సమీక్ష : స్క్రీన్ ప్లే – బోరింగ్ ప్లే తో సాగే ఫ్యామిలీ డ్రామా !

HIT movie review

విడుదల తేదీ : మార్చి 06, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు :  విక్రమ్ శివ – ప్రగతి యాదాటి, కె.ఎల్.ప్రసాద్ తదితరులు.

దర్శకత్వం : కె.ఎల్.ప్రసాద్

నిర్మాత‌లు : డాక్టర్ అరుణకుమారి

సంగీతం :  ఎం.ఏ.శ్రీలేఖ

సినిమాటోగ్రఫర్ : ఎం.వి.రఘు

ఎడిటర్ : రాజేష్ ఫణి


బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ అరుణకుమారి నిర్మించిన చిత్రం ‘స్క్రీన్ ప్లే’. ‘ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ’ అన్నది ట్యాగ్ లైన్. పరిశ్రమ వర్గాల్లో ‘స్క్రిప్ట్ డాక్టర్’గా సుప్రసిద్ధులైన కె.ఎల్.ప్రసాద్ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అయ్యారు. ఆయన ఒక ముఖ్య పాత్ర కూడా పోషించడం విశేషం. విక్రమ్ శివ – ప్రగతి యాదాటి హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

విద్యార్తి నాయకుడిగా ఉన్న గౌతమ్ (విక్రమ్ శివ) విప్లవ భావాలతో సహ విద్యార్థులను కూడా ప్రేరేపిస్తూ.. సమాజంలో జరిగతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు. అతని భావాలు అతని ఆలోచనలకు ప్రేరణ పొందిన రాధిక (ప్రగతి యాదాటి) అతన్ని ప్రేమిస్తోంది. గౌతమ్ కూడా ఆమెను సిన్సియర్ గా ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఈ క్రమంలో గౌతమ్ ఒక కమర్షియల్ ఫిల్మ్ మేకర్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే తన ఆశయాలకు విరుద్ధమైన సినిమాలు చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తాడు. అయితే రాధికకు అతని సినిమాలు, అలాగే డబ్బులు కోసం అతను చేస్తోన్న పని ఏమాత్రం నచ్చదు. పెళ్ళికి ముందు అతనిలో ఉన్న భావాలు కనుమరుగవ్వడం చూసి రాధిక అతని నుండి విడిపోవాలని నిర్ణయించుకుంటుంది. అతన్ని విడాకులు ఇవ్వమని కోరుతుంది. అయితే తనకు ఒక్క రోజు అవకాశం ఇవ్వమని ఆమెను మార్చాలనే ఉద్దేశ్యంతో రాధికను ఎవ్వరు లేని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తాడు. అక్కడ వారి మధ్య చోటు చేసుకున్న అంశాలు ఏమిటి ? వీరి మధ్యలోకి భూపతి (కె.ఎల్.ప్రసాద్) అనే అతను ఎందుకు వచ్చాడు ? అతని వల్ల వచ్చిన సమస్యలు ఏమిటి ? చివరికీ రాధికా గౌతమ్ ఒక్కటి అయ్యారా లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ప్రగతి యాదాటి తన పాత్రకు తగ్గట్లు తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో అలాగే తన కూతురుని చంపేస్తున్నాడనుకునే సీన్ తో పాటు క్లైమాక్స్ లో కూడా ఆమె నటన చాల బాగుంది. ఇక మరో కీలక పాత్రలో నటించిన కె.ఎల్.ప్రసాద్ కూడా చాల బాగా నటించారు. హీరోయిన్ ను కట్టేసి సీన్ లో అలాగే హీరో గురించి ఆయన రివీల్ చేసే సీన్ లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా నటించిన విక్రమ్ శివ చక్కగా నటించాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ అలాగే కొన్నిసీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. అలాగే దర్శకుడు తన దర్శకత్వ పనితనంతో కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంటాడు. సినిమాలోని ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు కూడా పర్వాలేదనిపిస్తాయి.

 

మైనస్ పాయింట్స్:

దర్శకుడు కె.ఎల్.ప్రసాద్ రాసుకున్న కథనంలో పెద్దగా ఇంట్రస్ట్ లేకపోవడం, పైగా చాల సన్నివేశాలను అనవసరమైన ల్యాగ్ తో సాగతీయడంతో ప్రేక్షకుడికి సినిమా పై కలిగే ఆసక్తిని కూడా నీరుగార్చాడు. మొత్తానికి దర్శకుడు సినిమాలోని ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ ను పెట్టలేకపోయారు. పైగా వర్కౌట్ కానీ ప్లేతో ఆసక్తిగా సాగని ఫ్యామిలీ సీన్స్ తో సినిమాని నడిపారు.

అసలు సినిమాలో ఇప్పుడు ఏమైంది అనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ అండ్ టెన్షన్ ను ఎలివేట్ చేసే అవకాశం చాలా చోట్ల ఉన్నా… దర్శకుడు మాత్రం ఆ కంటెంట్ ను పెద్దగా వాడుకోకుండా విషయం లేని సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేశాడు. కధలో ఎలాంటి మలుపులు లేకుండా ఒకే విషయాన్ని పదేపదే చెబుతూ సినిమాని సాగతీయడంతో ప్రేక్షకులు బాగా బోర్ గా ఫీల్ అవుతారు.

కేవలం మూడు పాత్రలు, ఓకే లొకేషన్ అని బోడర్ పెట్టుకోకుండా సినిమాని తెరకెక్కించి ఉండి ఉంటే బాగుండేది. అలాగే స్క్రిప్ట్ పై మరియు నిర్మాణ విలువల పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే ఉండాల్సింది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. కె.ఎల్.ప్రసాద్ దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. సంగీత దర్శకురాలు ఎం.ఏ.శ్రీలేఖ అందించిన పాట బాగుంది. నేపథ్య సంగీతం చాల బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదు.

 

తీర్పు :

‘స్క్రీన్ ప్లే’ అంటూ ‘ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ’ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా కథాంశం పరంగా ఆకట్టుకున్నా సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమా బాగా స్లోగా సాగుతూ బోర్ గా కొడుతొంది. అయితే కేవలం మూడు క్యారెక్టర్స్ మధ్య సినిమాని ఎమోషనల్ గా నడపటానికి దర్శకుడు మంచి ప్రయత్నం అయితే చేశారు. కానీ సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

 

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version