సమీక్ష : “లక్ష్య” – పర్వాలేదనిపించే స్పోర్ట్స్ డ్రామా

Lakshya Movie Review In Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 10, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: నాగ శౌర్య, కేతిక శర్మ, జగపతి బాబు, సచిన్ ఖేద్కర్ తదితరులు

దర్శకత్వం : ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి

నిర్మాతలు: నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్

సంగీత దర్శకుడు: కాళ భైరవ

సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి

ఎడిటింగ్: జునైద్

 

ఈ వారం థియేటర్స్ లోకి డీసెంట్ బజ్ నడుమ విడుదల కాబడిన లేటెస్ట్ చిత్రం “లక్ష్య”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య ఎంతో డెడికేటివ్ గా చేసిన ఈ సినిమాని సంతోష్ తెరకెక్కించారు. మరి ఈ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. హీరో పార్ధు(నాగ శౌర్య) తన చిన్నప్పటి నుంచే వీలు విద్య(ఆర్చరీ)లో ఎంతో ప్రతిభతో కూడి ఉంటాడు. దీనితో తనలోని ఆసక్తిని టాలెంట్ ని చూసి తన తాతయ్య (సచిన్ ఖేద్కర్ ) పార్ధు ని ఎలా అయినా ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని బెస్ట్ అకాడమీ లో జాయిన్ చేస్తాడు. అక్కడ నుంచి పార్ధు రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ప్లేయర్ గా ఎదుగుతూ జాతీయ స్థాయికి ఎదుగుతున్నాడు అనుకుంటుండగా తన తాతయ్య మరణిస్తాడు. మరి ఊహించని విధంగా జరిగిన తన తాతయ్య మరణం పార్థు జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? అతడు ఆర్చరీలో ఉన్నత శిఖరాలు అందుకుంటాడా లేదా? హీరోయిన్ కేతిక పాత్ర ఎంత వరకు ఉపయోగపడింది లాంటివి తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రానికి మొట్టమొదటి బిగ్ ప్లస్ ఎవరైనా ఉన్నారు అంటే అది నాగ శౌర్య అని చెప్పాలి. ఈ సినిమా కోసం తన కెరీర్ లో ఏ సినిమాకి పెట్టని ఎఫర్ట్స్ తాను పెట్టి ఆకట్టుకుంటాడు. ఒక్క తన దేహాన్ని మార్చుకొని డిఫరెంట్ లుక్స్ ని చూపించడమే కాకుండా చాలా మంచి నటనను కూడా తాను కనబరిచాడు.

అలాగే కొన్ని కీలకమైన ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన మెచ్యూర్ గా ఉంది. ఇక హీరోయిన్ కేతిక శర్మ రోల్ కూడా సినిమాలో బాగుంది. తన లుక్స్ పరంగా కానీ శౌర్య తో సీన్స్ లో కానీ మంచి కెమిస్ట్రీ ఇద్దరి మధ్య కనిపిస్తుంది. అలాగే ఇద్దరి మధ్య కొన్ని కీ సీన్స్ లో కూడా తన ఎమోషన్స్ బాగున్నాయి.

ఇక వీరితో పాటు నెగిటివ్ పాత్రలో కనిపించిన కిరీటి తన పాత్రకి కరెక్ట్ గా సెట్టయ్యారు. మంచి విలనిజం కనబరుస్తూ ఆ పాత్రకి తగ్గ ఎమోషన్స్ ని తాను పలికించి ఆకట్టుకున్నారు. అలాగే సినిమాలో నాగ శౌర్య ఎలా ఇతర అలవాట్లకు మారిపోతాడు? కీలకమైన బ్రేక్ పాయింట్ ఇంప్రెసివ్ గా డీల్ చేసారు.
ఇంకా సినిమాలో కనిపించే ఆర్చరీ నేపథ్యం కొత్తగా అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమాలో ఒక పాయింట్ కి వెళ్లే వరకు నేపథ్యం అంతా కూడా బాగానే అనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత ఆ గేమ్ పై చూపించే సన్నివేశాలు, సెటప్ అంతా కూడా ఒకింత సిల్లీ గా మారిపోయినట్టు అనిపిస్తుంది.

