ మంచి మెసేజ్ ఉన్నా ఈ చిత్రం మాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. కానీ హీరోగా చేసిన సాయి రోనాక్ మాత్రం మంచి ఫలితాన్నే ఇస్తుంది. సినిమాలో తన నటనతో, మ్యానరిజమ్స్ తో.. సాయి రోనాక్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. అయితే దర్శకులు మాత్రం ఆకట్టుకోలేకపోయారు. వాళ్ళు రాసుకున్న స్టోరీ థీమ్ మరియు కొన్ని లవ్ సీన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ.. ఓవరాల్ గా సినిమాని మాత్రం వాళ్ళు ఆసక్తికరంగా మలచలేకపోయారు. కథాకథనాలను బాగా రాసుకోవడంలో విఫలం అయ్యారు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version