తిరుమలలో రోజా, సమంత, పురాణపండ శ్రీనివాస్

తిరుపతి : సెప్టెంబర్ : 23

వేయి నామాలవాడైన , వేయి రూపాలవాడైన వేంకటేశ్వరుని విరాట్ స్వరూపాన్ని తిరుమల మూల విరాట్టుగా దర్శనం చేసుకోవడమే భాగ్యంగా భావించి ఎందరో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు , న్యాయ రంగ ప్రముఖులు అను నిత్యం శ్రీవారిని దర్శించుకుంటూ వుంటారు.

ఇందులో భాగంగా ఈ ఉదయం ప్రముఖ సినీనటి , నగరి ఎమ్మెల్యే ఆర్.కె రోజా , ప్రముఖ కథానాయిక సమంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ ఆరాధన ‘ పూర్వప్రత్యేక సంపాదకులైన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వేర్వేరు సమయాలలో తిరుమల ఆనందం నిలయం లో శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు.

దర్శనానంతరం బయటకు వచ్చిన రోజా మీడియా వారితో ఆసక్తికరమైన రాజకీయ అంశాలు వివరించగా, సమంత మాత్రం ఈ భక్తి సమయంలో మమ్మల్ని ప్రశ్నించడానికి మీడియాకు బుద్ధి వుండాలంటూ అసహనం వ్యక్తం చేశారు. అంతకు ముందే వెలుపలికి వఛ్చిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ను చుట్టుముట్టిన మీడియా వారితో …ఇప్పుడు ప్రశ్నలు అడగడటానికి సందర్భం కాదన్నట్లుగా తన చేత్తో సైగలు చేసి మీడియాను ప్రక్కకు పంపారు. చాలా కాలంగా పురాణపండ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడరని సమాచారం. ఎంతటి మీడియా ప్రతినిధినైనా పలకరిస్తారు గానీ ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటారని తిరుమల అర్చకుడొకరు మీడియా వారితో వ్యాఖ్యానించడం కనిపించింది.

అయితే .. తిరుమలలో , కాణిపాకం లో, శ్రీకాళహస్తిలో పురాణపండ శ్రీనివాస్ అద్భుతమైన రచనా సంకలనాలనే ఎక్కువగా వేదపండితులు,అర్చకులు , వేదపండితులు, వేదపాఠశాలల అధ్యాపక విద్యార్థి బృందాలు చదవడం మనకు తరచుగా కనిపిస్తూనే ఉంటుంది. టి.టి.డి. గత చైర్మన్ లు అయినా భూమన కరుణాకర్ రెడ్డి, ఆదికేశవులు నాయుడు, టి.సుబ్బరామి రెడ్డి, చదలవాడ కృష్ణ మూర్తి సైతం పురాణపండ శ్రీనివాస్ వండర్ఫుల్ బుక్స్ కి సమర్పకులుగా వ్యవహరించడం ఒక విశేషమేగా మరి. ఈ సందర్భంలో ఈ ఉదయం టి.టి.డి.చైర్మన్ ఎస్వీ .సుబ్బారెడ్డి తో పురాణపండ శ్రీనివాస్ సమావేశం కావడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించున్నట్లు సమాచారం.

Puranapanda-Srinivas-with-YV-Subba-Reddy-TTD-chairman

Exit mobile version