ఓటిటీ రివ్యూ : టోర్బాజ్ ( హిందీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం )

నటీనటులు : సంజయ్ దత్

దర్శకత్వం : గిరీష్ మాలిక్

నిర్మాతలు : రాజు చద్దా, పునీత్ సింగ్

సినిమాటోగ్రఫీ : హైరో కేశ్వాని

ఎడిటర్ : దిలీప్ డియో

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ తో ముందుకొచ్చిన తాజా బాలీవుడ్ చిత్రం ” టోర్బాజ్”.మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

 

కథ:

నాజర్ ఖాన్ (సంజయ్ దత్) భారత సైన్యంలో ఒక డాక్టర్. అతను ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తుంటాడు. అయితే ఓ దాడిలో, అతని భార్య మరియు ఆటను కొడుకు ఇద్దరూ చంపబడతారు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం నాజర్ తిరిగి భారతదేశానికి వస్తాడు. చాలా సంవత్సరాల తరువాత, కాబూల్ నుండి అతని పాత స్నేహితుడు, ఆయేషా (నర్గిస్ ఫఖ్రీ) అతన్ని ఓ శరణార్థి శిబిరం ప్రారంభోత్సవానికి పిలుస్తాడు. అక్కడికి చేరుకున్న తరువాత, శిబిరంలోని పిల్లలు క్రికెట్ ఆటలో చాలా ప్రతిభావంతులని నాజర్ తెలుసుకుంటాడు. నాజర్ వారి క్రికెట్ కోచ్ కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ పిల్లలు తమ కలలను సాధించడంలో సహాయపడతారు. కానీ ఉగ్రవాదులతో నిండిన ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలో అలా చేయడం ఘోరమైన పని. దాంతో నాజర్ ఎలా ఆ పిల్లలకు కోచ్ గా మారాడు ? చివరకు ఆ పిల్లలు కోసం నాజర్ ఏమి చేసాడు ? అనేది మొత్తం కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రం కథ విషయానికి వస్తే.. చాలా ఆసక్తికరంగానే ఉంది. అలాగే స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ వంటి ఉగ్రవాద దేశంలో పిల్లల దుస్థితి ఈ చిత్రంలో బాగా ప్రదర్శించబడింది. కథలోని కొన్ని వీక్షకులకు బాగా అవుతాయి. ఇక ఈ సినిమా ప్రధాన ప్లస్ పాయింట్ విజువల్స్. సినిమాటోగ్రఫీ అందంగా ఉంది.

ఈ చిత్రంలో సంజయ్ దత్ నటన బాగుంది. తన పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అలాగే అతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది, కాని సంజయ్ దత్ తన మ్యానరిజమ్ కారణంగా పాత్రలోని పెయిన్ ను బాగా చూపించాడు. అలాగే ప్రియాంక వర్మ అతిధి పాత్రలో బాగా నటించింది. మిగిలిన నటీనటులు కూడా బాగా నటించారు.

 

మైనస్ పాయింట్లు:

ఈ చిత్రంలోని పాటలు చాలా పెద్ద మైనస్. అలాగే, ఈ చిత్రం డాక్యుమెంటరీ అనుభూతిని కలిగిస్తోంది. పైగా ఈ చిత్రం నిస్తేజంగా ఉంటుంది. దీనికి తోడు ప్రధాన పాత్రలలోని భావోద్వేగాలు అంత ప్రభావవంతంగా ఉండవు. గిరీష్ మాలిక్ దర్శకత్వం కూడా బాగాలేదు.

దర్శకత్వం మెరుగ్గా ఉంటే అవుట్ ఫుట్ ఇంకా బాగుండేది. కొన్ని సన్నివేశాలు యాదృచ్ఛికంగా ఉంటాయి. క్రికెట్ మ్యాచ్ సన్నివేశం ఆకట్టుకోదు. అలాగే, ప్రధాన కథను ఎలివేట్ చెయడానికి సినిమా ప్రారంభంలో ఎక్కువ సమయాన్ని తీసుకున్నారు.

మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగానే ఎలివేట్ చేసినా.. కొన్ని చోట్ల నిరాశ పరుస్తాడు. కంటెంట్ పరంగా ఇంకా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు సినిమాను సింపుల్ గా ముగించడం అంతగా రుచించదు.

 

సాంకేతిక కోణాలు:

ముందుగా చెప్పుకున్నట్లుగానే దర్శకుడు మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నారు. అయితే ఆ కాన్సెప్ట్ ని తెర మీద చూపెట్టడంలో కొంత తడబాటు పడ్డాడు. కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. కెమెరామెన్ తీసిన విజువల్స్, కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. ఇక సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగాలేదు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం బాగా పెద్దగా ఏమి లేదు. ఎడిటర్ పనితనం కూడా ఆకట్టుకోదు. నిర్మాతలు నిర్మాణ విలువులు కూడా బాగున్నాయి.

 

తీర్పు:

మొత్తం మీద, టోర్బాజ్ చాలా ఆసక్తికరమైన సెటప్ ఉన్న ఎమోషనల్ డ్రామా. ఆఫ్ఘనిస్తాన్లో పిల్లల జీవితాన్ని వర్ణించే వాస్తవిక దృశ్యాలు చక్కగా కనిపిస్తాయి. కాని మిగిలిన కథనం, క్రికెట్ మ్యాచ్‌లు మరియు భావోద్వేగాలు ఈ చిత్రాన్ని నిస్తేజంగా మరియు బోరింగ్ వాచ్‌ గా మార్చాయి.

123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version