బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు వంటలక్క ప్రేమీ విశ్వనాథ్. కార్తీక దీపం సీరియల్ తో ఎంతో ఫేమస్ అయిన ఈ నటి చాలా క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా రామ్ పోతినేని మరియు లింగుస్వామి కాంబినేషన్ లో ఒక సినిమా ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం లో ఒక పాత్ర కోసం చిత్ర యూనిట్ వంటలక్క ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే కథ నచ్చడం తో ప్రేమీ చిత్రానికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాక రెమ్యునరేషన్ కూడా భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీని పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో ప్రారంభం అయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల తో హీరో రామ్ సినీ పరిశ్రమ లో క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.