అలాగే సినిమాలో ఎమోషన్స్ ని ఇంకా ఎలివేట్ చేసే స్కోప్ ఉన్నా అవి అంత బలంగా ఉన్నట్టు అనిపించవు చాలా సన్నివేశాలు కాస్త డల్ గా ఏదో అలా సాగుతున్నట్టు అనిపిస్తాయి.

ఇంకా సెకండాఫ్ అంతా కూడా అలానే చాలా సోసో గా ఆకట్టుకోని నరేషన్ తో మారిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే ఇంకో మేజర్ మిస్ ఈ చిత్రంలో జగపతి బాబు లాంటి నటుని పాత్ర సిల్లీ గా డిజైన్ చెయ్యడం.

ఆ పాత్ర ఏమంత ఇంపాక్ట్ కలిగించేలా అనిపించదు. తనకి నాగ శౌర్య కి సన్నివేశాలు ఇంకా ఎంగేజింగ్ గా తీసే అవకాశం ఉన్నా దర్శకుడు ఎందుకో ఆ స్కోప్ తీసుకు రాలేకపోయారు. ఇంకా ఫైనల్ గా సినిమాకి ఎంతో కీలకమైన క్లైమాక్స్ కూడా అంత ఎఫెక్టీవ్ గా ఉండదు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో ఈ కథా నేపథ్యానికి తగ్గట్టుగా నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. అది సినిమాటోగ్రఫీ వల్లనో ఏమో కానీ విజువల్స్ మాత్రం కాస్త డల్ గానే కనిపిస్తాయి. అలాగే మ్యూజిక్ వర్క్ బాగుంది. కాల భైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మళ్ళీ ఆకట్టుకుంటాడు. ఎడిటింగ్ పర్వాలేదు ఇంకా కొన్ని సీసం కట్ చెయ్యాల్సింది.

ఇక దర్శకుడు సంతోష్ జాగర్లపూడి విషయానికి వస్తే తన వర్క్ కూడా జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో ఉందని చెప్పాలి. నిజంగా తాను ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తది ఎవరూ టచ్ చేయనిది దీనికి హర్షం వ్యక్తం చేయవచ్చు. అలాగే ఒక టైం కి అలా హ్యాండిల్ చేసిన విధానం కూడా బాగుంది. కానీ తర్వాత తర్వాతకి కథనంలో లోపం కనిపిస్తుంది. పాత్రలను ఆయా ఎమోషన్స్ ని బలంగా ఎలివేట్ చెయ్యడంలో తాను తడబడ్డాడు. ఇంకా స్కోప్ ఉన్న కొన్ని సన్నివేశాలు ఎంగేజింగ్ గా మలచి ఉంటే ఇంకా బెటర్ అవుట్ పుట్ ని తాను రాబట్టి ఉండొచ్చు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ ‘లక్ష్య’ ఫస్ట్ హాఫ్ వరకు డీసెంట్ కథనంతో కనిపిస్తుంది. అలాగే నాగ శౌర్య డెడికేషన్ కూడా చాలా ఇంప్రెస్ చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి పరిస్థితులు తారు మారు లా అనిపిస్తాయి. పేలవమైన ఎమోషన్స్ కథనం లు సినిమా ఫ్లో ని దెబ్బ తీశాయి. ఇంకా ఎంగేజింగ్ నరేషన్ ని క్లైమాక్స్ ని కానీ తీసి ఉంటే ఓవరాల్ గా సినిమా మెప్పించి ఉండేది. అక్కడక్కడా పర్వాలేదు కొత్త స్పోర్ట్స్ డ్రామా చూడాలి అనుకునేవారు అయితే లక్ష్య పై ఒక లుక్కెయ్యొచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version