లాక్ డౌన్ రివ్యూ : మెట్రో కథలు – తెలుగు చిత్రం “ఆహా” లో

Thriller Telugu Movie Review

విడుదల తేదీ : ఆగస్టు 15, 2020

123telugu.com Rating : 2.25/5

నటీనటులు : గాయత్రి భార్గవి, రాజీవ్ కనకాల, రామ్ మద్దుకూరి, నక్షత్ర, జయశ్రీ రాచకొండ, నందిని రాయ్, అలీ రెజా

దర్శకుడు : కరుణ కుమార్

నిర్మాతలు : రామ్ మద్దుకూరి , కిరణ్ రెడ్డి మందాడి

సినిమాటోగ్రఫీ : వెంకట ప్రసాద్

 

ఇటీవలే ట్రైలర్ తో ఆకట్టుకున్న “మెట్రో కథలు” చిత్రం మంచి ప్రమోషన్స్ తో స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చింది. నాలుగు విభిన్న కోణాలకు చెందిన ఈ కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 

కథ :

 

ట్రైలర్ లో చూపిన విధంగా నలుగురు ప్రధాన పాత్రల చుట్టూనే తిరుగుతుంది. మొదటగా ఓ మోడ్రన్ అమ్మాయి(నక్షత్ర) తన ఆఫీస్ లో పనిచేసే కొలీగ్(తిరువీర్) చేసిన పెళ్లి ప్రపోజల్ తర్వాత ఎలా స్పందింస్తుంది? అలాగే మరోపక్క ఒక మధ్య వయసు కలిగిన ఆమె(సన) ఓ యువకుడు(అలీ రెజా) ను చూసి ఆకర్షితం అవుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలతో తన భర్త నుంచి దూరంగా ఉండే భార్య(నందినీ రాయ్) చివరిగా ఓ ముస్లిం వ్యక్తి(రాజీవ్ కనకాల) తన భార్యతో ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటాడు. అసలు ఈ పాత్రలు అన్ని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? దాని వెనుక ఉన్న కారణం ఏమిటి వీరందరికీ ఎమన్నా సంబంధం ఉందా? అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో ప్రధానంగా నాలుగు కథలు ఉన్నప్పటికీ అందరి కంటే కూడా నందిని రాయ్ చుట్టూతా తిరిగే స్టోరీ ఆకట్టుకుంటుంది. ఆ కథలో కనిపించే ఎమోషన్స్ కానీ అందులో ఉండే పైన్ కానీ చాలా నాచురల్ గా అనిపిస్తాయి. అంతే కాకుండా ఈ రోల్ కు ఆమె చాలా పర్ఫెక్ట్ గా సూటయ్యి మంచి నటనను కనబర్చింది.

అలాగే మరో కీలక పాత్రలో నటించిన రాజీవ్ కనకాల కూడా తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చి మంచి పెర్ఫామెన్స్ ను అందించారు. అలాగే మొదటి కథ కాస్త ఆసక్తికరంగా కనిపిస్తారు. అలాగే నక్షత్ర తాను ప్రపోసల్ అందుకునే సన్నివేశంలో కనబరిచిన నటన ఆకట్టుకుంటుంది. అలాగే ఆలీ రెజా రోల్ చిన్నదే అయినా సరే ఉన్నంతవరకు బాగా చేసారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో ఉన్న అన్ని కథలు డీసెంట్ బ్యాక్ డ్రాప్ కలిగి ఉన్నా సరే వాటిని ఆవిష్కరించిన కథనం మాత్రం నిరాశపరుస్తుంది. మొదటి కథ మరియు నందిని రాయ్ ల స్టోరీ తప్ప మిగతా చిత్రం అంతా పెద్దగా ఏమీ అనిపించదు. అంతా గజిబిజిగా కొనసాగుతూ ఒక షార్ట్ ఫిల్మ్ ను సాగదీసినట్టుగా ఉంటుంది.

ఆలీ రెజా మరియు సనాల ఎపిసోడ్స్ కూడా ఆన్ స్క్రీన్ పై పెద్ద వర్కౌట్ కాలేదు. పేరుకి మెట్రో కథలు అని పెట్టినా టైటిల్ కు సినిమాకు సంబంధం లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కో కథకి మంచి స్కోప్ ఉన్నా సరే అన్నిటినీ ఒకే సారి ఇరికించినట్టు అనిపిస్తుంది. అలాగే ప్రతీ కథకు కూడా ప్రాపర్ ఎండింగ్ కూడా ఇచ్చినట్టు అనిపించదు.

 

సాంకేతిక విభాగం :

 

లఘు చిత్రానికి ఎక్కువగా అనిపించే ఈ చిత్రం తక్కువ బడ్జెట్ లో ఓ మాదిరిగా కనిపిస్తుంది. అలాగే సంగీతం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పర్వాలేదనిపిస్తాయి. కథానుసారం వచ్చే డైలాగ్స్ కూడా బావుంటాయి. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత ఖాదర్ బాబు రచనల ఆధారంగా తీసినా ఒక్క నందిని రాయ్ ఎపిసోడ్ మినహా దాని సోల్ ను దర్శకుడు సరిగ్గా ఆవిష్కృతం చేయలేకపోయారు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకుంటే కొన్ని మంచి బ్యాక్ డ్రాప్ ఉన్న కథలతో మిళితమైన ఈ “మెట్రో కథలు” సరైన ఎమోషన్స్ మరియు వాటిని తెరకెక్కించిన విధానం, సరైన నిర్మాణ విలువలు బాగోకపోవడం మూలాన సినిమా దెబ్బ తింది. ఒక్క నందిని రాయ్ ఎపిసోడ్ మరియు ఆమె ఎమోషనల్ పెర్ఫామెన్స్ తప్ప మిగతా అంతా బోర్ గా సాగుతుంది. ఈ లాక్ డౌన్ లో ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిది.

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version