విడుదల తేదీ : డిసెంబర్ 31, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య, రాకెండు మౌళి, జ్ఞానేశ్వరీ కండ్రేగుల, సత్య ప్రకాష్, జీవన్ కుమార్, తదితరులు.
దర్శకత్వం : పవన్ సాధినేని
నిర్మాత: విష్ణు ప్రసాద్ మరియు సుష్మిత కొణిదెల
సంగీత దర్శకుడు: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: వివేక్ కాలెపు
ఎడిటర్ : గౌతం నెరుసు
ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓటిటి లోకి అడుగు పెడుతూ చేసిన తొలి చిత్రం సేనాపతి. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను, అభిమానులను విశేషం గా ఆకట్టుకోవడం తో సినిమా పై ఆసక్తి నెలకొంది. నేడు ఈ చిత్రం ఆహా వీడియో ద్వారా విడుదల అయ్యింది. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం రండి.
కథ:
కృష్ణ (నరేష్ అగస్త్య) నిజాయితీ గల ఒక పోలీసు అధికారి. ఐపిఎస్ అవ్వాలనేది అతని లక్ష్యం. ఒక రోజున పేరుమోసిన నేరస్తుడు ను పట్టుకునేందుకు నియమించబడ్డాడు. నేరస్తుడు ను పట్టుకొనే సమయం లో దురదృష్టవశాత్తూ అతను తన తుపాకీ ను పోగొట్టుకోవడం జరుగుతుంది. తుపాకీ కోల్పోయినందుకు గానూ, అతని పై అధికారులు కృష్ణను సస్పెండ్ చేసి, తుపాకీ ను కనుకొని ఆదేశించడం జరుగుతుంది. పోయిన తన తుపాకీ కృష్ణుడికి దొరికిందా? కృష్ణ మూర్తి (రాజేంద్ర ప్రసాద్) అనే నడివయసు వ్యక్తి ఈ సమస్యతో ఎలా ముడిపడి ఉంటాడు? అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
దర్శకుడు పవన్ సాదినేని ప్రతి పాత్రను చక్కగా డిజైన్ చేశారు. తన సాలిడ్ నెరేషన్ తో క్యూరియాసిటీని పెంచి ప్రేక్షకులను స్క్రీన్ కు అతుక్కుపోయేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. రాజేంద్ర ప్రసాద్ తన పాత్రలో జీవించడం మాత్రమే కాకుండా, అతని భావోద్వేగాలను మనలో కలిగించాడు అని చెప్పాలి. లుక్ అయినా, బాడీ లాంగ్వేజ్ అయినా దర్శకుడు కొత్త తరహాలో చూపించాడు. యువ నటుడు నరేష్ అగస్త్య సీరియస్ అండ్ సిన్సియర్ పోలీస్ గా బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు.
రచయితగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ సీరియస్ సన్నివేశాల్లో కూడా సులువుగా నటించి ప్రేక్షకులను నవ్వించాడు. నటుడు రాకేందు మౌళి సినిమా డైలాగ్స్ కూడా రాశారు, ఈ సినిమా లో కొత్త గా కనిపించారు. మరియు మంచి నటనను కూడా అందించారు.
జ్ఞానేశ్వరి, సత్య ప్రకాష్, జోష్ రవి తదితరులు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాని ఆకట్టుకునేలా చేయడానికి తమ వంతు కృషి చేశారు. సినిమా సెట్స్, లుక్, ఫీల్డ్ అంతా దర్శకుడు పవన్ సాదినేని అద్భుతంగా డిజైన్ చేశారు.
మైనస్ పాయింట్స్:
మొదటి భాగం రేసీ స్క్రీన్‌ప్లే తో సినిమాను నడిపించిన దర్శకుడు, సినిమా క్లైమాక్స్‌కు చేరుకునే సరికి కాస్త స్లో నేరేషన్ తో సాగదీయడం జరిగింది.
సెకండ్ హాఫ్ లో స్లో నేరేషన్ కారణం గా అంతగా ఆసక్తి గా అనిపించదు. కొన్ని డార్క్ కామెడీ సన్నివేశాలు సినిమాకు హెల్ప్ అయ్యాయి అని చెప్పాలి.
సాంకేతిక విభాగం:
ఈ సినిమా కి సంగీతం ప్లస్ అయ్యింది అని చెప్పాలి. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం ఆకట్టుకుంటుంది. వివేక్ కాలెపు సినిమాటోగ్రఫి అద్బుతం గా ఉంది. తన లెన్స్ ద్వారా రిచ్ విజువల్స్‌ని అద్భుతంగా చూసేలా చేసాడు. రాకేందు మౌళి నటనతో పాటు డైలాగ్స్ కూడా రాశారు. గౌతమ్ నెరుసు ఎడిటింగ్ ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. మరియు మీరు స్క్రీన్ పై రిచ్‌నెస్‌ను చూడవచ్చు.
దర్శకుడు పవన్ సాదినేని విషయానికి వస్తే, అతను ప్రేమకథలే కాకుండా థ్రిల్లర్‌లను కూడా బాగా హ్యాండిల్ చేయగలడని నిరూపించాడు. యువకులు మరియు కొత్త నటీనటులు అయినప్పటికీ అతను చిత్రాన్ని గ్రిప్పింగ్ పద్ధతిలో వివరించాడు. అతను రేసీ మూమెంట్స్‌తో సినిమాను నడిపించిన విధానం ప్రొసీడింగ్స్‌ని చాలా ఆసక్తికరంగా మార్చింది.
తీర్పు:
మొత్తం మీద, సేనాపతి మంచి క్రైమ్ థ్రిల్లర్. రాజేంద్ర ప్రసాద్ మరియు నరేష్ అగస్త్య తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. స్లో సెకండ్ హాఫ్‌ని విస్మరించినట్లయితే, సేనాపతి బాగా నచ్చుతుంది.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team