సమీక్ష : లాభం – బోర్ గా సాగే విలేజ్ డ్రామా

Laabam Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 09, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్, జగపతిబాబు, సాయి ధన్సిక, కలైయ రసన్ త‌దిత‌రులు
దర్శకుడు: S.P. జననాథన్
నిర్మాత‌లు: విజయ్ సేతుపతి, పి అరుముగకుమార్
సంగీత దర్శకుడు: D. ఇమ్మాన్
సినిమాటోగ్రఫీ: రాంజీ
ఎడిటర్: N. గణేష్ కుమార్


విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి క్రమంగా మన తెలుగు మార్కెట్ లో కూడా మంచి క్రేజ్ పెంచుకుంటూ వస్తున్నాడు. మరి అలా ఇది వరకు తన నుంచి పలు సినిమాలను రిలీజ్ చేసి ఇప్పుడు మరో సినిమాతో పలకరించేందుకు వచ్చాడు. అదే సినిమా “లాభం”. శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వచ్చినట్టయితే.. చాలా కాలం తర్వాత బద్రి(విజయ్ సేతుపతి) తన స్వస్థలానికి వస్తాడు. అయితే ఆ ఊరిలో వ్యవసాయం అనేది బాగా నడుస్తుంది. మరి ఆ ఊరికి ఎన్నిక కాబడిన ప్రెసిడెంట్ గా జగపతి బాబు గెలుస్తాడు. మరి ఈ ఊరి వ్యవసాయానికి జగపతిబాబు కొత్త మెళుకువలతో ఏదో చెయ్యాలని ప్లాన్ చేస్తాడు. మరి తాను వేసిన ప్లాన్ ఏంటి? బద్రి తన ఊరి కోసం ఏం చేస్తాడు ఎలా చేస్తాడు అన్నవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మామూలుగా సేతుపతి సినిమాలు అంటే తనదైన ఈజ్ నటనని అంతా ఆశిస్తారు. అలాగే ఈ సినిమాలో కూడా తన రోల్ పరిధి మేరకు ఎంత వరకు ఇవ్వగలడో అంత మొత్తం కూడా సేతుపతి కంప్లీట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో చూపించిన బేసిక్ థీమ్ వ్యవసాయం పై పలు అంశాలు మరియు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

అలాగే శృతి హాసన్ కూడా తన రోల్ మేరకు మెప్పిస్తుంది. ఇంకా మెయిన్ విలన్ జగపతి బాబు కూడా ఎప్పటి లానే తనలోని సాలిడ్ విలనిజాన్ని చూపించారు.. వీటితో పాటుగా సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఒక్క సేతుపతి సినిమా అని కాకుండా ఈ చిత్రంలో పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ కనిపించవు, అంతా పరమ రొటీన్ గానే అనిపిస్తుంది.. ముఖ్యంగా ఈ సినిమా లైన్ ని అనుసరించి సరైన ఎమోషన్స్ కూడా కనిపించకపోవడం మరో మేజర్ మైనస్ లా అనిపిస్తుంది.

అలాగే సేతుపతి రోల్ కూడా అంత స్ట్రాంగ్ గా ఎలివేట్ అయ్యినట్టు అనిపించదు. ఇంకా ఈ సినిమాలో అనవసరంగా పెట్టిన సన్నివేశాలు బోరింగ్ గా సాగుతాయి వాటన్నిటినీ తీసేస్తే బాగుండు. వీటితో పాటుగా హీరో పాత్రకి విలన్ పాత్రకి మధ్యలో మెయిన్ పాయింట్ కూడా ఇంప్రెసివ్ గా ఉండదు.

మరి ఈ సినిమాలో తీసుకున్న పాయింట్ ని ఇంకా మంచి అంశాలు జోడించి తెరకెక్కించి ఉంటే చూసే ఆడియెన్ కి ఇంపుగా అనిపించి ఉండేది.

సాంకేతిక వర్గం :

ఈ సినిమాలో పలు సన్నివేశాల్లో కనిపించే నిర్మాణ విలువలు బాగుంటాయి అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు అని చెప్పొచ్చు. కానీ ఎడిటింగ్ గాని ఇమాన్ ఇచ్చిన మ్యూజిక్ వర్క్ కానీ ఎక్కడా ఆకట్టుకోవు.

సినిమాని చాలా మేర కట్ చేసి మంచి స్క్రీన్ ప్లే తో జోడించి ఉండాల్సింది. ఇక దర్శకుడు ఎస్పీ జననాథన్ విషయానికి వస్తే తాను ఎంచుకున్న పాయింట్ బానే అనిపిస్తుంది కానీ దానిని ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది.. ఓవరాల్ గా తన వర్క్ బిలో యావరేజ్ అని చెప్పాలి.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘లాభం’ చిత్రం లో ఒక్క సేతుపతిని ఇతర నటుల పెర్ఫామెన్స్ లు పక్కన పెడితే చూసే ఆడియెన్స్ కి పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేసే విధమైన అంశాలు కనిపించవు. సరైన కథనం కానీ ఎమోషన్స్ కానీ కనిపించవు. పైగా బోర్ గా అనిపించే స్క్రీన్ ప్లే, రొటీన్ కథనాలు మరింత నిరాశపరుస్తాయి. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సినిమా చూస్తే మంచిది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

Exit mobile version