బిగ్ బాస్ తర్వాత టాలీవుడ్ యూత్ ఫుల్ హీరో వరుణ్ సందేశ్ కి మళ్ళీ హీరోగా అవకాశం వచ్చింది. అలా తాను చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ నే “ఇందువదన” శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎం ఎస్ ఆర్ దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రంలో ఫర్నాజ్ శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. తాజాగా విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన రెస్పాన్స్ కూడా వచ్చింది.
అయితే అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ కథాపరంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు ఎం ఎస్ ఆర్. విడుదలైన క్షణం నుంచే ఇందువదన లుక్కు మంచి స్పందన వస్తున్నందుకు చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉండటమే కాకుండా, వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో వరుణ్ సందేశ్ పోషిస్తున్న వాసు పాత్రకి సంబంధించిన లుక్ విడుదలైంది, అలానే ఫర్నాజ్ శెట్టి పోషిస్తున్న ఇందు పాత్రకి సంబంధించిన లుక్ కూడా టీమ్ ఇందువదన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే పూర్తియింది, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో భారీగా వేసిన సెట్స్ లో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరిగింది. ఈ సినిమాకు కథ, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బి మరళికృష్ణ సినిమాటోగ్రాఫి బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.
ఇక ఈ చిత్రం టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు: ఎం ఎస్ ఆర్, బ్యానర్: శ్రీ బాలాజీ పిక్చర్స్, నిర్మాత: శ్రీమతి మాధవి ఆదుర్తి, కో. ప్రొడ్యూసర్: గిరిధర్, కథ, మాటలు: సతీష్ ఆకేటి, కెమెరా: బి మురళి కృష్ణ, సంగీతం: శివ కాకాని, కో డైరెక్టర్: ఉదయ్ రాజ్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: వై నాగు, లిరిక్స్: భాస్కరబట్ల, తిరుపతి జావన, లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాల, వర్మ, పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్ లు వ్య్వవహరిస్తున్నారు.