ఓటిటి సమీక్ష : “బ్రో” – తెలుగు చిత్రం సోనీ లివ్ లో

BRO Movie Review In Telugu

విడుదల తేదీ : నవంబర్ 26, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: నవీన్ చంద్ర, అవికా గోర్, సాయి రోనక్, సంజన సారథి

దర్శకత్వం : కార్తీక్ తూపురాని

నిర్మాతలు: జేజేఆర్ రవిచంద్

సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: అజీమ్ మహ్మద్

ఎడిటింగ్: విప్లవ్ నిషాదం

ఇప్పుడు థియేట్రికల్ తో పాటు కొన్ని సినిమాలు కూడా ఓటిటి నేరుగా రిలీజ్ అవుతున్నాయి. అలా నటుడు నవీన్ చంద్ర మరియు అవికా గోర్ లు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా “బ్రో” స్ట్రీమింగ్ యాప్ సోని లివ్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం ఎంత మేర వీక్షకులను ఆకట్టుకునేలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

కథలోకి వస్తే.. తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితులు రీత్యా అలాగే మాధవ్(నవీన్ చంద్ర) తన చెల్లెలు ఆరోగ్యం నిమిత్తం డబ్బు అవసరం ఉండి మాధవ్ ని తన తల్లిదండ్రులే సౌదీ కి పంపించేస్తారు. కానీ అనుకోకుండా సుబ్బు లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది. మరి ఈ తర్వాత నుంచి మాధవ్ తీసుకునే స్టెప్ ఏమిటి? తన చెల్లెలు చనిపోవడానికి కారణం ఆరోగ్యం బాగోకపోవడమేనా? కథ ఎలా ముగుస్తుంది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని సోనీ లివ్ లో వీక్షించాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో ప్రధాన బలం మెయిన్ గా కనిపించే నవీన్ చంద్ర మరియు అవికా గోర్ లు అనే చెప్పాలి. వీరిద్దరి పెర్ఫామెన్స్ లే సినిమాలో హైలైట్ గా కనిపిస్తాయి. ఇద్దరికి ఇద్దరూ కూడా ఎక్కడా తగ్గకుండా చాలా సహజమైన నటనను కనబరిచారు.

సంపాదనలో నవీన్, ఆరోగ్యం బాగాలేక అవికా వాళ్ళు పడే బాధలు చాలా నాచురల్ గా మంచి ఫీల్ ని అందిస్తాయి. అలాగే సినిమాలో విజువల్స్ ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. నాచురల్ లొకేషన్స్ లో చూపించే విజువల్స్ సినిమాని ఎక్కడా అసహజంగా చూపించినట్టు అనిపించవు. ఇది సినిమాలో ఇంప్రెస్ చేసే మరో కీలక పాయింట్.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రం మళయాళం కి చెందిన ‘కూడె’ అనే సినిమాకి రీమేక్ గా తీసింది. అయితే ఒకవేళ ఆ సినిమా కూడా చూసిన వారికి అయితే ఇది అంతగా ఆకట్టుకోకపోవచ్చు. సినిమాలో మంచి నేపథ్యం కనిపిస్తుంది కానీ ఓవరాల్ గా కథనం అంతా చాలా స్లో గా కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది.

అలాగే ఇద్దరి మెయిన్ లీడ్ మధ్య రిలేషన్ ఓ పరిధి మించి కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ముందు చెప్పినట్టుగా కథనం నెమ్మదిగా సాగడం వల్ల స్క్రీన్ ప్లే అంత ఆసక్తిగా ఉన్నట్టు అనిపించదు. ఇంకో మాట ఏమిటంటే అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది అని చెప్పడం కూడా ఒకింత కష్టమే..

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా అనిపిస్తాయి. అలాగే ముందు చెప్పినట్టుగా టెక్నీనల్ టీం వర్క్ లో సినిమాటోగ్రఫీ కి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకా ఎంగేజింగ్ గా ఉంటే బాగుండు.

ఇక దర్శకుడు కార్తీక్ తూపురాని విషయానికి వస్తే తాను ఎంచుకున్న సబ్జెక్టు కానీ నటీనటుల నుంచి రాబట్టిన ఎమోషన్స్ కానీ చాలా బాగున్నాయి. కానీ కథనంలో ఇంకా జాగ్రత్త వహించి ఉండాల్సింది. స్క్రీన్ ప్లే ని చాలా నెమ్మదిగా తీసాడు. ఈ విషయాల్లో జాగ్రత్త వహించాల్సింది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “బ్రో” లో కనిపించే నేపథ్యం ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది. దీనికి మించి నవీన్ చంద్ర, అవికా గోర్ లు తమ నటనతో ఇంప్రెస్ చేస్తారు. కానీ చాలా మేర సినిమా నెమ్మదిగానే ఉండడం అంత ఆసక్తిగా అనిపించని కథనం కనిపించకపోవడం వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. జస్ట్ కొన్ని ఎమోషన్స్ వరకూ పర్వాలేదు ఓపిక పట్టి సినిమా చూస్తాం అనుకునేవారు మాత్రమే ఈ సినిమా చూడవచ్చు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version