సమీక్ష : “1945” – నిరాశ పరిచే పీరియాడిక్ డ్రామా

1945 Movie Review In Telugu

విడుదల తేదీ : జనవరి 07, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: రానా దగ్గుబాటి, రెజీనా కసాండ్రా, సత్యరాజ్, నాజర్

దర్శకత్వం : సత్యశివ

నిర్మాత: సి. కళ్యాణ్

సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: సత్య పొన్మార్

ఎడిటర్ : గోపీ కృష్ణ

 

ఈ ఏడాది కరోనా మూడో వేవ్ ఎంటర్ కావడంతో సంక్రాంతి సీజన్ లో భారీ సినిమాలు తప్పుకోవడంతో ఇతర కొన్ని సినిమాలు రేస్ లోకి వచ్చాయి. మరి అలా వచ్చిన వాటిలో రానా దగ్గుబాటి హీరోగా నటించిన చిత్రం “1945” కూడా ఒకటి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎంత మేర ఆడియెన్స్ ని ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వచ్చినట్టయితే సినిమా టైటిల్ లో ఉన్నట్టే 1945వ సంవత్సరంలో బర్మా లో జరుగుతుంది. అయితే ఆ సమయంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కోడానికి ఐ ఎన్ ఏ ని సిద్ధం చేస్తారు. మరి మరోపక్క ఆది(రానా దగ్గుబాటి) తన కుటుంబం మరియు తన వ్యాపారాల కోసం తిరిగి వస్తాడు. ఇదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కోసం పని చేసే తాశీల్దార్ (నాజర్) కూతురు (రెజీనా) ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే స్వతంత్ర యుద్దానికి వేరేగా జీవనం సాగించే ఆది ఎలా భారత సైన్యంలోకి వెళ్లాల్సి వస్తుంది? అత్యంత బలమైన బ్రటిష్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొంటారు చివరికి వారి యుద్ధం ఏమవుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో నేపథ్యం ఒకింత ఆసక్తిగా ఉంటుందని చెప్పాలి. భారతదేశానికి స్వతంత్రం ముందు పరిస్థితులు, ఆ సెటప్ అంతా కూడా చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తుంది. అలాగే సినిమాలో కనిపించే లొకేషన్ లు బాగుంటాయి.

ఇక అలాగే ఈ సినిమాలో రానా పెర్ఫామెన్స్ సాలిడ్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ రానా తన నటనలో ఎంత పరిణితి చెందినవాడో అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా అప్పటి వ్యక్తిలా నడవడిక డైలాగ్ డెలివరీ కీలకంగా యాక్షన్ పార్ట్ లో రానా మంచి నటన కనబరిచాడు.

అలాగే నాజర్ కూడా మంచి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇంకా రెజీనా కూడా ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంటుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో మంచి ఎమోషన్స్ ని ఆమె పలికింది. అలాగే వీరితో పాటుగా సత్య రాజ్ కూడా తనకున్న స్క్రీన్ స్పేస్ కి తగ్గట్టుగా కనిపించి మెప్పించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమా మొత్తం చూసాక ఆడియెన్ కి మాత్రం ఒక కంప్లీట్ ఒక సంపూర్ణ అనుభూతి అయితే కలుగక పోవచ్చు. ఎక్కడో సినిమాలో సోల్ పక్కదారి పట్టినట్టుగా ఏదో మిస్సయినట్టుగా అనిపిస్తుంది. అలాగే చాలా సన్నివేశాలు ఎక్కడా పొంతన లేకుండా ఇరికించినట్టే అనిపిస్తుంది. ఇందులో మాత్రం దర్శకుని వైఫల్యాలే కనిపిస్తాయి.

అలాగే ఇంకో మేజర్ మైనస్ అసలు రానా గొంతే ఇందులో వినిపించదు అంత పూర్ నిర్మాణ విలువలు తో ఆడియెన్స్ కి ఈ సినిమా అందించారు. అలాగే సినిమాపై పెద్దగా ఆసక్తిగా అనిపించే అంశాలు కూడా పెద్దగా కనిపించవు.

అలాగే సినిమాపై ఆసక్తి తగ్గించే అంశాలు ఇంకా చాలా కనిపిస్తాయి, ఈ చిత్రంలో చాలా సన్నివేశాల్లో రానా పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టే కనిపిస్తాడు. అలాగే సినిమాలో మెయిన్ కాంఫ్లిక్ట్ పాయింట్ కూడా అంత ఎలివేట్ అయ్యినట్టు కనిపించదు. అలాగే అర్థరహితంగా అర్ధాంతరంగా ముగిసే క్లైమాక్స్ మరో పెద్ద మైనస్ అని చెప్పాలి.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కొంతవరకు బాగున్నాయి కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో మాత్రం లోపాలు కనిపిస్తాయి. టెక్నీకల్ టీం లో సినిమాటోగ్రఫీ వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. మంచి లొకేషన్స్ లో విజువల్స్ అప్పటి నేపథ్యానికి తగ్గట్టుగా బాగుంది. మ్యూజిక్ పర్వాలేదు. డైలాగ్స్ బాగున్నాయి కానీ రానా డబ్ చేసి ఉంటే బాగుండు. ఎడిటింగ్ బాగాలేదు. ఇక దర్శకుడు సత్య శివ విషయానికి వస్తే పెద్దగా చెప్పక్కర్లేదు. తన పాయింట్ బాగుంది కానీ కథనంలో చాలా లోపం కనిపిస్తుంది. చాలా సిల్లీ గా అర్థరహితంగా సినిమాని ముగించి తాను విఫలం అయ్యాడు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “1945” సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోడాని చెప్పాలి. నటీనటుల పెర్ఫామెన్స్ లు వరకు మాత్రం ఇంప్రెస్ చేస్తాయి అలాగే సినిమా సెటప్ లొకేషన్స్, విజువల్స్ బాగుంటాయి కానీ సినిమా మాత్రం ఒక సరైన ముగింపు లేకుండా సగం వండి వార్చిన అన్నంలా అనిపిస్తుంది. అలానే దర్శకుడు కొన్ని నిర్మాణ విలువల లోపాలు కనిపిస్తాయి. ఓవరాల్ గా అయితే డబ్బులు పెట్టి థియేటర్స్ లో చూడదగ్గ సినిమా అయితే ఇది కాదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version