సమీక్ష : ముగ్గురు మొనగాళ్లు – అక్కడక్కడా పర్వాలేదనిపించే క్రైమ్ డ్రామా !

Mugguru Monagallu movie review

విడుదల తేదీ : ఆగస్టు 06, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

నటీనటులు : శ్రీనివాసరెడ్డి, దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు, రిత్విష్‌శర్మ, శ్వేతా వర్మ, నాజర్, రాజా రవీంద్ర

దర్శకుడు: అభిలాష్‌ రెడ్డి

నిర్మాతలు : పి. అచ్యుత్‌రామారావు
సంగీత దర్శకుడు : సురేష్‌ బొబ్బిలి
ఎడిటర్‌: బి. నాగేశ్వర రెడ్డి


‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న శ్రీనివాస్‌ రెడ్డి ఇప్పుడు తాజాగా ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు ఈ ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాని నిర్మించారు. ఇక ఈ చిత్రంలో శ్రీనివాస్‌ రెడ్డి మెయిన్ లీడ్‌ రోల్‌ చేస్తుండగా,దీక్షిత్‌ శెట్టి (కన్నడ హిట్‌ మూవీ ‘దియా’ ఫేమ్‌), వెన్నెల రామారావు ప్రధాన పాత్రధారులుగా కనిపించారు.మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

సుశాంత్ (శ్రీనివాస్ రెడ్డి)కి వినపడదు, కిషోర్ (దీక్షిత్‌ శెట్టి) మాట్లాడలేడు, దీపక్ ( వెన్నెల రామారావు) కు కనపడదు. అయితే ఈ ముగ్గురికి అనుకోకుండా వరుస హత్యల జరుగుతున్న కేసులో క్లూ దొరుకుతుంది. లీడింగ్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులను ఎవరో అతి దారుణంగా చంపుతూ ఉంటారు. ఇంతకు వారిని చంపుతుంది ఎవరు ? ఈ హత్యల వెనుక ఎవరి హస్తం ఉంది ? సుశాంత్ కి, కిషోర్ కి, దీపక్ కి ఈ హత్యల గురించి అసలు ఎలా తెలుసు ? ఈ మధ్యలో సుశాంత్ ప్రేమ కథ ఎలా సాగింది ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీనివాస్ రెడ్డి.. అలాగే ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నటించిన దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు ఎలాంటి గ్యాప్ లేకుండా తమ కామెడీ టైమింగ్ తో విషయం లేని సీన్స్ లో కూడా నవించడానికి చాలా ప్రయత్నాలే చేశారు. కొన్ని చోట్ల బాగానే నవ్వించారు కూడా. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి సీక్వెన్స్ మరియు దీక్షిత్ శెట్టి లవ్ సీన్స్ లో కొన్ని బాగున్నాయి. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన రాజా రవేంద్ర కూడా బాగా ఆకట్టుకున్నాడు.

ఇటు కథలో కామెడీతో కూడుకున్న సీరియస్ నెస్ కూడా తీసుకొచ్చారు. అలాగే వరుస హత్యల వెనుక డ్రామా కూడా బాగుంది. ఇక హీరోయిన్ నటించిన నటి కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించాం అనిపించున్నారు. ఇక దర్శకుడు సినిమాలో సస్పెన్స్ ను మెయింటైన్ చేసినా.. ఎక్కువుగా వీలైనంత వరకు నవ్వించాడనికే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్:

యాక్టర్ గా అద్భుతమైన కామెడీ టైమింగ్ తో నవ్వించే శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాలో కూడా కొన్నిచోట్ల బాగానే నవ్వించినా.. స్క్రిప్ట్ లో విషయం లేకపోవడం సినిమా ఫలితం దెబ్బతింది. అసలు సినిమాలో చెప్పుకోవడానికి అనేక ట్రాక్ లు ఉన్నాయి గానీ, మెయిన్ గా ఏ సీక్వెన్స్ ఇంట్రస్ట్ గా సాగలేదు. అసలు హత్యలు ఎందుకు జరుగుతన్నాయి ? వాటి వెనుక ఆసక్తి ని రెట్టింపు చేయాల్సింది పోయి.. కన్ ఫ్యూజ్ చేశారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం మ్యాటర్ లేని సీన్లతో వర్కౌట్ కాని కామెడీతో సాగితే , సెకెండ్ హాఫ్ సాగతీత సన్నివేశాలతో సాగుతుంది. సినిమా మొదలైన పది నిముషాలకే ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో అర్ధం అయిపోతుంది. సినిమాలో అనవసరమైన సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేశారు. అవసరానికి మించిన పండని హాస్య సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు మంచి ఐడియా తీసుకున్నా.. సరైన స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. అయితే కొన్ని సీన్స్ ను ఆయన స్క్రీన్ మీద బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది. అయితే సినిమాలో చాల చోట్ల సినిమాటోగ్రఫీ మైనస్ గానే నిలుస్తోంది. ఎడిటర్ గురించి ఆయన చేసిన ఎడిటింగ్ గురించి చెప్పుకోవటానికి ఏమిలేదు. సంగీతం జస్ట్ సో సో గా అనిపిస్తోంది. అయితే ఈ చిత్ర నిర్మాత కథకు తగ్గట్లుగానే ఖర్చు పెట్టారు.

తీర్పు :

అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ అంటూ వచ్చిన ఈ ‘ముగ్గురు మొనగాళ్లు’ కొన్ని కామెడీ సన్నివేశాలతో చిన్నపాటి సస్పెన్స్ తో కొన్నిచోట్ల బాగా ఆకట్టుకున్నారు. ఇక శ్రీనివాస్ రెడ్డి కామెడీ టైమింగ్ సినిమాకే హైలెట్ గా నిలిచినప్పటికీ.. ఇవేవీ సినిమాని ఫుల్ హిట్ స్థాయిలో నిలబెట్టలేకపోయాయి. కథాకథనాల్లో ఇంకా ఆకట్టుకునే బెటర్ కంటెంట్ ఉండి ఉంటే.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేది. కానీ, ప్లేలో కొన్ని లోపాలు సినిమాకి పెద్ద డ్రా బ్యాక్ అయ్యాయి. అయితే, కామెడీ క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా నిరుత్సాహ పరుస్తోంది.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version