ఓటీటీ సమీక్ష: ‘బ్లాక్ విడో’ – హాలీవుడ్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో

నటీనటులు :  స్కార్లెట్ జాన్‌సన్, ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్

దర్శకుడు :  కేట్ షార్ట్ ల్యాండ్

నిర్మాత : కెవిన్ ఫీజ్

సంగీత దర్శకుడు : లోర్నె బల్ఫీ

సినిమాటోగ్రఫీ:  గాబ్రియేల్ బెరిస్టెయిన్

ఎడిటర్ :  లీ ఫోల్సమ్ బాయిడ్, మాథ్యూ ష్మిత

మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించిన ‘బ్లాక్ విడో’ సెప్టెంబర్ 3న డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రదర్శించబడింది. మరియు ఇది ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. మరీ ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ:

బ్లాక్ విడో ఒక ఘోరమైన కుట్రలో చిక్కుకుంటుంది. ఆమెను ఎలాగైనా అంతమొందించాలనుకుని ప్రత్యర్ధులు అనుకుంటారు. ఈ క్రమంలో ఆమె ప్రత్యర్ధులపై ఒంటరి పోరాటం కొనసాగిస్తుంది. మరీ ఆ పోరాటంలో బ్లాక్ విడో గెలిచి నిలుస్తుందా? అనేది పూర్తి కథాంశం.

 

ప్లస్ పాయింట్స్:

స్కార్లెట్ జాన్సన్ ఈ సినిమాను భుజానకెత్తుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమాలో ఆమె అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంలో అవెంజర్స్ ఎండ్‌గేమ్‌లో ఆమె మరణానికి ముందు బ్లాక్ విడో యొక్క ప్రయాణాన్ని ఇందులో చూపించారు. కాబట్టి దానికి అనుబంధంగా మంచి భావోద్వేగ కోణాన్ని కలిగి ఉంది. ఇక ఫైట్ సీక్వెన్స్‌లు మరియు వీఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా చాలా నాణ్యతగా ఉన్నాయి.

 

మైనస్ పాయింట్స్:

బ్లాక్ విడోకు అసంబద్ధమైన స్క్రీన్ ప్లే అతి పెద్ద డ్రా బ్యాక్ అని చెప్పాలి. యాక్షన్ బ్లాక్స్ కోసం చాలా సన్నివేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. విజువల్‌గా ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్‌లను కలిగి ఉన్నప్పటికీ వాటన్నిటిని కలిపే ఎమోషనల్ కనెక్ట్ మాత్రం ఇందులో లేదు.

బ్లాక్ విడో పాత్రతో ముడిపడి ఉన్న భావోద్వేగాన్ని, ఆమె గతంపై ఆధారపడిన చలనచిత్రాన్ని వీక్షకులు కోరుకుంటారు. కానీ అది ఎక్కడా కనిపించదు. ఈ సినిమా కథాంశం చాలా నిస్సారంగా ఉంది. అంతేకాదు వీక్షకుడు ఊహించినంతగా అయితే లేదు.

 

సాంకేతిక విభాగం:

కేట్ షార్ట్ ల్యాండ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బ్లాక్ విడో యొక్క సూపర్ హీరో స్టేటస్‌కు ఆమె న్యాయం చేయగలిగినప్పటికీ, ఎక్కువ ఫైట్ సీక్వెన్స్‌లపై ఫోకస్ చేయడంతో ఆమె ఎమోషనల్ కనెక్ట్‌ని మిస్ అయ్యింది. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ అద్భుతంగా ఉన్నాయి.

 

తీర్పు:

మొత్తంగా చూసుకున్నట్టయితే “బ్లాక్ విడో”లో స్కార్లెట్ జాన్సన్ యొక్క నటన మరియు కొన్ని పాజిటివ్స్ తప్పా మిగదంతా ఫేలవంగా ఉందనే చెప్పాలి. ఎంతగానో ఇష్టపడే బ్లాక్ విడో పాత్రకు కూడా పూర్తి న్యాయం చేయలేదు. ఏదేమైనా మీకు కాస్త సమయం ఉంటే కనుక ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version