ఓటీటీ రివ్యూ : పిజ్జా 2 (శ్రేయాస్‍ యాప్ లో ప్రసారం)

నటీనటులు : విజయ్ సేతుపతి, గాయత్రీ తదితరులు

దర్శకుడు : రంజిత్ జేయకోడి

నిర్మాతలు : ఉదయ్ హర్ష వడ్డేల్ల, డి.వి.వెంక‌టేష్

స్క్రీన్ ప్లే : రంజిత్ జేయకోడి

సంగీత దర్శకుడు : సామ్ సి ఎస్

 

తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా గాయత్రీ హీరోయిన్ గా నటించిన “పిజ్జా 2” చిత్రం నవంబర్ 1వ తేదీన ఈ రోజు శ్రేయాస్‍ యాప్ లో రిలీజ్ అయింది. ఈ పిజ్జా 2 చిత్రానికి రంజిత్ జేయకోడి దర్శకత్వం వహించగా సామ్ సి ఎస్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

 

కథ:

 

కిరణ్ (విజయ్ సేతుపతి) ఒక సంగీత దర్శకుడు.. మంచి వ్యక్తి. అయితే అతని స్నేహితులు వినోద్ మరియు డీజే చేసే కొన్ని చేడు పనుల వల్ల కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. కిరణ్ స్నేహితుల్లో ఒకరు మెడిషన్ కి సంబంధించి ఇల్లీగల్ పనులు చేస్తుండగా, మరొకరు తన యజమాని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. దాని వల్ల కిరణ్ కూడా కొన్ని సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తోంది. ఇక ఈ మధ్యలో సంగీత ఉపాధ్యాయురాలైన మీరా (గాయత్రి)తో కిరణ్ కి పరిచయం ఆపై ప్రేమ. మొత్తానికి ఆమె కిరణ్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఆ తరవాత జరిగిన నాటకీయ పరిణామాల మధ్య కిరణ -మీరా జీవితాల్లో వచ్చిన సమస్యలు ఏమిటి ? వాటిని కిరణ్ ఎలా పరిష్కరించుకున్నాడు అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో వచ్చిన ఈ సినిమా సప్సెన్స్ తో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో (విజయ్ సేతుపతి) కిరణ్ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన ప్రధాన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఇక తన పాత్రలో విజయ్ సేతుపతి ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. ప్రధాన పాత్రలో నటించిన విజయ్ సేతుపతి తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ సినిమాలో సీరియస్ నెస్ తో ఒక ఇంట్రస్ట్ ను తన ఎక్స్ ప్రెషన్స్ తో మెయింటైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ నటించిన గాయత్రీ కూడా తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్:

 

దర్శకుడు రంజిత్ జేయకోడి రాసుకున్న కాన్సెప్ట్ మరియు స్క్రీన్ ప్లే.. అలాగే కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ సీరియస్ గా సాగడం.. దానికి తోడూ కొన్ని సన్నివేశాల్లో ప్లో కూడా మిస్ అవ్వడంతో అక్కడక్కడ సినిమా బోర్ కొడుతోంది.

పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించినట్లు అనిపిస్తోంది. ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడుచాలా సినిమాటిక్ గా చెప్పాడు.

 

సాంకేతిక విభాగం:

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కెమెరామెన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు రంజిత్ మంచి కథాంశంతో పాటు ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకున్నాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆయన కాస్త తడబడ్డాడు.

 

తీర్పు:

 

రంజిత్ జేయకోడి దర్శకత్వంలో విజయ్ సేతుపతి, గాయత్రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సప్సెన్స్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లేతో కొన్ని చోట్ల ఆసక్తికరంగా సాగినా… మెయిన్ సన్నివేశాలు, దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే మరీ సీరియస్ గా సాగడం, పైగా కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తం మీద ఈ ‘చిత్రం’ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి నచ్చుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు.

Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version