ఓటిటి సమీక్ష : “మాలిక్” – మళయాళ చిత్రం ప్రైమ్ వీడియోలో

 Malik - Malalyalam Movie Review

విడుదల తేదీ : జూలై 15,2021
123telugu.com Rating : 3/5

నటీనటులు: ఫహద్ ఫాజిల్, వినయ్ ఫోర్ట్, నిమిషా సజయన్, జోజు జార్జ్, దివ్య ప్రభ
దర్శకుడు: మహేష్ నారాయణన్
నిర్మాత : ఆంటో జోసెఫ్
సంగీతం : సుశీన్ శ్యామ్
సినిమాటోగ్రఫీ : షను వర్దేశే


ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ షోస్ మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం మళయాళ ఇండస్ట్రీ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన చిత్రం “మాలిక్”. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈరోజే నేరుగా విడుదల కాబడ్డ ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు సమీక్షలో తెలుసుకుందాం రండి..

కథ :

కేరళ లోని రామడపల్లికి చెందిన సులేమాన్(ఫహద్ ఫాజిల్) ఆ ప్రాంతంలోనే అనేక క్రైమ్ నేరాలు చేసి పోలీసులకు పట్టుబడతాడు. అయితే అతడు చేసిన క్రూర నేరాలు నిమిత్తం పొలిటికల్ మలుపులు తిరిగి అతన్ని జైల్లోనే మట్టు పెట్టాలని ప్లాన్ చేస్తారు. మరి క్రమంలో అతన్ని వారెలా చంపాలని ప్లాన్ చేస్తారు? అతన్ని చంపుతారా? అసలు సులేమాన్ వెనుకున్న కథ ఏంటి అతడెందుకు అలాంటి క్రైమ్స్ చెయ్యాల్సి వస్తుంది అన్న వంటివి తెలియాలి అంటే ఈ సినిమాని ప్రైమ్ వీడియో లో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

జెనరల్ గా ఫహద్ ఫాజిల్ సినిమా అంటే ఒక గ్యారంటీ మార్క్ ఉంది. ఓ పక్క తన విలక్షణమైన నటన, దానికి తోడు తాను ఎంచుకునే సినిమాల ఎంపిక. అందుకే మూవీ లవర్స్ లో ఫాజిల్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాలో కూడా ఫహద్ బ్రిలియెంట్ పెర్ఫామెన్స్ అందించాడు.

పలు కీలక సన్నివేశాల్లో తన ఎమోషన్స్, బాడీ లాంగ్వేజ్ కానీ చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. అలాగే ఈ చిత్రంలో ఒక పావుగంట సేపు సింగిల్ టేక్ షాట్ ను తీసిన విధానం ఆ ఎపిసోడ్ కానీ ఈ సినిమా మేకర్స్ పనితనాన్ని చూపెడుతుంది. ఇది ఈ సినిమాలో ఒక ఖచ్చితంగా ప్రత్యేకమైన ప్రధాన ఆకర్షణ అని చెప్పి తీరాలి.

అలాగే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మంచి ఆసక్తికరంగా సాగుతాయి.. ఇక ఫహద్ తో పాటుగా కనిపించే కీలక నటులు నిమిషా సజయన్, జాజు జార్జ్, సనల్ అమన్ తదితరులు తమ స్క్రీన్ స్పేస్ కి తగ్గట్టుగా ఇంప్రెసివ్ నటనను కనబరిచారు.

మైనస్ పాయింట్స్ :

ఎంత పెద్ద సినిమా అయినా కూడా మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటే ఖచ్చితంగా కూర్చొని చూస్తారు. కానీ 160 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో అది మిస్సవుతుంది. చాలా చోట్ల సినిమా కాస్త స్లో గా సాగుతున్నట్టు అనిపించడం మూలాన బోర్ ఫీల్ కలుగుతుంది.

అలాగే కొన్ని సన్నివేశాలు కూడా కావాలని ఇరికించినట్టు అనిపిస్తుంది ఇంకా క్లైమాక్స్ కూడా ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. వీటితో పాటుగా మన తెలుగు నేటివిటీకి దగ్గరగా కొన్ని సీన్స్ కనపడతాయి కానీ అవి సందర్భానుసారంగా వచ్చినా అనవసరం అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉంటాయి. అలాగే టెక్నీకల్ టీంలో షను ఇచ్చిన సినిమాటోగ్రఫీ కానీ తాను చూపిన విజువల్స్ కానీ చాలా నాచురల్ గా అనిపిస్తాయి. అలాగే శ్యామ్ సుషిన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది.

ఇక దర్శకుడు మహేష్ నారాయణన్ విషయానికి వస్తే తాను ఎంచుకున్న కథను చాలా వరకు సక్సెస్ ఫుల్ గానే రన్ చేసాడని చెప్పాలి. కానీ కొన్ని సన్నివేశాలను ఇంకా బాగా ఎలివేట్ చేసి ఉంటే బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే క్రైమ్ అండ్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ “మాలిక్” చిత్రం ఎప్పటి లానే ఫహద్ సాలిడ్ పెర్ఫామెన్స్ తో పలు చోట్ల థ్రిల్ చేస్తుంది. అలాగే మరిన్ని సన్నివేశాల్లో దర్శకుడి బ్రిలియెన్స్ కూడా మెప్పిస్తుంది. కానీ కాస్త స్లో గా సాగే నరేషన్, లాజిక్కులు పక్కన పెడితే ఈ చిత్రాన్ని ఈ సమయంలో ఖచ్చితంగా చూసేయొచ్చు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version