రివ్యూ : “కూలీ నెం 1″(హిందీ చిత్రం ప్రైమ్ వీడియోలో ప్రసారం)

నటీ నటులు : వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్, పరేష్ రావల్, జావేద్ జాఫ్రీ, జానీ లివర్, వికాస్ వర్మ

దర్శకత్వం: డేవిడ్ ధావన్

నిర్మాత : వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్శిఖా దేశ్ముఖ్

సినిమాటోగ్రఫీ : రవి కె. చంద్రన్

ఎడిటింగ్ : రితేష్ సోని

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ రిలీజ్ తో ముందుకొచ్చిన తాజా బాలీవుడ్ చిత్రం “కూలీ నెంబర్ 1”.మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయతే రాజ్(వరుణ్ ధావన్) ఓ రైల్వే స్టేషన్ లో రోజువారి కూలీగా పని చేస్తూ ఉంటాడు. అతడు బిలినియర్ అయినటువంటి పరేష్ రావల్ కూతురు (సారా)సారా అలీ ఖాన్ తో ప్రేమలో పడతాడు. కానీ ఆమె తండ్రి మాత్రం తన కూతుర్ని మరో బిలినియర్ కే ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటాడు. దీనితో రాజ్ ఓ బిలినియర్ గా నటించి అతన్ని ఇంప్రెస్ చెయ్యాలని ప్రయత్నం చేస్తాడు. మరి ఈ క్రమంలో అతనికి ఏమయ్యింది? తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా అన్నది అసలు కథ.

ఏమి బాగుంది?

ఈ చిత్రంలో గత 1995లో వచ్చిన కూలి నెంబర్ 1 సినిమాకు రీమేక్ అని అందరికీ తెలిసిందే. మరి అందుకు తగ్గట్టుగానే డేవిడ్ ధావన్ తన కొడుకు వరుణ్ ధావన్ కోసం స్రిప్ట్ లో పెద్దగా మార్పులు ఏమి చెయ్యలేదు. మరి ఇందులో వరుణ్ బాగా చేసాడని చెప్పాలి.తన పెర్ఫామెన్స్ వరకు వరుణ్ మంచి ఫన్ ను జెనరేట్ చేసాడు అలాగే కొన్ని ఎమోషన్స్ ఓకే అని చెప్పొచ్చు.

అలాగే గోవింద రోల్ కు అయితే యాప్ట్ గా సెట్టయ్యాడని చెప్పాలి. అలాగే హీరోయిన్ సారాకు పెద్దగా స్కోప్ లేకపోయినా తన పాత్ర మేరకు బాగానే చేసింది. అలాగే ఇతర నటీనటులు కూడా ఓకే అని చెప్పొచ్చు. అయితే మెయిన్ లీడ్ లో వరుణ్ మరియు పరేష్ రావల్ ల మధ్య కొన్ని సన్నివేశాలు బాగుంటాయి. ఇక ఈ సినిమాలో పాటలు, డైలాగ్స్ నిర్మాణ విలువలు బాగుంటాయి.

ఏమి బాలేదు?

ఇక ఈ సినిమాలోని డ్రా బ్యాక్స్ లిస్ట్ తీస్తే పెద్దదే వస్తుంది అని చెప్పాలి. రీమేక్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు కనీసం బేసిక్ మార్పులు కూడా చెయ్యలేదు ఒక్క పాటలు క్యాస్టింగ్ వేరే తప్ప అదే పాత కథను పరమ రొటీన్ గా చూపించడం బోరింగ్ గా అనిపిస్తుంది. అంతే కాకుండా ఓవర్ రేటెడ్ కామెడీ అందులో ఎలాంటి సహజత్వం లేకపోవడం చూసే వాళ్లకి చిరాకు పుట్టిస్తుంది. అలాగే స్క్రీన్ ప్లే కూడా అంత చెప్పుకోదగ్గే స్థాయిలో ఉండదు.

ఒరిజినల్ సినిమాలో ఉండే ఎమోషన్స్ అలాగే సోల్ ను ఇందులో డేవిడ్ పూర్తిగా చెడగొట్టేసారు. ముఖ్యంగా ఓ సీన్ అయితే దారుణమే అని చెప్పాలి. ఈరోజుల్లో కూడా అలాంటి సన్నివేశాన్ని ఎందుకు ప్లాన్ చేసుకున్నారో వారికే తెలియాలి. ఆ ఓవర్ యాక్షన్ సన్నివేశాన్ని హీరో కూడా ఎందుకు ఒప్పుకున్నాడో అతనికే తెలియాలి. అది ఒక్క ఆ సినిమాకే కాకుండా బాలీవుడ్ ఇతర సినిమాలపై కూడా ఎఫెక్ట్ తెప్పిస్తుంది. వీటితో పాటుగా చాలా గందరగోళంగా అనిపించే నరేషన్ మెయిన్ ప్లాట్ ను పక్కకు నెట్టినట్టు అనిపిస్తుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నటైతే ఈ “కూలీ నెం 1” సినిమా ఒరిజనల్ సినిమాను పాడు చేసిందే అని చెప్పాలి. ఆకట్టుకొని కథనం, అసలు వర్కౌట్ కానీ కామెడీ, లాజిక్ లేని సన్నివేశాలు, ఓవర్ అనిపించేవి కొన్ని బాగా దెబ్బ తీస్తాయి. కేవలం మెయిన్ లీడ్ పెర్ఫామెన్స్ కోసం తప్పితే ఈ సినిమాకు దూరంగా ఉంటేనే మంచిది.

 

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here To Read English Version

Exit mobile version