ఇంటర్వ్యూ : శ్రీరామ్ వేణు – కళ్యాణ్ గారి ప్రెజెన్స్ సెట్స్ లో చాలా పాజిటివిటి తీసుకొస్తుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రంపై హైప్ ఇప్పుడు మరో లెవెల్లో ఉంది. మరి దీనికి ఇంతలా హైప్ రావడానికి ప్రధాన కారకుల్లో ఒకరైన దర్శకుడు శ్రీరామ్ వేణు లేటెస్ట్ గా మీడియాతో ముచ్చటించారు. మరి ఈ ఇంటర్వ్యూలో శ్రీరామ్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారో ఇప్పుడు చూద్దాం..

 

పవర్ స్టార్ వర్క్ ఎక్స్ పీరియెన్స్ ఎలా అనిపించింది?

ఆయనతో పని చెయ్యడం అనేది నాకు ఒక లైఫ్ టైం మెమొరీ లాంటిది అని చెప్తాను. షూటింగ్ టైం లో చాలా టెన్షన్స్ అన్నీ ఉంటాయి కానీ కళ్యాణ్ గారిని సెట్స్ చూసే సరికి నాకు చిరు నవ్వు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అలాగే ఆయన ప్రెజెన్స్ సెట్స్ లో చాలా పాజిటివిటీ తీసుకొస్తుంది.

 

పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ కి ‘పింక్’ ను ఎలా ప్రిపేర్ చేసారు?

కళ్యాణ్ గారి కోసం స్క్రిప్ట్ ప్రిపేర్ చెయ్యడని ఎక్కువ టైం నే తీసుకున్నాను. మొత్తం నాలుగు సిట్టింగ్స్ వేస్తే కానీ కంప్లీట్ అవ్వలేదు. అలాగే నా టీం కూడా ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం ఎక్కడా మెయిన్ కంటెంట్ ఫ్లో పోకుండా కమెర్షియల్ రాయడానికి చాలా కష్టపడ్డారు.

 

మరి కళ్యాణ్ గారి స్టార్డం ను ఎలా బ్యాలన్స్ చేయగలిగారు?

ఈ సినిమాలో ఓ పక్క కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ కరెక్ట్ గా ఉంటాయి. ఇండస్ట్రీలో పదేళ్ల నుంచి ఉంటున్నాను కాబట్టి కళ్యాణ్ గారి లాంటి స్టార్ హీరోకు ఎలా పని చేస్తే బాగుంటుందో తెలుసు సో అలా స్క్రీన్ ప్లే కూడా బ్యాలన్స్ చేసా..

 

“వకీల్ సాబ్” టైటిల్ నే తీసుకోడానికి కారణం ఏమన్నా ఉందా?

ముందు నుంచి చెప్తున్నట్టే ఈ సినిమా కంటెంట్ ప్రకారం మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో దానిని కళ్యాణ్ గారి ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకొని వకీల్ సాబ్ అయితే బాగుంటుంది అని అది పెట్టాం.

 

సినిమాలో చేసిన ముగ్గురు అమ్మాయిలు కోసం చెప్పండి, ఎవరిది కీ రోల్?

నివేతా థామస్, అంజలి అలాగే అనన్య నాగళ్ళ ముగ్గురూ తమ రోల్స్ ను చాలా బాగా చేశారు. అలాగే స్పెషల్ రోల్ లో కనిపించే శృతి కూడా మంచి రోల్ లో కనిపిస్తుంది.

 

మరి బన్నీతో ప్లాన్ చేసిన ‘ఐకాన్’ ఇంకా ఉందా?

అవును ఖచ్చితంగా ఆ సినిమా ఉంది, కాకపోతే ఎప్పుడు మొదలవుతుందో నాకు కూడా తెలీదు..

 

మరి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ప్రస్తుతానికి అవేవి దృష్టిలో లేవండి ఇప్పుడు మొత్తం నేను ఏప్రిల్ 9 వకీల్ సాబ్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను.

Exit mobile version