సమీక్ష : గువ్వ గోరింక – ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా

 Guvva Gorinka Telugu Movie Review

విడుదల తేదీ: డిసెంబర్ 17, 2020

123telugu.com Rating : 2/5

నటీనటులు : సత్యదేవ్ కాంచరన, ప్రియ లాల్, ప్రియదర్శి

దర్శకత్వం : మోహన్ బమ్మిడి

నిర్మాతలు : బి. జీవన్ రెడ్డి, కోసనం దాము రెడ్డి

సంగీతం : బొబ్బిలి సురేష్

 

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ యాప్ లో డిజిటల్ గా “గువ్వ గోరింక” అనే సినిమా విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

 

కథ :

సదానంద్(సత్యదేవ్) ఒక మెకానికల్ ఇంజినీర్, అసలు సౌండ్ అంటూ రాని ఒక వాహనాన్ని కనుక్కోవాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాడు. ఇక అలాగే హీరోయిన్ శిరీష(ప్రియా లాల్) తన సంగీత సాధనలో మాస్టర్స్ చెయ్యాలని హైదరాబాద్ లో ప్రిపేర్ అవుతుంది. అయితే పక్కపక్క ఫ్లాట్స్ లోనే ఉండే ఈ ఇద్దరి పరిచయం ఒకరినొకరు చూసుకోకుండానే గొడవలు నుంచి స్నేహం వరకు సాగుతుంది. మరి రెండు లక్ష్యాలు ఉన్న ఈ ఇద్దరూ చివరికి కలుసుకున్నారా? వీరి లక్ష్యాలు ఏమయ్యాయి అన్నదే అసలు కథ.

 

ప్లస్ పాయింట్స్ :

మొదటగా హీరో సత్యదేవ్ విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే లైమ్ లైట్ లోకి వస్తున్న ఈ టాలెంటెడ్ హీరో ఈ సినిమాలో కూడా తనదైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటాడు. జస్ట్ సింపుల్ గా కనిపించి తన నటనతో చూస్తున్నంతసేపు ఆసక్తి రేపుతాడు.అలాగే క్లైమాక్స్ లో కూడా సత్యదేవ్ నుంచి మంచి నటన కనబడుతుంది.

ఇంకా అలాగే తన పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ ఈ చిత్రంలో కూడా కనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ ప్రియ తన రోల్ కు పూర్తి న్యాయం చేసింది. తనకు డిజైన్ చేసిన రోల్ లో సింపుల్ అండ్ నీట్ గా కనిపిస్తుంది. ఇక అలాగే కమెడియన్ ప్రియదర్శి మరోసారి తన కామెడీ టైమింగ్ తో ఈ చిత్రంలో ఆకట్టుకుంటాడు. అలాగే క్లైమాక్స్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఈ చిత్రంలో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కు వచ్చినట్లయితే ఈ చిత్రంలో అతి పెద్ద బ్యాక్ డ్రాప్ ఏదన్నా ఉంది అంటే అది ఎలాంటి కొత్తదనం లేకపోవడమే అని చెప్పాలి. ఇక అలాగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా పెద్ద చెప్పుకోదగిన స్థాయిలో అసలు అనిపించదు. దీనితో మన సహానికి పరీక్ష పెట్టినట్టే అనిపిస్తుంది. మరి అలాగే ఇద్దరి మెయిన్ లీడ్ లో డిజైన్ చేసిన స్టోరీ కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది.

అలాగే అసలు ఇరికించి పెట్టిన కామెడీ ట్రాక్స్ అయితే మరీ దారుణం అని చెప్పాలి. అక్కడక్కడా మినహా ఈ సినిమాలో ఎక్కడా పెద్దగా కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ప్రియదర్శి అలాగే రాహుల్ రామకృష్ణ లతో ఏదో ట్రై చేసారు కానీ అవేవి సినిమాపై ఇంట్రెస్ట్ తెచ్చేందుకు అసలు దోహదపడవు. అలాగే మెయిన్ లీడ్ లవ్ లో పడే ట్రాక్ లో అసలు లాజిక్కే కనిపించదు. మరి ఇంకా చాలానే ఉన్నాయి..

ఇద్దరు హీరో హీరోయిన్స్ నడుమ అందులోను ఇలాంటి రోజుల్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేని పరిస్థితుల్లో కూడా కలిసి మాట్లాడుకోకుండా ఉండడం అదేమి లాజిక్కో ఎవరికీ అర్ధం కాదు. ఇక అలాగే చివరి పది నిమిషాలు మినహాయిస్తే సినిమాలో ఆసక్తిగా అనిపించే నరేషన్ కానీ ఎమోషన్ గాని కనిపించవు.అలాగే అనవసర అంశాలు చాలానే మెయిన్ థీమ్ ను పక్కకు నెట్టేసినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ ఈ చిత్రానికి పెద్ద ఫ్లాస్ అని చెప్పొచ్చు.

 

సాంకేతిక విభాగం :

ఈ చిత్రానికి సంగీతం ఇచ్చిన సురేష్ బొబ్బిలి డీసెంట్ వర్క్ అందించారని చెప్పాలి. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పలు సన్నివేశాలను మరింత ఇంపాక్ట్ గా చూపించగలిగాడు. అలాగే ఈ సినిమా ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ అలాగే డైలాగ్స్ మరియు లిరిక్స్ బాగుంటాయి. కానీ ఎడిటింగ్ వర్క్ ఏమాత్రం బాలేదు చాలా వరకు సినిమాను బాగా కట్ చేసి ఉంటే బాగుండేది.

ఇక దర్శకుడు మోహన్ బమ్మిడి విషయానికి వస్తే తాను అనుకున్నది అనుకున్నట్టుగా చూపించడంలో పూర్తి స్థాయిలో విజయం అందుకోలేకపోయారని చెప్పాలి. డైరెక్షన్ వరకు బాగానే ఉన్నా కథలో మాత్రం ఎలాంటి ఇంపాక్ట్ ను చూపించలేకపోయారు. మరి ఇంకా అలాగే సినిమాలోని ఫస్ట్ హాఫ్ లో అయితే కథను అసలు ఆసక్తికరంగా మలచలేదు. అలాగే మెయిన్ లీడ్ మధ్య కూడా సరైన ఎపిసోడ్స్ రాసుకోలేదు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ గువ్వ గోరింక చిత్రం చాలా సిల్లీగా అనిపించే పాయింట్స్, ఆకట్టుకోని ఎమోషన్స్ అలాగే మిస్సయిన లాజిక్కులు ఇలా చాలానే అంశాలు అంత ఆసక్తికరంగా అనిపించవు. కానీ సత్యదేవ్ సిన్సియర్ నటన అలాగే చివరి క్లైమాక్స్ ఎపిసోడ్ మినహాయిస్తే ఈ చిత్రంలో చెప్పుకోడానికి పెద్దగా ఏమీ ఉండదు.

123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version