సమీక్ష : ‘మెరిసే మెరిసే’ – స్లోగా సాగే రొటీన్ లవ్ డ్రామా!

Merise Merise Movie Review

విడుదల తేదీ : ఆగస్టు 06, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.25/5

నటీనటులు : దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు

దర్శకుడు: పవన్ కుమార్. కె

నిర్మాతలు : వెంకటేష్ కొత్తూరి
సంగీత దర్శకుడు : కార్తిక్ కొడగండ్ల
ఎడిట‌ర్‌: మ‌హేశ్‌


‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ:

సిద్ధు (దినేష్ తేజ్) ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి ఫెయిల్ అయి.. అన్ని వదిలేసి ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. వెన్నెల ( శ్వేతా అవస్తి) ఎవరి సపోర్ట్ లేకపోయినా ఫ్యాషన్ డిజైనింగ్ పై ఆసక్తితో జీవితంలో ఎదో సాధించాలని కష్టపడుతూ ఉంటుంది. మరి వీరిద్దరూ ఎలా తారసపడ్డారు ? ఎలా స్ట్రగుల్ అయ్యారు ? చివరకు ప్రేమలో కూడా ఎలా సక్సెస్ అందుకున్నారు ? అనేదే మిగిలిన సినిమా.

ప్లస్ పాయింట్స్ :

లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. అలాగే 20 ఏళ్ల వయసున్న యువతీ యువకుల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుందని, ఏం చేయాలనే విషయంలో స్పష్టత ఉండదు అని, అలాంటి అమ్మాయి, అబ్బాయి మధ్య జర్నీని దర్శకుడు పవన్ కుమార్ కె. బాగా ఎలివేట్ చేశాడు.

ఇక ఈ చిత్ర హీరో దినేష్ తేజ్ సినిమాలోని పాత్రకు తగ్గట్లు లుక్స్ పరంగా అలాగే నటన పరంగా కూడా తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్వేతా అవస్తి కూడా తన నటనతో ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.

హీరో ఫాదర్ గా నటించిన నటుడు, మరియు హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించిన నటి కూడా తమ నటనతో మెప్పిస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

మైనస్ పాయింట్స్:

సక్సెస్ అండ్ ఫెయిల్ అలాగే కన్ ఫ్యూజన్ కి సంబంధించి మంచి కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు పవన్ కుమార్ కె. ఆ కాన్సెప్ట్ కు తగ్గట్టు సీన్స్ ను రాసుకోలేకపోయారు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య లాజిక్ లేని సీన్స్, పైగా ఆ సీన్స్ కు సరైన మోటివ్స్ లేకపోవడం.. స్లో నరేషన్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

ప్రధానంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. వీటికి తోడు హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా అనవసరమైన ఎమోషన్ కి లోబడి.. మరి నాటకీయకంగా సాగుతాయి. ఇద్దరూ ప్రేమ కోసం, తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఒకరి కోసం ఒకరు ఎలా తగ్గారు ? అనే కోణంలో సాగి ఉంటే సినిమాకి ఇంకా బాగ్ ప్లస్ అయి ఉండేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు పవన్ కుమార్ కె. మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నా.. దాన్ని తెర మీద చూపెట్టడంలో మాత్రం కొన్నిచోట్ల తడబడ్డారు. గేశ్ బానెల్ కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్, కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. ఇక సంగీత దర్శకుడు అందించిన సంగీతం పర్వాలేదు. అయితే ఎడిటర్ ఇంకా బాగా వర్క్ చేయాల్సింది. నిర్మాత వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రం పై బాగానే ఖర్చు పెట్టారు, ఆయన నిర్మాణ విలువులు బాగున్నాయి.

తీర్పు :

లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ గా వచ్చిన ఈ సినిమాలో కొన్ని ఫీల్ గుడ్ సీన్స్, అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే, కాన్సెప్ట్ బాగున్నా, ఆ కాన్సెప్ట్ కు తగ్గట్లు సీన్స్ లేవు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల ట్రాక్ ఇంకా బాగా రాసుకోవాల్సింది సినిమాలోని పాత్రలు.. ఆ పాత్రల తాలూకు ఎమోషన్ అంతా సినిమాటిక్ గా సాగుతోంది. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని అంశాలు బాగున్నాయి. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నా.. మిగిలిన వర్గాల ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తోంది.

123telugu.com Rating :  2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version