లాక్ డౌన్ రివ్యూ : ఆశ్రమ్ – హిందీ వెబ్ సిరీస్(ఎం ఎక్స్ ప్లేయర్ లో ప్రసారం)

నటీనటులు: బాబీ డియోల్

దర్శకత్వం: ప్రకాష్ జాహ్

నిర్మాత : ప్రకాష్ జాహ్

సినిమాటోగ్రఫీ : చందన్ కౌలి

ఈ లాక్ డౌన్ సమయంలో పలు చిత్రాలు మరియు సిరీస్ ల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న వెబ్ సిరీస్ “ఆశ్రమ్”. ఎం ఎక్స్ ప్లేయర్ స్ట్రీమింగ్ యాప్ లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఈ సిరీస్ ఉత్తరప్రదేశ్ కు చెందిన కాశీపూర్ వాలే బాబా జీవితంపై తెరకెక్కించబడింది. ఇక కథలోకి వస్తే కాశీపూర్ వాలే బాబా(బాబీ డియోల్) ఒక వెనుకబడ్డ వర్గానికి చెందిన అమ్మాయి పమ్మి(అదితి పోహంకార్) ఒక సాయాన్ని పొంది త్వరలోనే అతని సోదరునితో కలిసి ఆశ్రమంలో చేరుతానని చెప్తుంది. అయితే మరోపక్క ఆ బాబా తన ఆశ్రమంలో ఒక ఊహించని పనులు కూడా జరుపుతుంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది. ఈ బాబా ఈ సిరీస్ ను ఎలా డామినేట్ చేసాడు?అతని దగ్గర చేరిన ఆ భక్తుల సంగతి ఏంటి అన్నదే సాలు కథ.

ఏం బాగుంది?

ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ లో కనిపించిన బాబీ డియోల్ ఖచ్చతంగా ఒక బెంచ్ మార్క్ రోల్ ను సెట్ చేశారు అని చెప్పాలి. దురలవాట్లు కలిగిన ఒక కన్నింగ్ బాబాగా ఎలా కనిపించాలో అలా కనిపించి అందులోను ప్రతీ ఎక్స్ ప్రెషన్ ను చాలా ఈజ్ చేసి సూపర్బ్ గా పండించారు. అలాగే మరో కీ రోల్ లో కనిపించిన ఫిమేల్ లీడ్ అదితి తన రోల్ ను అద్భుతంగా చేసింది.

అలాగే మరో రోల్ కనిపించిన త్రిదా చౌదరి కూడా మంచి గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకుంది. అలాగే పలు పోలీస్ ఎపిసోడ్స్ మరియు పొలిటికల్ ఎపిసోడ్స్ కూడా బాగా అనిపిస్తాయి. ఈ సిరీస్ లోని నిర్మాణ విలువలు కూడా చాలా హుందాగా భారీగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఆశ్రమ్ సెట్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

అలా ఈ సపోర్టింగ్ రోల్స్ లో కనిపించిన ప్రకాష్ జాహ్, తుషా పాండే లు మంచి నటన కనబరిచారు. ఇక వీటితో పాటు మొదటి సీజన్లో కథలోని ఉన్న అన్ని కోణాలు చూపించిన విధానం బాగుంది.అలాగే పలు పొలిటికల్ సీన్స్ అయితే చాలా డీప్ గా అనిపిస్తాయి.వీటితో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ కానీ సూపర్బ్ గా అనిపిస్తాయి.

ఏం బాగోలేదు?

ముఖ్యంగా ఈ సిరీస్ కు పెద్ద డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే అది నిడివి అని చెప్పాలి. ఎపిసోడ్స్ ఎక్కువే పైగా ఒక్కో ఎపిసోడ్ కూడా 40 నిమిషాలకు పైగానే ఉంటుంది. దీనితో ఈ సిరీస్ మొత్తాన్ని చూడాలి అంటే చాలా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. దీనికి తోడు దర్శకుడు ప్రకాష్ జాన్ డీప్ గా చూపించడానికి చేసిన ప్రయత్నం అంతగా రుచించదు. అయితే స్టార్టింగ్ లో రెండు మూడు ఎపిసోడ్స్ బాగానే అనిపించినా తర్వాత మాత్రం పలు సన్నివేశాలు అంతా ఎడిటింగ్ లో ట్రిమ్ చేసి ఉండాల్సింది. అలాగే మరికొన్ని సీన్స్ అయితే అసలు అనవసరమే అనిపిస్తాయి.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకుంటే వెటరన్ దర్శకుడు ప్రకాష్ జాహ్ తెరకెక్కించిన ఈ ఆశ్రమ్ వెబ్ సిరీస్ మన దేశంలో ఉన్న బాబాలు ప్రజలను వారి భక్తి, నమ్మకం పేరిట ఎలా మోసం చేస్తున్నారు అన్నది అద్భుతంగా ఆవిష్కరించారు. కథ మరియు పెర్ఫామెన్స్ లు కానీ అద్భుతంగా అనిపిస్తాయి. కానీ ఒక్క నిడివి విషయాన్ని కనుక పక్కన పెడితే ఒక థ్రిల్లింగ్ క్రైమ్ సిరీస్ ను ఇష్టపడే వారికి మంచి ఆప్షన్ గా ఈ సిరీస్ నిలుస్తుంది.

Rating: 3.25/5

Exit mobile version