ఓటిటి రివ్యూ : తమన్నా “నవంబర్ స్టోరీ” – తెలుగు డబ్ సిరీస్ హాట్ స్టార్ లో

November-Story movie review

విడుదల తేదీ : మే 21,2021

123telugu.com Rating : 3/5

నటీనటులు : తమన్నా, కులంధై యేసు, గణేశన్

దర్శకుడు : ఇంద్ర సుబ్రమణియన్

నిర్మాణం : వికాటన్ టెలివిస్టాస్

సంగీతం : శరణ్ రాఘవన్

సినిమాటోగ్రఫీ : విధు అయ్యన్న

ఎడిటింగ్ : శరణ్ గోవింద్ సామి


ప్రస్తుతం కొనసాగుతున్న పలు ఓటిటి చిత్రాలు మరియు వెబ్ సిరీస్ ల రివ్యూల క్రమంలో మేము ఎంచుకున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ “నవంబర్ స్టోరీ”.స్టార్ హీరోయిన్ తమన్నా మెయిన్ లీడ్ లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ నిన్ననే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తమిళ్, తెలుగు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఆడియెన్స్ ని ఎంత మేర మెప్పిస్తుందో సమీక్షలో తెలుసుకుందాం.

 

కథ :

 

అనురాధ(తమన్నా) ఓ ఎథికల్ హ్యాకర్ గా పనిచేస్తూ మతి స్థిమితం సరిగా లేని తన తండ్రి గణేష్ (జి ఎం కుమార్) తో ఓ ఇంట్లో సాధారణ జీవనం గడుపుతుంటుంది. అయితే తన తండ్రి ఇండియాలోనే ప్రముఖ క్రైమ్ బుక్ రైటర్. అలాంటి వ్యక్తిని బాగు చెయ్యించాలంటే ఆ ఇల్లు అమ్మాల్సి వస్తుంది అందుకోసం తమన్నా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ నవంబర్ లో ఓ రోజు ఊహించని విధంగా ఓ ఇంట్లో అనూహ్యంగా మర్డర్ జరిగి ఆ శవం పక్కనే తమన్నా తండ్రి ఉండడం చూసి ఆమె షాక్ అవుతుంది. ఇక అక్కడ నుంచి ఈ క్రైమ్ మిస్టరీ ఎలా సాగింది? అసలు ఆ మర్డర్ చేసింది ఆయనేనా అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? అసలు నిందితులు ఎవరు? అన్న విషయాలు తెలియాలి అంటే ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాలి.

 

ఏమి బాగుంది.?

 

జెనరల్ గా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో మంచి నరేషన్ ముఖ్యం అది ఇందులో మధ్యలో నుంచి బాగా కనిపిస్తుంది. అలాగే ఒక్కో ట్విస్ట్ రివీల్ చెయ్యడం కానీ కంప్లీట్ డార్క్ నరేషన్ కానీ సింపుల్ ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. ఇక తమన్నా కోసం స్పెషల్ గా చెప్పాలి. తన లుక్స్ పరంగా చాలా నాచురల్ గా కనిపించి నటనలో కూడా అంతే సహజత్వాన్ని కనబరిచింది.

తన తండ్రితో ఉండే ప్రతీ ఎపిసోడ్ లో పంచించిన పలు ఎమోషన్స్ తనకి ఎదురయ్యే సమస్యలను హ్యాండిల్ చేస్తూ వచ్చే పెర్ఫామెన్స్ బాగుంది. అలాగే కోలీవుడ్ నటుడు పశుపతి రోల్ కూడా ఇందులో చాలా బాగుంటుంది ఓ పక్క ఇనోసెంట్ గా ఉంటూనే తన రోల్ ఫ్లాష్ బ్యాక్ కానీ ఎండింగ్ వరకు డిజైన్ చేసిన విధానం కానీ మెప్పిస్తాయి. వీరితో పాటుగా జి ఎం కుమార్ సహా నటీనటులు తమ రోల్స్ మేరకు బాగా నటించారు. అలాగే క్రైమ్ పరంగా ఓ వెబ్ సిరీస్ కు కావాల్సిన రియలిస్టిక్ విజువల్స్ ఇందులో కనిపిస్తాయి.

 

ఏమి బాగాలేదు.?

 

మొత్తం 7 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేసిన ఈ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ నిడివి ఎక్కువగా డిజైన్ చెయ్యడం డ్రా బ్యాక్ అని చెప్పాలి. సరే ఎక్కువ నిడివి ఉన్నా అవి మొదటి మూడు ఎపిసోడ్స్ అయితే బాగా స్లోగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే మెయిన్ లైన్ లోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం వేస్ట్ చేసినట్టు కూడా అనిపిస్తుంది.

పైగా ఈ సిరీస్ లో స్టోరీ లైన్ కూడా పెద్దగా కొత్తగా ఏమీ అనిపించకపోవడం మరో డ్రా బ్యాక్. అలాగే కొన్ని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కానీ ఎపిసోడ్ ఎండింగ్ కు కావాల్సిన మేజర్ ట్విస్టులు పెద్దగా ఎలివేట్ అయ్యినట్టు అనిపించవు. వీటి మూలాన క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి ఆశించే థ్రిల్ పెద్దగా కలగదు.

ఫైనల్ గా ఒక మర్డర్ మిస్టరీ చుట్టూతా తిరిగే ఎమోషన్స్ మరియు మొదటి నుంచి కనిపించే కీలక పాత్రలకు దర్శకుడు సరైన ముగింపు కూడా ఇచ్చినట్టు అనిపించకపోవడం విచారకరం.

 

సాంకేతిక విభాగం :

 

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు చాలా ఎండింగ్ వరకు కూడా ఎక్కడా విజువర్స్ పరంగా కానీ కనిపించే సన్నివేశాల పరంగా కానీ చాలా రియలిస్టిక్ సన్నివేశాల్లో మంచి నిర్మాణ విలువలు కనిపిస్తాయి. అలాగే ఈ థ్రిల్లర్ కి కావాల్సిన కెమెరా వర్క్ చాలా బాగుంటుంది. మ్యూజిక్ మాత్రం పర్లేదు అని చెప్పాలి. ఎడిటింగ్ ఇంకా చేసి నరేషన్ బాగా మలచి ఉంటే బాగుండేది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఇంద్ర సుబ్రమణియన్ పనితనానికి వస్తే ఓవరాల్ గా యావరేజ్ మార్కులు మాత్రమే వెయ్యొచ్చు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “నవంబర్ స్టోరీ”లో తమన్నా సహా కొంతమంది కీలక పాత్రధారుల పెర్ఫామెన్స్ లు అలాగే కొన్ని ఎపిసోడ్స్ లో సాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరియు కొన్ని లిమిటెడ్ ఎమోషన్స్ బాగుంటాయి. కానీ అంత కొత్తగా లేని కథ నెమ్మదిగా సాగే కథనాలు అంత ఇంట్రెస్ట్ తెప్పించవు. ఇవి పక్కన పెడితే ఈ వారాంతానికి ఈ సిరీస్ ని థ్రిల్లర్ ఆడియెన్స్ ఓసారి చూడొచ్చు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

 

Exit mobile version