ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం మళ్ళీ పెరుగుతుంది. దీనితో మన టాలీవుడ్ దాదాపు చాలా మేర సినిమాలు ఆగిపోయాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఇంకా ఎలాంటి బ్రేక్ తీసుకోలేనట్టు తెలుస్తుంది. మరి వాటిలో లేటెస్ట్ గా నాని సినిమాలతో పాటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”.
అలాగే నందమూరి నటసింహం బాలయ్య మరియు బోయపాటి శ్రీనులా కాంబోలో తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ మాస్ చిత్రం “అఖండ” సినిమాలు కూడా ఎలాంటి బ్రేక్స్ తీసుకోలేనట్టు తెలుస్తుంది. వీటి ప్లానింగ్ ప్రకారమే అనుకున్న విధంగా షూట్స్ కరోనా నిబంధనలు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ కనిచేస్తున్నారట.
అయితే బన్నీ సుకుమార్ లకి ఇది హ్యాట్రిక్ సినిమానే అలాగే బాలయ్య బోయపాటికి కూడా హ్యాట్రిక్ సినిమానే ఈ సమయంలో షూట్స్ జరుగుతుండడం విశేషం. మరి ఈ రెండు హ్యాట్రిక్ చిత్రాలు యథావిథిగా కంప్లీట్ చేసేస్తాయా లేక బ్రేక్ ఏమన్నా పడుతుందా అన్నది చూడాలి.