ఓటిటి రివ్యూ : బ్లాక్ విడోస్ – (హిందీ సిరీస్ జీ 5లో ప్రసారం)

నటీనటులు : మోనా సింగ్, స్వస్తిక ముఖర్జీ, షమితా శెట్టి, శరద్ కేల్కర్, రైమా సేన్

దర్శకత్వం : బిర్సా దాస్‌గుప్తా

నిర్మాత : నమిత్ శర్మ

ఎడిటింగ్ : సుమిత్ చౌదరి

 

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము ఎంచుకున్న సిరీస్ “బ్లాక్ విడోస్”. జీ 5 స్ట్రీమింగ్ యాప్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఈ సిరీస్ లో ముగ్గురు ఫిమేల్ కీలక పాత్రలు కీలకంగా కనిపిస్తాయి. షమితా శెట్టి, మోనా సింగ్ అలాగే స్వస్తికా ముఖర్జీ. వీరి ముగ్గురి భర్తలు కొన్నేళ్ల పాటుగా వాళ్ళని దారుణంగా హింసిస్తున్నాని వాళ్ళని చంపెయ్యడానికి ఓరోజు ప్రణాళిక వేస్తారు. కానీ ఊహించని విధంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ తో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరి ఛాలెంజింగ్ సమయాన్ని వాళ్ళు ఎలా తీసుకొన్నారు? రైమా సేన్ అనే మరో పాత్ర కథలోకి ఎంటర్ అయ్యాక ఏం జరిగింది. వారందరికీ ఉన్న మెయిన్ కనెక్షన్ ఏంటి అన్నది అసలు కథ.

 

ఏమి బాగుంది?

ముందుగా చెప్పాలి అంటే ఈ సిరీస్ లో ఎంచుకున్న లైన్ కింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే మొదటి రెండు ఎపిసోడ్స్ అయితే మంచి ఇంటెన్స్ గా మరియు ఆసక్తికర నరేషన్ తో అనిపిస్తాయి. అలాగే మోనా సింగ్ రోల్ బాగుంటుంది. అలాగే మెయిన్ క్యాస్ట్ లో కూడా ఈమె పాత్రనే హైలైట్ అని చెప్పొచ్చు.

అలాగే శరద్ కేల్కర్ మరియు మోహన్ కపూర్ లు తమ రోల్స్ లో మంచి సహజత్వాన్ని చూపించారు. వీరితో పాటుగా పోలీస్ పాత్రలో కనిపించిన పరంబ్రత చక్రబర్తి మరో ప్లస్ ఎలిమెంట్ గా ఈ సిరీస్ లో కనిపిస్తారు. ఇక ఈ సిరీస్ లో మంచి నిర్మాణ విలువలు కనిపిస్తాయి. ఆకట్టుకునే బ్యాక్గ్రౌండ్ స్కోర్, పలు వైలెన్స్ సీన్లను డిజైన్ చేసిన విధానం బాగా అనిపిస్తాయి.

 

ఏమి బాలేదు?

ఇక ఈ సిరీస్ లోని ఫ్లాస్ కోసం మాట్లాడుకున్నట్టయితే చాలానే కనిపిస్తాయి. ముఖ్యంగా ఇందులో నచ్చని అంశం ఏదన్న ముందుగా గుర్తొచ్చేది అంటే అది నరేషన్ అని చెప్పాలి. ఇది ఈ సిరీస్ లో ఏమంత ఇంప్రెసివ్ గా ఉండదు. అలాగే సిరీస్ లో ఎక్కడా కూడా అంత సీరియస్ నెస్ కనిపించదు.

దర్శకుడు ఎంచుకున్న కథ కాస్త ఆకట్టుకున్నట్టు అనిపించినా దానిని ఎస్టాబ్లిష్ చేసే విధానం మాత్రం పూర్తిగా నిరాశపరుస్తుంది. అలాగే చాలా కాలం తర్వాత కం బ్యాక్ ఇచ్చిన షమితా శెట్టి ఇలాంటి రోల్ ను ఎందుకు ఎంచుకున్నారో ఆమెకే తెలియాలి.

మరి అలాగే ఈ సిరీస్ లో లాజిక్స్ కూడా అసలు సంబంధమూ లేకుండా అనిపిస్తాయి. అలాగే క్యాస్టింగ్ పరంగా కూడా రోల్స్ ను ఇంకా బలంగా ప్రదర్శించి ఉండాల్సింది. అలాగే డైరెక్టర్ మంచి పాయింట్ నే ఎంచుకున్నా సరే దాన్ని తానే చెడగొట్టినట్టు అయ్యింది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసిన “బ్లాక్ విడోస్” లో ఉండే కథ మంచి ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది అలాగే పలువులు నటీనటుల పెర్ఫామెన్స్ మరియు మొదటి రెండు ఎపిసోడ్స్ బాగా అనిపిస్తాయి కానీ సరైన డైరెక్షన్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా దాని వల్ల చెడగొట్టినట్టు అనిపిస్తుంది. సో సిరీస్ కు దూరంగా ఉంటేనే బెటర్.

 

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version