ఓటీటీ రివ్యూ : ‘అలాంటి సిత్రాలు’ – తెలుగు చిత్రం జీ5లో ప్రసారం

Love Story Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 24, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: శ్వేతా పరాశర్ , యాష్ పురి, అజయ్ కతుర్వార్, ప్రవీణ్ యండమూరి తదితరులు.

దర్శకుడు: సుప్రీత్ సి. కృష్ణ

నిర్మాతలు: రాహుల్ రెడ్డి

సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ శివకుమార్‌

సంగీత దర్శకుడు: సంతు కుమార్‌

ఎడిటర్: అశ్వథ్‌ శివకుమార్‌


సుప్రీత్ సి. కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘అలాంటి సిత్రాలు’. ఈ సినిమాని కె . రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రాహుల్ రెడ్డి నిర్మించారు. కాగా ఈ సినిమా ఈ నెల 24న జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చూద్దాం.

కథ :

పల్లవి (శ్వేతా పరాశర్) ఒక వేశ్య. ఆమెను చూసి ఇష్ట పడుతూ ఆమె వెంటే పడుతూ ఉంటాడు రాగ్ (యాష్ పురి). మరోవైపు దిలీప్ (ప్రవీణ్ యండమూరి) పబ్లిక్ బ్రోకర్ గా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ పల్లవితో సన్నిహితంగా ఉంటాడు. అలాగే మరో ట్రాక్ లో యష్ (అజయ్ కతుర్వార్) ఒక బాక్సర్. ఎన్నోసార్లు ఓడిపోయి.. గెలవడం కోసం కోచ్ సహాయంతో తనను తాను మార్చుకుంటూ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో తాన్వి ఆకాంక్ష (యామినీ)ను ప్రేమిస్తాడు.. ఆ ప్రేమ కారణంగా యష్ ఎలాంటి అవమానులు సమస్యలు ఎదుర్కొన్నాడు ? చివరకు బాక్సర్ గా ఎలా గెలిచాడు ? అసలు యష్ కి రాగ్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? అలాగే దిలీప్ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుని ఎలా ముగిసింది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమా పేరులోనే ‘సిత్రాలు’ ఉన్నట్లు.. ఈ సినిమాలో కూడా చాలా పాత్రలు, ఆ పాత్రల తాలూకు సిత్రాలు ఉన్నాయి. పల్లవి అనే వేశ్య పాత్రలోని నిస్సహాయత, ఆశ.. రాగ్ పాత్రలోని వెలితి, దిలీప్ పాత్రలోని బతుకు పోరాటం, యష్ పాత్రలోని గెలుపు కోసం పడే ఆరాటం ఈ సినిమాలో ప్రధానంగా నిలిచిన ఎమోషన్స్.

నటీనటులు విషయానికి వస్తే..ప్రవీణ్ యండమూరి తన పాత్రకు తగ్గట్లు..చాలా బాగా నటించాడు. అలాగే తనకు వచ్చే కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో వచ్చే సీన్స్ లో లోలోపలే నలిగిపోతున్న ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ బాగా అభినయించాడు. ఇక యాష్ పురి, అజయ్ కతుర్వార్ కూడా తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.

మరో కీలక పాత్రలో నటించిన రవి వర్మ కూడా ఆకట్టుకున్నాడు. అలాగే శ్వేతా పరాశర్ కూడా అందంతో పాటు అభినయంతోనూ మెప్పించింది. బోల్డ్ గా కనిపిస్తూ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇక సినిమాలో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఇంట్రస్టింగ్ గానే మొదలైనా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా దర్శకుడు స్క్రీన్ ప్లేని రాసుకోలేకపోయారు. అన్ని పాత్రలు ఎమోషన్ తో నడుస్తోన్నా.. సినిమాలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. పైగా అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. ఇక పల్లవి మరియు ఆమె చుట్టూ తిరిగే రాగ్ క్యారెక్టర్స్ మధ్య వచ్చే ట్రాక్ కూడా పేలవంగా ఉంది.

అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే డ్రామాను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అదేవిధంగా మెయిన్ పాయింట్ లో ఉన్న కాన్ ఫ్లిక్ట్ ను బలంగా ఎలివేట్ చేయలేదు. మొత్తానికి దర్శకుడు రాసుకున్న కొన్ని కీలక సన్నివేశాలు పర్వాలేదనిపించినప్పటికీ.. సినిమా బలహీనమైన సంఘటనలకు లోబడి బలహీనంగా సాగుతుంది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగానే ఆకట్టుకుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని కాస్త స్లో గా సాగే సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

విభిన్న జీవితాలను గడిపే నలుగురు భిన్న వ్యక్తులు అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు తారసపడినప్పుడు వారి జీవిత గమనంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల ఆధారంగా వచ్చిన ఈ ‘అలాంటి సిత్రాలు’ కొన్ని ఎమోషనల్ అంశాలతో కొన్ని చోట్ల ఆకట్టుకుంటుంది. అయితే, రెగ్యులర్ ట్రీట్మెంట్, కొన్ని చోట్ల బోరింగ్ ప్లే అండ్ బలమైన సంఘర్షణ లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఎమోషనల్ మూవీస్ ఇష్టపడే వారికి కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version