ఓటిటి రివ్యూ : 30 వెడ్స్ 21 – తెలుగు సిరీస్ యూట్యూబ్ లో

30Weds21 movie review

విడుదల తేదీ : మే 28,2021

123telugu.com Rating : 3/5

నటీనటులు : చైతన్య రావు, అనన్య, మహేందర్, దివ్య, వీరభద్రం, శ్రీ కుమారి

దర్శకుడు : పృథ్వీ వనం

నిర్మాణం : అనురాగ్ – శరత్

సంగీతం : జోస్ జిమ్మీ

సినిమాటోగ్రఫీ : ప్రత్యక్ష్ రాజు

ఎడిటింగ్ : తారక్ సాయి ప్రతిక్

ప్రస్తుతం కొనసాగిస్తున్న పలు ఓటిటి రివ్యూ పరంపరలో తాజాగా యూత్ లో సెన్సేషన్ ను రేపిన లేటెస్ట్ తెలుగు సిరీస్ 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ కూడా చూడడం జరిగింది. యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ప్యూర్ తెలుగు సిరీస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక ఈ సిరీస్ కథలోకి వెళ్లినట్టు అయితే 30 ఏళ్ళు వయసున్న పృద్వి(చైతన్య రావ్) ప్రస్తుతం నడుస్తున్న లాక్ డౌన్ లో ఎందరికో సడెన్ గా పెళ్లిళ్లు అయ్యిపోయినట్టుగా అన్నీ తన ప్రమేయం లేకుండానే 21 ఏళ్ళు ఉన్న అమ్మాయి మేఘన(అనన్య) తో పెళ్లి జరిగిపోతుంది. అయితే తన కన్నా చాలా చిన్న వయసు కలిగిన అమ్మాయిని చేసుకున్నా అని ఒక గిల్ట్ ఎప్పుడూ పృద్వి మనసులో ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి కూడా లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు ఉంటుంది. మరి ఇలాంటి భిన్న కోణాలు కలిగిన ఇద్దరు భార్యా భర్తలు ఎలా తమ లైఫ్ ని లీడ్ చేస్తారు? వీరి స్టోరీ ఎలా ఎండ్ అయ్యింది అన్నది తెలుసుకోవాలి యూట్యూబ్ లో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

కేవలం ఐదు ఎపిసోడ్స్ గా మాత్రమే ప్లాన్ చేసిన ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ప్లెసెంట్ గా మంచి నాస్టాల్జియా ఫీల్ ను కలుగజేస్తాయి. ముఖ్యంగా మొదటి రెండు ఎపిసోడ్స్ లో కామెడీ రైటింగ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ప్రతి ఎపిసోడ్ లో మంచి ఎండింగ్ డీసెంట్ గా అనిపిస్తాయి.

వీటితో పాటుగా ఇద్దరు డిఫరెంట్ కోణాలు కలిగిన ఇద్దరు భార్య భర్తలు మధ్య కాన్సెప్ట్ అనేది కాస్త కొత్తగా దానిని డీల్ చేసిన విధానం ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగే ఈ సిరీస్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్ కె స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇక మెయిన్ గా కనిపించే ఇద్దరు నటులు చైతన్య, అనన్య అందించిన పెర్ఫామెన్స్ సింప్లి సూపర్బ్ అని చెప్పాలి.

దీని కాన్సెప్ట్ కి వీరిద్దరూ కరెక్ట్ గా సెట్టవ్వడమే కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అద్భుతమైన అవుట్ పుట్ ని ఇచ్చారు. చైతన్య చాలా సెటిల్డ్ పెర్ఫామెన్స్ ను కనబరిచాడు. అలాగే అనన్య బ్రిలియెంట్ పెర్ఫామెన్స్ అయితే చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ఎంతమేర కనిపించాలి గ్లామరస్ గా కనిపించడమే కాకుండా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా అనిపిస్తుంది. వీరితో పాటుగా కార్తీక్ అనే రోల్ కూడా మంచి నవ్వు తెప్పిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సిరీస్ కోసం పెద్దగా తెలియకుండా మొదలు పెట్టిన వారికి మాత్రం మొదటి రెండు ఎపిసోడ్స్ చాలా ఫ్రెష్ గా మంచి ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి. కానీ ఆ తర్వాత నుంచి అంతా సోసో గానే అనిపిస్తుంది. మిగతా అన్ని ఎపిసోడ్స్ కూడా కాస్త రొటీన్ గానే ఓ మోస్తరుగా సాగినట్టు అనిపిస్తాయి. అలాగే ఎమోషన్స్ కూడా ఇంకా బేటర్స్ వెర్షన్ లో ఉంటే బాగున్ను అనిపిస్తుంది. అలాగే లాస్ట్ ఎపిసోడ్ ఎపిసోడ్ జస్ట్ యావరేజ్ గానే అనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

 

మొట్టమొదటగా ఈ సిరీస్ లో ప్రతి ఫ్రేమ్ లోని ఫీల్ కి అందం తీసుకొచ్చింది జోస్ జిమ్మీ మ్యూజిక్ అని చెప్పాలి. ఒక రకమైన ఫీల్ ను పలు సన్నివేశాల్లో జిమ్మీ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో తీసుకొచ్చేసాడు. అలాగే కొన్ని షాట్స్ లో అయితే కెమెరా వర్క్ చాలా బావుంది.. అలాగే నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి.

ఇక డైరెక్టర్ పృద్వి విషయానికి వస్తే తాను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది కానీ ఇంకా మంచి ఎమోషన్స్ తో మరింత ఎంటర్టైనింగ్ గా మలచి ఉంటే డెఫినెట్ ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ కన్నా బెటర్ ఫీడ్ బ్యాక్ వచ్చేది. అంతకు మించి తన వర్క్ పరంగా ఎలాంటి డ్రా బ్యాక్స్ లేవు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టుతే ఈ 30 వెడ్స్ 21 సిరీస్ టైటిల్ కి తగ్గట్టుగానే కంప్లీట్ జస్టిస్ కనిపిస్తుంది. డీసెంట్ కామెడీ అండ్ రొమాంటిక్ యాంగిల్స్ సహా మెయిన్ లీడ్స్ చైతన్య మరియు అనన్యల ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ లు మంచి నస్టాలిజిక్ ఫీల్ ను కలిగిస్తాయి. కాకపోతే.. కాస్త రొటీన్ అనిపించే పలు ఎమోషన్స్ అండ్ సీన్స్ పక్కన పెడితే ఒకసారి ఫ్యామిలీతో కలిసి ఈ సిరీస్ ని చూసేయొచ్చు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version